Latest Updates
-
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది
ఈ దేశాల్లో క్రిస్మస్ వేడుకలు అబ్బురపరుస్తాయి.. తప్పకుండా చూడాలనుకునేలా ఉంటాయి
క్రిస్మస్ వేడుకలు దేశాన్ని బట్టి అట్టహాసంగా, ఆడంబరంగా జరుగుతాయి. కొన్ని దేశాల్లో మాత్రం వావ్ అనేలా సాగుతాయి. ఇప్పుడు చెప్పబోయే దేశాల్లో వేడుకలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అట్టహాసంగా సాగుతున్నాయి. మూడ్రోజుల ముందు నుండే వేడుకలు జరుగుతున్నాయి. చిన్నా పెద్దా అందరూ ఎంతో ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటున్నారు. రంగురంగుల లైట్లు, స్టార్లు, క్రిస్మస్ ట్రీలు, చూడచక్కని డెకరేషన్స్ ఆకట్టుకుంటున్నాయి. క్రిస్మస్‌ను చాలా దేశాల్లో జరుపుకుంటారు. కానీ ఇక్కడ చెప్పబోయే దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నెక్ట్స్ లెవల్.

క్రిస్మస్ వేడుకలు దేశాన్ని బట్టి అట్టహాసంగా, ఆడంబరంగా జరుగుతాయి. కొన్ని దేశాల్లో మాత్రం వావ్ అనేలా సాగుతాయి. ఇప్పుడు చెప్పబోయే దేశాల్లో వేడుకలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జెయింట్ లాంతర్ ఫెస్టివల్, ఫిలిప్పీన్స్
(Image: HelloTravel)
ఫిలిప్పీన్స్ యొక్క క్రిస్మస్ రాజధాని శాన్ ఫెర్నాండో. ఈ నగరంలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ ఈవ్ ముందు వచ్చే శనివారం రోజు జెయింట్ లాంతర్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇక్కడ జరిగే వేడుకలను చూసేందుకు దేశనలుమూలల నుండే కాకుండా విదేశాల నుండి చాలా పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ లాంతరు తయారు చేసే పోటీ చాలా ఉత్సాహంగా సాగుతుంది.

గావ్లే గోట్, స్వీడన్
(image:ABC)
ప్రతి సంవత్సరం క్రిస్మస్ సంబరాల్లో భాగంగా స్వీడన్‌లోని స్లాట్‌స్టోర్గెట్(కాజిల్ స్క్వేర్) వద్ద యూల్ మేక విగ్రహాన్ని తయారు చేస్తారు. దీనిని గడ్డితో చేస్తారు. 1966 నుండి సాంప్రదాయం వస్తోంది. గడ్డితో తయారు చేసిన ఈ మేకను ధ్వంసం చేసేందుకు ప్రతి ఏటా స్థానికులు ప్రయత్నిస్తుంటారు. తగలబెట్టడం, ముక్కలు చేయడం, పడగొట్టడం లాంటి అల్లరి పనులు చేస్తుంటారు. వారి నుండి గావ్లే గోట్‌ను కాపాడేందుకు స్థానిక అధికారులు చర్యలు తీసుకుంటారు.

క్రాంపస్, ఆస్ట్రియా
(image:NBS News)
హాలోవీన్ పండగలాగే ఉంటుంది ఆస్ట్రియాలో జరిగే ఈ క్రాంపస్. సెయింట్ నికోలస్ మంచి పిల్లలకు బహుమతులు అందజేస్తే.. క్రాంపస్ మాత్రం అల్లరి పిల్లలను తీసుకెళ్తాడని అంటారు. క్రిస్మస్ వేళ ఆస్ట్రియాలో భయంకరమైన మాస్కులు ధరించి వీధుల్లో తిరుగుతుంటారు. పిల్లలను భయపెడుతూ చెడ్డవారిని శిక్షిస్తుంటారు.

కెంటుకీ ఫ్రైడ్ క్రిస్మస్ డిన్నర్, జపాన్
(image:SBS)
జపాన్‌లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చెప్పుకోదగ్గ రీతిలో ఏమీ ఉండవు. సాదాసీదాగానే ఉంటాయి. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదే క్రిస్మస్ విత్ KFC.
KFC చేసిన ఓ ప్రచార కార్యక్రమం వల్ల జపాన్‌లో క్రిస్మస్ దినాల్లో ప్రజలు KFC చికెన్‌తోనే పండగ జరుపుకుంటారు. ఈ రోజుల్లో జపాన్‌లో కేఎఫ్‌సీ దుకాణాలు కిక్కిరిసిపోతాయి.

నార్వే
(image:Via.com Blog)
బహుశా అత్యంత అసాధారణమైన క్రిస్మస్ ఈవ్ సంప్రదాయాలలో ఒకటి నార్వేలో చూడవచ్చు. ఇక్కడ ప్రజలు తమ చీపురులను దాచుకుంటారు. క్రిస్మస్ ఈవ్ రోజున మంత్రగత్తెలు మరియు దుష్టశక్తులు చీపురులను తొక్కడానికి వెతుకుతుంటారని అందుకే చీపుర్లను దాచుకోవాలని ఇక్కడి ప్రజల విశ్వాసం. శతాబ్దాల క్రితం మొదలైన ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. క్రిస్మస్ వచ్చిందంటే ప్రతి ఒక్కరూ తమ చీపుర్లను బంగారం కంటే జాగ్రత్తగా దాచుకుంటారు.

కావాల్కేడ్ ఆఫ్ లైట్స్, టొరంటో
(image:CarniFest.com)
టొరంటోలో జిగే కావాల్కేడ్ లైటింగ్ చూడాల్సిందే. టొరంటోలోని సిటీ హాలల్, నాథన్ ఫిలిప్స్ స్క్వేర్‌లను ప్రదర్శించడానికి 1967లో తొలిసారిగా కావాల్కేడ్ నిర్వహించారు.
స్క్వేర్ మరియు క్రిస్మస్ చెట్టు 3 లక్షల కంటే ఎక్కువ LED లైట్లు అమర్చి వాటిని ఆన్ చేస్తారు. రాత్రి సమయంలో ఈ లైట్లను ఆన్ చేస్తారు. అలాగే అద్భుతమైన బాణసంచా ప్రదర్శనలు అబ్బురపరుస్తాయి.

డే ఆఫ్ ది లిటిల్ క్యాండిల్స్, కొలంబియా
(image: NewYorkLatinCultureMagazine)
క్రిస్మస్ సీజన్ ప్రారంభం నుండి కొలంబియా అంతటా లిటిల్ క్యాండిల్స్ డే నిర్వహిస్తారు. ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ గౌరవార్థం, కిటికీలు, బాల్కనీలు, ఇంటి ముందు కొవ్వొత్తులు, కాగితపు లాంతర్లు వెలిగిస్తారు.
ఈ కొవ్వొత్తులను వెలిగించే సాంప్రదాయం క్రమంగా అందాన్ని సంతరించుకుంది. అందమైన కొవ్వొత్తులను వెలిగించడం ద్వారా మనోహరమైన దృశ్యాన్ని తీసుకువస్తారు.



Click it and Unblock the Notifications