Latest Updates
-
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
లవర్ కి, దోస్తులకి పంపాల్సిన బెస్ట్ చాక్లెట్ డే మెసేజ్ లు..ఇలా చెప్పారంటే ఇంప్రెస్ అయిపోవాల్సిందే!
వాలంటైన్స్ వీక్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7న మొదలై ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేతో ముగుస్తుంది. ఈ వారంలోని ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. వాలంటైన్ వీక్ లో మూడవ రోజు అంటే ఫిబ్రవరి 9న చాక్లెట్ డే జరుపుకుంటారు. రోజ్ డే రోజున పువ్వు ఇచ్చి, ప్రపోజ్ డే రోజున మనసులోని మాట చెప్పిన తర్వాత..ఆ బంధాన్ని మరింత తీపిగా మార్చుకోవడానికి చాక్లెట్ డే జరుపుకుంటారు.
చాక్లెట్ అంటే కేవలం ఒక తీపి పదార్థం మాత్రమే కాదు.. అది ప్రేమ, ఆప్యాయత, సంరక్షణకు ప్రతీక. మనసుకు నచ్చిన వారికి చిన్న చాక్లెట్ ఇచ్చినా అది వారి ముఖంలో వెలకట్టలేని చిరునవ్వును తెస్తుంది. ఈ చాక్లెట్ డే రోజున మీ భాగస్వామికి, స్నేహితులకు, లవర్ కు అందమైన కోట్స్, విషెస్ పంపి వారి రోజును మరింత స్వీట్ గా ఎలా మార్చేయాలో ఇక్కడ చూడండి.

లవర్ కి ఇలా చెప్పండి
-అత్యంత ఖరీదైన చాక్లెట్ కంటే నువ్వు నా జీవితాన్ని మరింత మధురంగా మార్చావు. నీతో గడిపే ప్రతి క్షణం నా మనసును కరిగిస్తుంది. హ్యాపీ చాక్లెట్ డే మై లవ్.
-చాక్లెట్ తింటే మనసు ఎలా ఉల్లాసంగా మారుతుందో, నా కష్టకాలంలో నువ్వు నా పక్కన ఉంటే నా జీవితం అంత అందంగా మారుతుంది. ఈ రోజు నీకు అంతా మంచే జరగాలి.
-నా సంతోషానికి అసలైన చిరునామా నువ్వే.. నా మనసును పూర్తిగా గెలుచుకున్న నీకు చాక్లెట్ డే శుభాకాంక్షలు.
-నీకోసం ఒక చాక్లెట్ బాక్స్, బోలెడంత ప్రేమను పంపిస్తున్నా.. మన బంధం ఎప్పుడూ నీకు ఇష్టమైన డార్క్ చాక్లెట్‌లా స్వచ్ఛంగా, గాఢంగా ఉండాలి. హ్యాపీ చాక్లెట్ డే.
-నా జీవితంలో నువ్వు ఎంత స్వీట్ గా ఉంటావో, ఈ చాక్లెట్ కూడా అంతే స్వీట్ గా ఉంటుంది. హ్యాపీ చాక్లెట్ డే.
-చాక్లెట్ కరిగిపోయినట్లుగా.. నీ ప్రేమలో నేను కరిగిపోయాను. చాక్లెట్ డే శుభాకాంక్షలు.
-ఈ ప్రపంచంలో చాక్లెట్ కంటే తీనైనది ఏదైనా ఉందంటే.. అది కేవలం నీ చిరునవ్వు మాత్రమే. హ్యాపీ చాక్లెట్ డే మై లవ్.
-డైరీ మిల్క్ అంత స్మూత్ గా, కిట్ క్యాట్ అంత క్రంచీగా మన ప్రేమ ఉండాలి. చాక్లెట్ డే శుభాకాంక్షలు.
-తీపి చాక్లెట్.. దానికంటే తీనైన నువ్వు.. మీ ఇద్దరూ నా జీవితంలో ఉండడం నా అదృష్టం. హ్యాపీ చాక్లెట్ డే.
-జీవితం ఒక చాక్లెట్ బాక్స్ లాంటిది.. ప్రతి క్షణం మన ప్రేమతో కొత్త రుచిని ఆస్వాదిద్దాం.
-చేదు లేని చాక్లెట్, గొడవలు లేని ప్రేమ ఉండవు. కానీ చివరికి మిగిలేది తీపి మాత్రమే. హ్యాపీ చాక్లెట్ డే.
-నువ్వు నా పక్కన ఉంటే.. ప్రతి రోజు చాక్లెట్ డే లాగే ఉంటుంది.
-ఈ చాక్లెట్ ఎంత తియ్యగా ఉందో, మన బంధం కూడా అంతే తియ్యగా సాగిపోవాలని కోరుకుంటున్నాను.
-పంచదార లేని కాఫీలా, నువ్వు లేని నా జీవితం చప్పగా ఉంటుంది. నా జీవితానికి తీపిని పంచిన నీకు చాక్లెట్ డే శుభాకాంక్షలు.
-ప్రేమ అనేది ఒక చాక్లెట్ లాంటిది.. తినే కొద్దీ ఇంకా కావాలనిపిస్తుంది. నువ్వూ అంతే.హ్యాపీ చాక్లెట్ డే.
-నీ ప్రేమ అనే తీపి ముందు ఈ చాక్లెట్ తీపి చాలా చిన్నది. లవ్ యూ.
-చాక్లెట్ ఎలాగైతే నోట్లో కరిగిపోతుందో.. నీ కోపం కూడా అలాగే కరిగిపోవాలని కోరుకుంటూ.. హ్యాపీ చాక్లెట్ డే.

స్నేహితులకు
-నా పార్టనర్ ఇన్ క్రైమ్ కి చాక్లెట్ డే శుభాకాంక్షలు. నీతో నా సీక్రెట్స్ అన్నీ పంచుకుంటాను కానీ.. నా చాక్లెట్స్ మాత్రం అస్సలు పంచుకోను.. గుర్తుంచుకో.
-జీవితం ఓ చాక్లెట్ బాక్స్ లాంటిది.. అందులో నాకు దొరికిన బెస్ట్ చాక్లెట్ నువ్వే.
-నిజమైన ఫ్రెండ్ చేతిలో చేయి వేయరు.. చేతిలో చాక్లెట్ పెడతారు. హ్యాపీ చాక్లెట్ డే ఫ్రెండ్.
-నా చాక్లెట్ దొంగిలించే హక్కు ఉన్న ఏకైక వ్యక్తివి నువ్వే. చాక్లెట్ డే శుభాకాంక్షలు మిత్రమా.
-చాక్లెట్ లేని జీవితం.. స్నేహితులు లేని జీవితం ఒక్కటే.. బోరింగ్ గా ఉంటుంది.
-నా లైఫ్ లో క్రంచీ ఫ్రెండ్ వి నువ్వే. హ్యాపీ చాక్లెట్ డే.
-నీ లాంటి స్వీట్ ఫ్రెండ్ ఉన్నప్పుడు.. నాకు వేరే స్వీట్స్ అవసరం లేదు.
-మన స్నేహం ఫైవ్ స్టార్ చాక్లెట్ లా ఎప్పటికీ సాగుతూనే ఉండాలి.
-హ్యాపీ చాక్లెట్ డే రా మామా.. ఈ రోజు పార్టీ నీదే.
-మంచి స్నేహితులు షుగర్ లాంటి వారు.. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ చాక్లెట్ లాంటి వారు.
భార్య,భర్తకు
-పెళ్లికి ముందు చాక్లెట్.. పెళ్లి తర్వాత నువ్వే నా స్వీట్. హ్యాపీ చాక్లెట్ డే డియర్.
-ఎన్ని సంవత్సరాలు గడిచినా.. మన బంధంలో తీపి మాత్రం తగ్గకూడదు.
-నా జీవిత భాగస్వామికి.. నా తీపి గుర్తుల సాక్షికి.. చాక్లెట్ డే శుభాకాంక్షలు.
ఇంటికి వచ్చేటప్పుడు చాక్లెట్ తేవడం మర్చిపోవద్దు.. అలాగే నా ప్రేమను కూడా.
మన సంసారం నుట్టీస్ చాక్లెట్ లా.. గట్టిగా మరియు స్వీట్ గా ఉండాలి.



Click it and Unblock the Notifications