Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ChatGPT Water Consumption: 50 క్వశ్చన్లు అడిగితే అర లీటరు నీళ్లు తాగుతున్న చాట్‌జీపీటీ
టెక్నాలజీ రంగంలో చాట్‌జీపీటీ ఓ పెను సంచలనం. ప్రస్తుతం ప్రపంచమంతా ఈ ఏఐ చాట్ బోట్‌ను తెగ వాడేస్తున్నారు. చాట్ జీపీటీ అందుబాటులోకి వచ్చినప్పటి నుండి కోట్లాది మంది దీని వాడకాన్ని మొదలుపెట్టారు. టెక్నాలజీ రంగంలో ఇదో సంచలనంగా మారింది.
చాట్ జీపీటీ తో ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ దీని వల్ల దుష్ప్రభావాలు ఉంటాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాట్ జీపీటీ వల్ల చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోతారని ఆందోళన పడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వెలుగుచూసిన ఓ స్టడీ ప్రకారం చాట్ జీపీటీ యూజర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి పెద్ద మొత్తంలో నీళ్లు తాగేస్తుందట.

50 క్వశ్చన్లకు అర లీటరు నీరు:
20-50 ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు చాట్ జీపీటీ దాదాపు అర లీటరు నీళ్లు తాగేస్తున్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. చాట్‌జీపీటీ డేటా సెంటర్ల నిర్వహణకు అవసరం అయ్యే విద్యుత్ ఉత్పత్తికి, సర్వర్లను చల్లబరిచేందుకు అవసరమయ్యే నీటి వినియోగాన్ని లెక్కగట్టారు. చాట్ జీపీటీ డేటా సెంటర్లలో సముద్రపు నీటిని కాకుండా మంచి నీటినే వాడాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జీపీటీ-3 శిక్షణకే 7 లక్షల లీటర్ల నీరు:
జీపీటీ-3 శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ 7 లక్షల లీటర్ల నీటిని వాడుకుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. చాట్ జీపీటీ డేటా సెంటర్ల మెయింటెనెన్స్ కు భారీగా నీటిని వాడాల్సి ఉంటుందని ఈ అధ్యయనంలో నిపుణులు తేల్చారు. జీపీటీ-4 కోసం నీటి వాడకం దీనికి అనేక రెట్లు పెరుగుతుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
న్యూక్లియర్ రియాక్టర్ స్థాయిలో నీటి వాడకం:
శాస్త్రవేత్తల ప్రకారం, జీపీటీ-3 శిక్షణ ఇవ్వడానికి స్వచ్ఛమైన నీటిని వాడారు. న్యూక్లియర్ రియాక్టర్ యొక్క కూలింగ్ టవర్ ను పూరించడానికి వాడే నీటి మొత్తంతో ఇది సమానమని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
10వేల గ్రాఫిక్ కార్డులు, 2.85 లక్షల ప్రాసెసర్ కోర్‌లు:
ఏఐ శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్ సూపర్ కంప్యూటర్లను నిర్మించింది. ఈ సూపర్ కంప్యూటర్లను కూల్ చేయడానికి లక్షల లీటర్ల నీరు అవసరం. ఈ సూపర్ కంప్యూటర్లలో 10 వేల గ్రాఫిక్ కార్డులు, 2.85 లక్షల ప్రాసెసర్ కోర్ లు ఉంటాయి.
గూగుల్ LaMDA తక్కువదేమీ కాదు:
కేవలం చాట్ జీపీటీకి మాత్రమే లక్షల కొద్దీ లీటర్ల నీటిని వినియోగిస్తుందనుకుంటే పొరబడినట్లే. గూగుల్ LaMDA ఏఐ మాడల్ కు కూడా మిలియన్ల కొద్దీ నీళ్లు అవసరం అవుతుంది.



Click it and Unblock the Notifications