Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
Chanakya Niti: ఇలాంటి మహిళలను పెళ్లి చేసుకుంటే జీవితం ఆనందమయం అవుతుంది
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలో గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు. జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు.

వైవాహిక జీవితం గురించి చెప్పిన చాణక్యుడు కొందరు మహిళలను పెళ్లి చేసుకుంటే జీవితం ఆనందమయం అవుతుందని చెప్పాడు. ఆచార్య చాణక్యుడి ప్రకారం ఎలాంటి మహిళలను పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి వారిని చేసుకుంటే జీవితం సంతోషంగా సాగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ లక్షణం ఉన్న మహిళతో జీవితం బాగుంటుంది:
ఓపిక ఉన్న మహిళను పెళ్లి చేసుకున్న వ్యక్తి జీవితం సంతోషంగా ఉంటుందని చాణక్యుడు చెప్పుకొచ్చాడు. అలాంటి వారు భర్తలకు ధైర్యాన్ని ఇస్తారని చెప్పాడు ఆచార్యుడు. కష్టపడి పని చేసి ఓపికగా ఫలితం కోసం చూసే వారి వల్ల జీవితం బాగుంటుందని చెప్పాడు. అలాంటి మహిళలు క్లిష్ట పరిస్థితుల్లో కూడా భర్తకు మద్దతుగా ఉంటారని అన్నాడు.
ఈ స్వభావం ఉన్న స్త్రీ భర్తకు సంతోషాన్ని ఇస్తుంది:
ప్రశాంత స్వభావం కలిగి ఉంటే మహిళను పెళ్లి చేసుకున్న వ్యక్తిని అదృష్టవంతుడిగా అభివర్ణించాడు చాణక్యుడు. ఇలాంటి వారికి కోపం త్వరగా రాదని, ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చాణక్యుడు చెప్పాడు. ఇలాంటి వారి వల్ల ఇంట్లో కలహాలు, గొడవలు జరగకుండా ఉండి ప్రశాంత జీవితం దక్కుతుందని చెప్పాడు చాణక్యుడు.
ఇలా మాట్లాడే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే జీవితం సంతోషమయం:
మర్యాదపూర్వకంగా, మధురంగా మాట్లాడే భార్య దొరకడం అదృష్టమని చెప్పాడు చాణక్యుడు. మర్యాద ఇస్తూ మాట్లాడే భార్య వల్ల గౌరవం దక్కుతుందని, కలహాలూ కూడా రావని చెప్పాడు. మధురంగా మాట్లాడే భార్యతో జీవితం ఆనందంగా ఉంటుందన్నాడు చాణక్యుడు. చాణక్యుడు చెప్పిన ఈ చిట్కాలతో జీవితం ఆనందమయం అవుతుంది.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
