Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కొడుకు ఫ్రెండ్ తో కాపురం చేసిన ఆంటీ..ప్రెగ్నెంట్ అవడంతో..
సాధారణంగా ప్రేమలో,యుద్ధంలో అంతా న్యాయమే అంటుంటారు. అందుకే ఇటీవల కాలంలో ప్రేమ కోసం హత్యలు కూడా జరుగుతున్నాయి. ప్రియుడు కోసం భర్తలను చంపుతున్న పెళ్లాలు, ప్రేయసి కోసం భార్యను చంపుతున్న భర్తలు, లవర్ కోసం కన్న తల్లిదండ్రులను చంపుతున్న పిల్లలు నిత్యం ఇలాంటి అనేక సంఘటనలు టీవీల్లో,పేపర్లలో చూస్తూనే ఉన్నాం. కొందరు అయితే వయస్సుతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసుకుంటారు..ఇందులో కొందరిది లవ్ కాగా మరికొందరికి డబ్బు అవసరాలు. అయితే సంబంధాలలో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి.
తాజాగా ఓ మహిళ తన కొడుకు స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె 50 ఏళ్ల వయసులో మూడోసారి ప్రెగ్నెంట్ కూడా అయింది. ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. చైనాలో జరిగిన ఈ సంఘటనపై సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ మీడియా నివేదిక ప్రకారం ఆ చైనీస్ మహిళ ఆన్ లైన్ లో'సిస్టర్ షిన్' గా ప్రసిద్ధి చెందింది. ఆమెకు గ్వాంగ్ జౌలో ఈ కామర్స్ వ్యాపారం ఉంది. షిన్ 30 సంవత్సరాల వయసులో తన భర్త నుండి విడిపోయింది. ఆమె తన కొడుకు, కుమార్తెను ఒంటరిగా పెంచాలని నిర్ణయించుకుంది. షిన్ తరుచుగా తన లగ్జరీ లైఫ్ కు సంబంధించిన వివరాలను తరచుగా చైనీస్ సోషల్ మీడియా డౌయిన్(douyin)లో షేర్ చేస్తుంటది.

అయితే దాదాపు ఆరు సంవత్సరాల క్రితం షిన్ కుమారుడు కైకై తన ముగ్గురు క్లాస్ మెట్స్ ను నూతన సంవత్సర పండుగ సందర్భంగా తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. కైకై ముగ్గురు స్నేహితులలో రష్యాకు చెందిన డెఫు అనే యువకుడు కూడా ఉన్నాడు. డెఫు.. కైకై కంటే ఒక సంవత్సరం పెద్దవాడు. చాలా సంవత్సరాలు చైనాలో నివసించిన అతను చైనీస్ భాషలో ప్రావీణ్యం సంపాదించాడు. అతను ఆ భాషను అనర్గళంగా మాట్లాడగలడు. అతని మిగిలిన స్నేహితులు ఇల్లు వదిలి వెళ్ళినప్పటికీ, షిన్ ఆతిథ్యానికి సంతోషంగా డెఫు ఒక వారం పాటు వారి ఇంట్లోనే ఉన్నాడు. ఆ సమయంలోనే అతను తన స్నేహితుడి తల్లితో ప్రేమలో పడ్డాడు.
డెఫు.. షిన్ ఇంటి నుండి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆమెతో సంబంధాలు కొనసాగించాడు. ఆమెకు గిఫ్ట్ లు కూడా పంపాడు. 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు తేడా ఉన్నప్పటికీ, ఆ వయస్సు వారి ప్రేమను ఆపలేకపోయింది. తన తల్లి తన స్నేహితుడితో ప్రేమలో ఉందని కైకైకి తెలిసింది. అయితే ఆమె ఆ సంబంధానికి అభ్యంతరం చెప్పలేదు. దీని తర్వాత షిన్ తన కొడుకు స్నేహితుడిని వివాహం చేసుకుంది.
మూడోసారి ప్రెగ్నెంట్
షిన్ కు ప్రస్తుతం 50 ఏళ్లు. జూన్ 8న ఆమె తన మూడవ గర్భధారణను ప్రకటించింది. ఆమె సోషల్ మీడియాలో "పెద్ద వయసులో గర్భం దాల్చడం ప్రమాదకరం. కానీ డేఫుకి ప్రతిదీ సాధ్యమే" అని పెట్టింది. షిన్ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. చాలా మంది నెటిజన్లు ఈ జంటను అభినందించారు. మరికొందరు ఈ వయస్సులో ఇదేం పని, కలికాలం అని,ఇలా చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications