Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
Chanakya Niti: ఈ లక్షణాలున్న పురుషులంటే స్త్రీలకు చాలా ఇష్టం
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలో గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు. జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు.
మహిళలు, పురుషుల మధ్య సంబంధాల గురించి చెప్పిన చాణక్యుడు.. పురుషులకు కొన్ని చిట్కాలు చెప్పాడు. అలాగే పురుషుల్లో ఉన్న కొన్ని లక్షణాలు అంటే మహిళలు బాగా ఇష్టపడతారని, ఆ క్వాలిటీస్ తో మహిళల మనుసును సులభంగా గెలుచుకోవచ్చని చెప్పాడు. చాణక్యుడు చెప్పిన ఆ లక్షణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిజాయితీ, మంచి స్వభావం:
మహిళలు ఎక్కువగా ఇష్టపడే వాటిలో మొదటి నిజాయితీ. నిజాయితీ గల పురుషులను మహిళలు ఎక్కువగా ఇష్టపడతారని చాణక్యుడు చెప్పాడు. నిజాయితీగా ఉండే వారినే తమ జీవిత భాగస్వాములుగా కోరుకుంటారని చెప్పాడు ఆచార్యుడు. స్వభావం కూడా బాగుండాలని కోరుకుంటారట స్త్రీలు. ఈ లక్షణాలు ఉంటే స్త్రీలు సులభంగా ఆకర్షించవచ్చని చెప్పాడు ఆచార్య చాణక్యుడు.
ప్రశాంతత:
తరచూ కోపం తెచ్చుకునే వారంటే ఎవరికీ ఇష్టం ఉండదు. అలాగే చీటికి మాటికి కోపం తెచ్చుకునే పురుషులు అంటే మహిళలకు పెద్దగా ఇష్టపడరని చెప్పాడు చాణక్యుడు. ప్రశాంతంగా ఉంటూ పనులు చక్కదిద్దే వారినే మహిళలు ఇష్టపడతారట. అలాంటి వారినే జీవిత భాగస్వామిగా కోరుకుంటారని చెప్పాడు చాణక్యుడు.
మంచి వ్యక్తిత్వం:
మాట తీరు, స్వభావం, మంచి వ్యక్తిత్వం ఉన్న పురుషులను స్త్రీలు ఇష్టపడతారని చాణక్యుడు చెప్పాడు. అలాంటి పురుషులతో మహిళలు చాలా చనువుగా ఉంటారని, అలాంటి మగవారినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటారని ఆచార్యుడు పేర్కొన్నాడు.
కష్టపడే వ్యక్తి:
కష్టానికి ఎప్పుడూ ప్రతిఫలం ఉంటుంది. అలాగే కష్టపడి పని చేసే వ్యక్తి ఎప్పటికైనా ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. అలాంటి వ్యక్తినే మహిళలు ఇష్టపడతారని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వ్యక్తులను ఎవరైనా ఇష్టపడతారని చెప్పుకొచ్చాడు ఆచార్య చాణక్యుడు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications