Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
సంసారం సుఖంగా ఉండాలంటే ఈ పనులు చేయాలి..!
చాణక్య నీతి అనగానే చాలా మంది చాణక్యుడు రాజకీయం గురించి వ్యక్తిత్వ వికాసంపై, విద్యార్ధుల గురించి మాత్రమే చెప్పాడని అనుకుంటారు. కానీ చాణక్యకుడు వివాహం, ప్రేమ, లైంగిక సంబంధాల గురించి కూడా తన అభిప్రాయాలను చెప్పాడు. భార్యా భర్తలు ఎలా మెలగాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లాంటి ఎన్నో అంశాలపై ఆయన తన బోధనలను వివరించాడు. ప్రస్తుతం వివాహ బంధాలు ఎక్కువగా నిలవడం లేదు. చాలా కేసుల్లో విడుకులు అవుతున్నాయ్. కొంత కాలం వరకే ఇద్దరూ భార్యా భర్తలుగా కొనసాగుతున్నారు. వివాహ బంధంలో ఇద్దరూ బలంగా ఉండాలంటే కొన్ని నీతులను పాటించమన్నాడు, వాటిని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తమవమన్నాడు లేదంటే భార్యా భర్తల మధ్య దూరం మరింత పెరిగే అవకాశంఉందని చాణక్య నీతి చెబుతోంది.
కోపం తెచ్చుకోవద్దు
కోపం అసలెవ్వరికీ మంచి లక్షణం కాదని చాణక్యుడు చెబుతాడు. కోపం వల్ల నష్టాలే కానీ లాభాలు ఉండవని అంటాడు. భార్యా భర్తలు చిన్ని చిన్న విషయాలపై కోపం తెచ్చుకోవద్దని చెబుతాడు. మనిషిలో కోపం వుంటే ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేమని అంటాడు. కోపాన్ని పట్టుకొని వేలాడితే బంధాన్ని వదులుకునే పరిస్థితి ఏర్పడుతుందంని చాణక్యుడు చెబుతున్నాడు.

కమ్యునికేషన్ తప్పనిసరి
భార్యా భర్తలు ఒకరితో ఒకరు తప్పకుండా ప్రతి రోజూ మాట్లాడుకుంటూనే వుండాలి. దూరంగా ఉన్నా మాట్లాడటం ఆపవద్దు. మీరు ఎంతగా కమ్యునికేషన్‌లో వుంటే మీ బంధం అంత బలంగా వుంటుంది. ఏవిషయాన్నైనా సరే మీ భాగస్వామితో ఖచ్చితంగా పంచుకొని తీరాలి. అప్పుడు మాత్రమే మీ మధ్య దూరం తగ్గి మరింత దగ్గరౌతారు. మాట్లాడకపోతే ఘర్షణలు తలెత్తి మీ బంధం రోజురోజుకీ బలహీనంగా మారిపోతుంది.
పరస్పర గౌరవం
భార్యా భర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ఇద్దరూ ఒకరిపై ఒకరు గౌరవం చూపాలి. ఎగతాళి చేసుకోకూడదు. ఇద్దరికీ గౌరవం ఉంటేనే బంధం కొనసాగుతుంది. గౌరవం కొరవడినప్పటి నుంచి విభేదాలు మొలకెత్తినట్టని భావించాలి. జీవితంలో దాదాపు అన్ని సమస్యలకూ మనమే కారణమని అంటాడు.
ఒకరిపై ఒకరికి సహకారం
భార్యా భర్తలిద్దరూ ఒకరికి ఒకరు సహకరించుకోవాలి. అలా చేసుకున్నప్పుడే వారి మధ్య ఘర్షణలు తలెత్తకుండా వుంటుంది. ఇంటి పనుల్లో భర్త భార్యకు సహాయకారికగా వుండాలి. భర్తకు వుండే మానసిక ఒత్తిడిని దూరం చేయడం భార్య సహకరించాలి.
ఎప్పుడూ నిజాన్నే చెప్పాలి
భార్యా భర్తల మధ్య అబద్ధాలు వుండవద్దు. ఎలాంటి దాపరికాలు ఇరువురి మధ్య వుండడానికి అవకాశం ఇవ్వవద్దు. పూర్తి పారదర్శకంగా వుండాలి. ఇద్దరూ ఏ విషయాన్ని దాచే ప్రయత్నం చేయవద్దు. నిజమే ఇద్దరినీ మరింత దగ్గరికి చేస్తుంది. అబద్దం గొడవలకు దారి తీస్తుంది. అబద్ధం చెబితే నమ్మకం పోతుంది. అది బంధాన్ని దెబ్బతీస్తుందన్న విషయాన్ని మరిచిపోవద్దు.
భార్య ఇలా వుండాలి
స్త్రీలు వారి భర్తలకు సేవ చేయాలి. భర్తే వారికి స్వరం, సర్వసం అన్న విషయం మరిచిపోవద్దు. దీన్ని అవకాశంగా తీసుకొని భర్త భార్య పై అధికారం చూపించకూడదు. స్త్రీ పట్ల చెడగా ప్రవర్తిస్తే సమాజంలో ఆ భర్త అవమానాల్ని ఎదుర్కోవలసి వస్తుంది.
భర్త ఇలా వుండాలి
భర్త తన భార్యను ఎప్పుడూ గౌరవించాలి లేదంటే గౌరవం పోగొట్టుకుంటాడు. ఇతర స్త్రీల గురించి భర్త ఎప్పుడూ మాట్లాడకూడదు.



Click it and Unblock the Notifications