Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Chanakya Niti: దంపతుల మధ్య ప్రేమ పెరగాలంటే ఇలా చేయాలన్న చాణక్యుడు
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలో గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు. జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు.
భార్యాభర్తల సంబంధం గురించి చెప్పిన చాణక్యుడు.. ఇద్దరి మధ్య ప్రేమ పెరగడానికి పలు సూచనలు చేశాడు. కొన్ని చిట్కాలు పాటిస్తేనే దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుందని చెప్పాడు. చాణక్యుడు చెప్పిన ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్వేచ్ఛ ఇవ్వాలి:
సంబంధంలొ ఒకరికి ఒకరు స్వేచ్ఛ ఇచ్చుకోవాలి. ఒకరికి నచ్చిన విషయం మరొకరికి నచ్చాలన్నా రూల్ ఏమీ లేదు. ఒకరికి నచ్చని విషయంలో వారిని బలవంత పెట్టకూడదు. అలాగే వారికి వారి వ్యక్తిగత సమయాన్ని ఇవ్వాలి. దంపతులైనా ఎవరి జీవితం వారిదే. ఎవరి ఇష్టాయిష్టాలు, అభిరుచులు, విలువలు, అలవాట్లు, అభిప్రాయాలు, నమ్మకాలు వేర్వేరుగా ఉండొచ్చు. వాటిని గౌరవించాలి, నమ్మాలి. స్వేచ్ఛ ఇవ్వగలిగితే వారు వారిలా ఉంటూ మీతో కూడా సన్నిహితంగా, ప్రేమగా ఉంటారు.
అహంకారం విడిచిపెట్టాలి:
సంబంధంలో ఉన్నప్పుడు అహంకారం పనికిరాదని చెప్పాడు చాణక్యుడు. అహంకారం వల్ల సంబంధాలు దెబ్బతింటాయని, సంబంధంలో చీలికలు వస్తాయని చెప్పాడు. కోపం, అహంకారం వల్ల దంపతులు ఇద్దరి మధ్య సాన్నిహిత్యం తొలగిపోయి దూరంగా పెరుగుతుందని చెప్పాడు ఆచార్యుడు. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలంటే అహంభావాన్ని పక్కన పెట్టాలని సూచించాడు ఆచార్యుడు.
అనుమానం పెట్టుకోవద్దు:
దంపతులు అంటే ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్న చోటే ప్రేమ ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చాణక్యుడు చెప్పాడు. నమ్మకం ఒక్కరోజులో వచ్చేది కాదని దానికి చాలా సమయం పడుతుందని అన్నాడు. అలాగే ఆ నమ్మకం పోవడానికి ఒక్క క్షణకాలం సరిపోతుందని హెచ్చరించాడు. అనుమానం పెట్టుకోవడం వల్ల వారితో సాన్నిహిత్యంగా మెలగకపోవడంతో పాటు మన మనస్సు కూడా ప్రశాంతత కోల్పోతుందని చెప్పాడు ఆచార్యుడు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications