Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Chanakya Niti: ఈ తప్పులు చేసే తల్లిదండ్రులు పిల్లలకు శత్రువులుగా మారతారు! అవేంటంటే..
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలో గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు. జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు.
ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. తప్పులు చేయని వారంటూ ఉండరు. అయితే తల్లిదండ్రులు చేసే తప్పులు పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పాడు చాణక్యుడు. పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, వారు జీవితంలో స్థిరపడాలన్నా తల్లిదండ్రులు కొన్ని తప్పులు చేయవద్దని హెచ్చరించాడు చాణక్యుడు. చాణక్యుడు చెప్పిన ఆ తప్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సంస్కారం:
పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రులు ఆచార్య చాణక్యుడు పలు సూచనలు చేశాడు. ప్రతి పిల్లాడికి తల్లిదండ్రులు సంస్కారం నేర్పించాలని చెప్పాడు. ఎదుటివారితో సంస్కారవంతంగా ప్రవర్తించలేని వారిని ఎవరూ ఇష్టపడరని చెప్పాడు చాణక్యుడు.
ఒక పిల్లాడిపై మంచి అభిప్రాయం ఏర్పడాలంటే వారు ప్రవర్తించే తీరు చాలా ముఖ్యం. సంస్కారహీనంగా వ్యవహరించే పిల్లాడు, తీరు సరిగ్గాలేని పిల్లాడిని ఎవరూ దగ్గరకు తీయరని, ఎవరూ ఇష్టపడరని చెప్పాడు చాణక్యుడు.
సంస్కారం లేని పిల్లలు తప్పుడు మార్గంలో నడిచే ప్రమాదం ఎక్కువ అని అన్నాడు ఆచార్యుడు. దీని వల్ల వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించాడు చాణక్యుడు.
విద్య:
పిల్లలకు విద్యను అందించడం తల్లిదండ్రుల కర్తవ్యం. ఇందుకోసం పిల్లలకు మంచి విద్యను అందించాలని ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా మార్చుకోవాలని చెప్పాడు. ఒక వయస్సు వచ్చేంత వరకు పిల్లలకు నిర్బంధ విద్య అందించాలని చెప్పాడు చాణక్యుడు.
మంచి విద్య అందించలేని తల్లిదండ్రుల తీరు వల్ల ఆ పిల్లలు భవిష్యత్తులో బాధపడతారని, అవకాశాలు కోల్పోతారని హెచ్చరించాడు చాణక్యుడు.
గారాభం:
పిల్లలను ఎప్పుడూ గారాభం చేయకూడదు. కొన్ని విషయాల్లో కఠినంగా ఉండటమే చాలా మంచిది. పిల్లలను ఎక్కువగా గారాభం చేయడం వల్ల వారు చెడిపోతారని చెప్పాడు చాణక్యుడు.
పిల్లలు మొండిగా మారిపోతారని, అడిగిందే కావాలని అంటుంటారని చెప్పాడు చాణక్యుడు. ఈ మొండితనం పిల్లలకు, వారి తల్లిదండ్రులకు మంచిది కాదని చెప్పాడు ఆచార్యుడు.
బాధ్యతలు:
పిల్లలకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించాలని చెప్పాడు చాణక్యుడు. వారి వయస్సుకు తగినవి, వారు చేయదగినవి, వారి సామర్థ్యానికి తగిన బాధ్యతలు అప్పగించాలని, అలాగే వారు వాటిని ఎంత సక్రమంగా నిర్వర్తిస్తున్నారో కూడా ఎప్పటికప్పుడు గమనించాలని చెప్పాడు చాణక్యుడు. దీని వల్ల వారు భవిష్యత్తులో మంచి జీవితాన్ని అనుభవిస్తారని చెప్పుకొచ్చాడు.
ఈ చిట్కాలతో పిల్లలను ప్రయోజకులుగా మార్చవచ్చని, సమాజానికి ఉపయోగపడే వారిగా తీర్చిదిద్దవచ్చని చాణక్యుడు చెప్పాడు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications