Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Chanakya Niti: ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి! జీవితంలో సమస్యలు సృష్టించి సతమతం చేస్తారు
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలో గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు. జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు.
జీవితం గురించి చెబుతూ చాణక్యుడు పలు సూచనలు చేశాడు. కొన్ని రకాల వ్యక్తులతో జీవితంలో సమస్యలు ఎదురవుతాయని ఆచార్యుడు హెచ్చరించాడు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండకపోతే సమస్యలతో సతమతం కావాల్సి ఉంటుందని చెప్పాడు.
దుష్ట భార్యా శతం మిత్రం భృత్యశ్చోత్తరదాయకః|
ససర్పే చ గృహే వాసో మృత్యురేవ న సంశయః||
చెడు స్వభావం గల భార్య, నీచమైన స్నేహితులు, జవాబుదారీ లేని సేవకులు, ఇంట్లో నివసించే మోసగాళ్లతో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వ్యక్తులతో ఎప్పుడూ ప్రమాదమే.
చెడ్డ స్నేహితుడు:
ఆచార్య చాణక్యుడు స్నేహితుల గురించి చెబుతూ ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితులు చాలా అవసరమని చెప్పాడు. కుటుంబ సభ్యులతో, తోబుట్టువులతో, జీవిత భాగస్వామితో పంచుకోలేని కొన్ని విషయాలను స్నేహితులతో పంచుకుంటామని అన్నాడు చాణక్యుడు. చెడ్డ వారితో స్నేహం చేస్తే వారు మనకు ఇబ్బందులు తెచ్చి పెడతారని చెప్పాడు ఆచార్యుడు. మోసం చేసే వ్యక్తులతో స్నేహం ఎప్పటికీ మంచిది కాదని హెచ్చరించాడు.
అలాంటి భార్యతో జీవించడం సమస్యలు తెచ్చిపెడుతుంది:
భార్యలు భర్తలకు చేదోడు వాదోడుగా ఉండాలి. కష్టనష్టాల్లో మంచి ఆలోచనలు పంచుకోవాలి. వారు తప్పుడు దారిలో నడుస్తుంటే హెచ్చరించి సరైన దారికి తీసుకువచ్చేలా ఉండాలి. కానీ వారే చెడు స్వభావం కలిగిన వారైతే ఆ దాంపత్యం సమస్యల పుట్టలా మారుతుందని చెప్పాడు చాణక్యుడు. ఆత్మ సంతృప్తి లేని భార్యతో జీవితాన్ని పంచుకోవడం, ఎప్పుడూ గొడవలు పడే భార్యతో జీవించడం వల్ల మానసిక ప్రశాంతత దూరమవుతుందని చెప్పాడు.
ఎదురించే పనివాడు:
ఇంట్లో పనివారు, వ్యాపారంలో పనివారు ఎప్పుడు యజమానులపై గట్టిగా మాట్లాడకూడదని చాణక్యుడు చెప్పాడు. ప్రతి దానికి సమాధానం చెప్పి, ఎదురించి మాట్లాడే వారిని పనిలో ఉంచకోకూడదని చెప్పాడు ఆచార్యుడు. అలాంటి వారి సమస్యలు ఎదురవుతాయన్నాడు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications