Latest Updates
-
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.!
వాహనం కొనాలనుకుంటున్నారా.. అయితే మీ నక్షత్రం ప్రకారం ఏ రంగు కొనాలో తెలుసుకోండి
జ్యోతిషశాస్త్రం ప్రకారం పుట్టిన ప్రతి వ్యక్తిపై గ్రహాల ప్రభావం ఉంటుంది. పుట్టిన సమయంలో గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి, జన్మ నక్షత్రం ఏంటి, ఆ నక్షత్రంలో ఉండే పాదాల ఆధారంగా వారి జీవితం ఎలా ఉంటుందో అంచనా వేస్తారు. రాశి చక్రం, అంశ చక్రం ఆధారంగా వారి వారి జీవితాల్లో భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెబుతారు జ్యోతిష్కులు. పుట్టిన సమయం ఆధారంగా కొన్ని అనుకూలతలు, మరికొన్ని ప్రతికూలతలు ఉంటాయి. ఆయా విషయాల ఆధారంగా చేసే పని ఉండాలని సూచిస్తారు జ్యోతిష్య పండితులు.
రాశి, నక్షత్రం ఆధారంగా కొందరికి కొన్ని అనుకూలిస్తాయి. మరికొన్ని ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. అందుకే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎప్పుడు ఎలా ఉండాలో, ఎలాంటి పనులు ప్రారంభించాలో, ఎలాంటి పనులు వాయిదా వేసుకోవాలో, ఎలాంటి పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం నవ గ్రహాలు వేటికవే ప్రత్యేకమైనవి. ఒకటి ఎక్కువా కాదు, మరొకటి తక్కువా కాదు. శుక్ర గ్రహం మనిషి జీవితంలో పెను ప్రభావాన్ని చూపిస్తుంది. సంపదకు, ఆనందానికి, విలాసాలకు, ప్రేమకు శుక్రుడు అధిపతిగా పరిగణిస్తారు. శని స్థానం, అనుకూలత, బలం కూడా పనులపై ప్రభావాన్ని చూపిస్తాయి.

కొందరు ఏదైనా పని తలపెట్టే ముందు తిథి, తారాబలం, గ్రహబలం, అనుకూలతలు చూసుకుని మొదలు పెడతారు. మరికొందరు వాటన్నింటిని మూఢనమ్మకాలుగా కొట్టి పడేస్తుంటారు. అయితే ఎవరి నమ్మకాలు, విశ్వాసాలు వారివి. వారిని తప్పు పట్టాల్సిన అవసరం కానీ, అర్హత కానీ మరొకరికి ఉండవు.
అయితే.. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు కొన్ని సమయాల్లో కొందరికి అనుకూలంగా ఉంటాయి. వాటి అనుకూలతలు, బలాలను బట్టి పనులు ప్రారంభించే వారు విజయాలు సాధిస్తారు. అలాగే నక్షత్రాలకు వేటికవే రంగులు ప్రీతికరమైనవి ఉంటాయి. మీరు వాహనం కొనాలనుకుంటే మీ జన్మ నక్షత్రం ప్రకారం కొన్ని రంగులు ఎంచుకుంటే మంచి జరుగుతుంది. ప్రతికూల రంగులు ఎంచుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపించవు. సమస్యలు ఎదురవుతాయి. జన్మ నక్షత్రం ఆధారంగా ఏయే రంగుల వాహనాలు కొనాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అశ్విని - వెండి రంగుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. రెండోది ఎరుపు రంగును కూడా ఎంచుకోవచ్చు.
భరణి - తెలుపు, వెండి రంగులు
కృత్తిక - ఎరుపు, తెలుపు
రోహిణి - తెలుపు, వెండి రంగులు
మృగశిర - ఎరుపు, తెలుపు, పసుపు
ఆరుద్ర - నీలం, నలుపు, బ్రౌన్, ఆకుపచ్చ
పునర్వసు - తెలుపు, వెండి, ఆకుపచ్చ
పుష్యమి - నీలం, నలుపు, తెలుపు
ఆశ్లేష - ఆకుపచ్చ, తెలుపు
మఖ - తెలుపు, వెండి రంగులు
పుబ్బ - తెలుపు, వెండి, ఎరుపు
ఉత్తర - ఎరుపు, తెలుపు
హస్త - తెలుపు, వెండి, నీలం
చిత్త - ఎరుపు, వెండి రంగులు
స్వాతి - బ్రౌన్, వెండి రంగులు
విశాఖ - పసుపు, వెండి, తెలుపు
అనురాధ - నీలం, నలుపు, ఎరుపు
జ్యేష్ఠ - తెలుపు, వెండి, ఆకుపచ్చ
మూల - తెలుపు, వెండి రంగులు
పూర్వాషాడ - వెండి, పసుపు
ఉత్తరాషాడ - ఎరుపు, పసుపు, నీలం
శ్రవణం - తెలుపు, వెండి, నీలం
ధనిష్ట - ఎరుపు, నీలం
శతభిష - నీలం, నలుపు, బ్రౌన్
పూర్వాభద్ర - పసుపు, నీలం
ఉత్తారాభాద్ర - నీలం, నలుపు
రేవతి - ఆకుపచ్చ, తెలుపు
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications