Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
Chanakya Niti: ఇలాంటి వైఖరి ఉన్న వాళ్లు మోసం చేసే అవకాశాలు ఎక్కువ
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలో గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు. జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు. కపటులు, స్వార్థపరులు, మోసగాళ్లు గురించి చెప్పాడు. ఎలాంటి వైఖరి ఉన్న వారు మనల్మి మోసం చేసే అవకాశాలు ఉన్నాయో చాణక్యుడు వివరించాడు.
సమయానికి సహాయం చేయని వారు:
అవసరమైనప్పుడు సహాయం చేయని వారిని ఎప్పటికీ నమ్మకూడదని చాణక్యుడు చెప్పాడు. సహాయం చేయగలిగే పరిస్థితిలో ఉండి కూడా సహాయం కోసం అడిగినప్పుడు నిర్లక్ష్యం చేసే వారు, సాయం చేయడానికి వెనకాడే వారిని ఎప్పటికీ నమ్మకూడదని చాణక్యుడు చెప్పాడు.
అలాంటి వారిని స్వార్థపరులుగా చాణక్యుడు అభివర్ణించాడు. వారు కేవలం స్వప్రయోజనాల కోసమే ఆలోచిస్తారని, ఎదుటివారి అవసరాలు, కష్టాలు వారికి ఎప్పటికీ పట్టవని చాణక్యుడు చెప్పాడు.
ముందు ఒకలా, వెనక ఒకలా మాట్లాడే వ్యక్తులు:
కొంత మంది కాదు, కాదు చాలా మంది ఇలాంటి వ్యక్తులు ఉంటారు. వారు మనం ఉన్నప్పుడు, మనం వింటున్నప్పుడు ఒకలా మాట్లాడతారు. మనం లేనప్పుడు, మనకు తెలిసే అవకాశం లేనప్పుడు ఒకలా మాట్లాడతారు.
మన గురించి ఇతరులకు చెడుగా చెబుతుంటారు. ఇతరుల గురించి మనకు చెడుగా చెబుతుంటారు. అలాంటి వారిని ఎప్పటికీ నమ్మకూడదు. అలాంటి వారిని నమ్మి ఎలాంటి విషయాలు చెప్పకూడదని చాణక్యుడు చెప్పాడు.
పని అయిపోయాక పట్టించుకోని వారు:
తమ పని అయ్యేంత వరకు ఒకలా, పని పూర్తి కాగానే మరోలా వ్యవహరిస్తుంటారు కొందరు వ్యక్తులు. వాళ్లు అచ్చమైన స్వార్థపరులు, అవకాశవాదులు.. అలాంటి వారికి ఎప్పుడూ దూరం పాటించాలని ఆచార్య చాణక్యుడు సూచించాడు.
అలాంటి వారిని దగ్గరకు కూడా రానివ్వకూడదని, వారు మన చుట్టూ ఉంటే మన విలువ పడిపోతుందని చెప్పాడు చాణక్యుడు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications