Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Chanakya Niti: ప్రతి మనిషి జంతువుల నుండి నేర్చుకోవాల్సిన లక్షణాలు
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలో గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు. జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు. జంతువుల నుండి కొన్ని లక్షణాలను మనుషులు అలవర్చుకోవాలని చాణక్యుడు చెప్పాడు. ఒక్కో జంతువు నుండి మనిషి అలవర్చుకోవాలని చాణక్యుడు చెప్పిన ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాము:
పాములకు కాళ్లు లేకపోయినా, పాకుతూ వేటాడతాయి. నీ బలహీనతను ఎవ్వరూ చూడనివ్వకండి అని చాణక్యుడు చెప్పాడు. మీకు ఒక బలహీనత ఉంటే, మీకున్న మరో బలంతో దానిని మరుగున పడనివ్వాలని చెప్పాడు చాణక్యుడు.
డేగ:
డేగ తన లక్ష్యాలను సాధించడంలో ఎప్పుడూ విఫలం కాదు. అలాగే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకునే ముందు చాలా ఆలోచిస్తుంది. సాధ్యాసాధ్యాలు సరిగ్గా అంచనా వేస్తుంది. పరిస్థితులు అనుకూలించే వరకు వేచి చూస్తుంది. అదను చూసి దాడి చేసి లక్ష్యాన్ని సాధిస్తుంది.
అలాగే మనిషి కూడా లక్ష్యాలను నిర్దేశించుకునే ముందు వాటిని సరిగ్గా అంచనా వేయాలని చాణక్యుడు చెప్పాడు. వాటి కోసం ఎంత కష్టపడాలి, ఎలా కష్టపడాలో తెలిసి ఉండాలని ఆచార్యుడు చెప్పాడు. తొందరపాటు ఎప్పుడూ పనికిరాదని, అలాగే అందివచ్చిన అవకాశాలను ఎప్పటికీ వదిలిపెట్టకూడదని చాణక్యుడు చెప్పాడు.
సింహం:
సింహం వేటాడేముందు చాలా జాగ్రత్తగా మాటు వేస్తుంది. తాను వేటాడబోయే జంతువు చిన్నదైనా, పెద్దదైనా సింహం యొక్క కృషి మాత్రం ఒకే రకంగా ఉంటుంది. అలాగే పని చిన్నదైనా, పెద్దదైనా ఒకే తరహా ఏకాగ్రత, శ్రద్ధతో పనులు చక్కబెట్టాలని చాణక్యుడు చెప్పాడు.
గాడిద:
గాడిదలు ఎంత బరువైనా మోస్తాయి. ఎంతదూరమైన అలసట లేకుండా బరువు మోయగలవు. అయితే వాటి బలాబలాల గురించి దాని యజమానికి తెలిసినంతగా దానికి తెలియదు. అందుకే ఎప్పుడూ ఒకరి కింద పని చేస్తూ బానిసత్వాన్ని భరిస్తుంటాయి.
మనిషి ఎప్పుడూ అలా ఉండకూడదని అంటాడు చాణక్యుడు. తమ బలాబలాల గురించి సరైన అవగాహన కలిగి ఉండాలని చెబుతాడు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications