Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
365 Days Paid Leave: 365 రోజుల పెయిడ్ లీవ్, కంపెనీ లక్కీ డ్రాలో ఉద్యోగికి జాక్‌పాట్
పని చేస్తున్న సంస్థ ఇప్పుడో అప్పుడో ఏదైనా చిన్న పార్టీ ఇస్తే ఉద్యోగుల ఆనందం వేరే లెవల్‌లో ఉంటుంది. మార్కెటింగ్ విభాగాల్లో పని చేసే వారు అప్పుడప్పుడు రిసార్టులకు వెళ్తుంటే 'మీకేంట్రా పెట్టి పుట్టారు' అంటారు ఇతర విభాగాల ఉద్యోగులు. చిన్న చిన్న కాంటెస్ట్ లు పెట్టి గిఫ్ట్స్ ఇస్తే ఉద్యోగుల తెగ ఆనందపడిపోతారు. గిఫ్ట్స్, కూపన్లు లాంటివి ఇస్తే ఎగిరి గంతేసినంత సంతోషపడతారు.
అయితే చైనాలో ఓ కంపెనీ తమ ఉద్యోగులు ఒత్తిడి నుండి బయటపడేందుకు పార్టీ ఇచ్చింది. ఇందులోనే ఓ లక్కీ డ్రా కూడా నిర్వహించింది. అందులో ఓ ఉద్యోగికి ఏకంగా 365 రోజుల పెయిడ్ లీవ్స్ ను గెలుచుకున్నాడు. ఆ విషయం తెలియగానే ఆ ఉద్యోగి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

౩65 రోజుల పెయిడ్ లీవ్స్:
రెండు మూడు రోజుల క్రితం ఇందుకు సంబంధించి ట్విట్టర్ లో ఓ యూజర్ పోస్టు చేస్తూ 365 రోజుల పెయిడ్ లీవ్స్ గురించి చెప్పుకొచ్చాడు. కంపెనీ నిర్వహించిన లక్కీ డ్రాలో తనకు వచ్చిన జాక్ పాట్ గురించి తెలుసుకుని ఆ ఉద్యోగి షాక్ అయ్యాడట. కాసేపటి వరకు ఆ షాక్ నుండి తేరుకోలేకపోయాడని స్థానిక మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రసారం చేశాయి.
కరోనా కారణంగా పార్టీ నిర్వహించని కంపెనీ:
సదరు కంపెనీ తన ఉద్యోగులకు అప్పుడప్పుడు పార్టీలు ఇస్తుంటుంది. పని ఒత్తిడి నుండి కాసేపు ఉపశమనం కలిగించేలా ఉద్యోగులను ప్రోత్సహించేలా పార్టీ ఇవ్వడంతో పాటు ఇలాంటి లక్కీ డ్రాలు నిర్వహిస్తుంది. అయితే కరోనా కారణంగా గత మూడేళ్ల నుండి పార్టీలు ఇవ్వడం లేదు సదరు కంపెనీ. చాలా కాలం తర్వాత ఇస్తున్న పార్టీ కావడంతో స్పెషల్ జాక్ పాట్లను ప్లాన్ చేసింది ఆ కంపెనీ యాజమాన్యం.
ప్రస్తుతం 365 రోజుల పెయిడ్ లీవ్స్ గెలుచుకున్న ఆ ఉద్యోగి, ఇంటి వద్దే ఉంటూ 365 రోజుల జీతం తీసుకుంటాడా, లేదంటే ఆ పెయిడ్ లీవ్స్ ను ఎన్‌క్యాష్ చేసుకుని ఎప్పట్లాగే ఆఫీసుకు వస్తాడా అనే విషయం తెలియాల్సి ఉంది.
అసలు ఆ కంపెనీ పేరు ఏంటి, దాని వివరాలు, ఆ ఉద్యోగి వివరాలు మాత్రం ఇప్పటికైతే బయటకు రాలేదు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుండటంపై యూజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
కంపెనీ ఇచ్చిన జాక్‌పాట్‌ను ఉపయోగించుకుని ఏడాది పాటు ఎంజాయ్ చేయ్ బ్రో అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏడాది పాటు ఉద్యోగానికి దూరమైపోతే నీ ప్లేసులో ఇంకొకరు వచ్చేస్తారని మరొకరు హెచ్చరిస్తూ కామెంట్ పెట్టారు. కంపెనీ ఇచ్చిన ఆ జాక్‌పాట్‌ను యాక్సెప్ట్ చేయడానికి కూడా గుండె ధైర్యం కావాలంటూ మరొకరు కామెంట్ పెట్టారు.



Click it and Unblock the Notifications