Latest Updates
-
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే..
Chanakya Niti: ఈ విషయాలు ఎప్పటికీ భార్యలకు చెప్పొద్దు! ఎందుకో చెప్పిన చాణక్యుడు
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలో గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు. జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు.
భార్యాభర్తల బంధం గురించి చెప్పిన చాణక్యుడు. భర్తలకు కొన్ని సూచనలు చేశాడు. కొన్ని విషయాలను, తమ జీవితంలోని కొన్ని రహస్యాలను ఎప్పటికీ భార్యలతో పంచుకోవద్దని చెప్పాడు చాణక్యుడు. చాణక్యుడు చెప్పిన ఆ విషయాలు ఏంటి, ఎందుకలా చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.
దీని గురించి తక్కువ చేసి చెప్పండి:
భర్త ఏం పని చేస్తున్నాడు, ఎంత జీతం అందుకుంటున్నాడో తెలుసుకోవాలని ప్రతి భార్యకు ఉంటుంది, ఉండాలి కూడా. అయితే జీతం విషయానికి వస్తే మీకు వచ్చే మొత్తం కంటే తక్కువే వస్తుందని చెప్పాలని సూచించాడు చాణక్యుడు.
భర్త జీతం పెరిగితే భార్య ఖర్చులు పెరుగుతాయని చెప్పాడు చాణక్యుడు. అందుకే జీతాన్ని తక్కువ చేసి చెప్పాలని, ఆ మిగిలిన మొత్తాన్ని పొదుపు చేసుకోవడం లేదంటే పెట్టుబడి పెట్టడం లాంటివి చేసి సంపద సృష్టికి మళ్లించాలని చెప్పాడు చాణక్యుడు.
దీని గురించి నిజం చెప్పొద్దు:
మీరు దానధర్మాలు చేస్తే, విరాళాలు అందిస్తే వాటికి మీ భార్య ప్రోత్సాహం ఉంటే సరే కానీ లేకపోతే వాటి గురించి చెప్పకూడదని అన్నాడు చాణక్యుడు. కొందరు భార్యలు దానధర్మాలు చేయడానికి ఇష్టపడరని చెప్పాడు ఆచార్యుడు.
వీటిని బహిర్గతం చేయొద్దు:
భర్త తన బలహీనతలను భార్యకు చెప్పకూడదని అన్నాడు ఆచార్యుడు. బలహీనతలు చెప్పడం వల్ల వారి పట్ల చులకన అయ్యే అవకాశం ఉంటుందని అన్నాడు ఆచార్యుడు. అయితే బలహీనతల గురించి తల్లికి, సోదరికి, స్నేహితుడి చెప్పుకోవాలని చెప్పుకొచ్చాడు చాణక్యుడు. చాణక్యుడు చెప్పిన ఈ సూచనలతో దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
