Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
Chanakya Niti: విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగాలా? చాణక్యుడు చెప్పిన ఈ చిట్కాలు పాటించండి
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలో గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు. జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు.
చాణక్యుడు వ్యాపారం గురించి చెబుతూ పలు సూచనలు చేశాడు. ఒక వ్యక్తి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగడానికి చాణక్యుడు చెప్పిన ఆ చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రిస్క్ తీసుకునే ధైర్యం ఉండాలి:
ఆచార్య చాణక్యుడు వ్యాపారం గురించి చెబుతూ.. అందులో విజయం సాధించాలంటే ముందుగా రిస్క్ తీసుకునే ధైర్యం ఉండాలని చెప్పుకొచ్చాడు. వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయని, అటువంటి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే కఠిన పరిస్థితుల నుండి త్వరగా బయటపడవచ్చని చెప్పాడు ఆచార్యుడు.
అవకాశాలు అందిపుచ్చుకోవాలి:
ఆచార్య చాణక్యుడు ఉపాధ్యాయుడు మాత్రమే కాదు.. విజయవంతమైన ఆర్థిక వేత్త కూడా. ఆయన వ్యాపారాన్ని లోతుగా అధ్యయనం చేశారు. విజయవంతమైన వ్యాపారవేత్తకు ఉండే ప్రధాన లక్షణం, ఉండాల్సిన అతిముఖ్యమైన లక్షణం గురించి చెప్పిన చాణక్యుడు.. అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించాడు. ఏ మూలలోనైనా వ్యాపారం చేసే అవకాశం వస్తే అందుకు సిద్ధంగా ఉండాలని చెప్పాడు.
మంచి ప్రవర్తన కలిగి ఉండాలి:
వ్యాపారవేత్తలకు ప్రవర్తన చాలా ముఖ్యం. సమర్థవంతమైన ప్రవర్తన కలిగిన వ్యక్తి వ్యాపార రంగంలో త్వరగా విజయం సాధిస్తారు. అందుకే వ్యాపారం చేసేటప్పుడు మాటపై సంయమనం పాటించి విషయాలను అర్థం చేసుకున్న తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవాలి.
విషయాలు విని వాటిని అర్థం చేసుకున్న తర్వాత స్పందించే వ్యక్తి వ్యాపారంలో కచ్చితంగా విజయం సాధిస్తాడు. అందుకే విజయవంతమైన వ్యాపారవేత్తగా మారడానికి మధురంగా మాట్లాడాలి.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications