Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న దేశాలివే..భారత్ ఎన్నో ప్లేస్ తెలుసా
ప్రస్తుతం మనదేశంలో ఉద్యోగుల పనిగంటలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. వారానికి 90 గంటలు ఉద్యోగులు పని చేయాలని L&T చైర్మన్ సుబ్రమణ్యన్ తాజాగా చెప్పడం, అంతకుముందు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఉద్యోగులంటే బానిసలు కాదు అంటూ వారి వ్యాఖ్యలపై నెటిజన్లతో పాటు వ్యాపార,సినీ,క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు కూడా మండిపడుతున్నారు.
మరికొందరు అయితే దేశం డెవలప్ అవ్వాలంటే ఇప్పుడు చేసేదానికన్నా ఇంకొంచెం ఎక్కువ పని గంటలు ఉండాలని కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ప్రపంచంలో 70 గంటలు లేదా అంతకంటే ఎక్కవ పని గంటలు ఉన్న దేశాలు ఏవి,భారత్ ఎన్నో ప్లేస్ లో ఉందో ఇప్పుడు చూద్దాం.

భూటాన్
మన సరిహద్దు దేశమైన భూటాన్ లో ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. వారానికి సరాసరిగా 54.4 గంటలు అక్కడ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భూటాన్ ప్రపంచంలోనే సంతోషకరమైన దేశాల్లో ఒకటి.
యూఏఈ
ఉద్యోగులు ఎక్కువగంటల పనిచేసే దేశాల లిస్ట్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2వ ప్లేస్ లో ఉంది. యూఏఈ దేశంలో ఉద్యోగులు వారానికి 50.9 గంటలు పనిచేస్తున్నారు.
లెసెతో
సౌత్ ఆఫ్రికాలోని లెసెతో ప్రజలు వారానికి 50.4 గంటలు పనిచేస్తున్నారు. ఇది ప్రపంచంలోనే వారానికి అత్యధిక పని గంటలు ఉన్న మూడవ దేశంగా నిలిచింది.
కాంగో
ఆఫ్రికా ఖండంలోని కాంగో దేశంలో ఉద్యోగులు వారానికి 48.6 గంటలు పని చేస్తున్నారు.
ఖతార్
ఉద్యోగులు ఎక్కువగంటల పనిచేసే దేశాల లిస్ట్ లో ఖతార్ 5వ స్థానంలో ఉంది. ఖతార్ లో ఉద్యోగుల సగటు పని వారానికి 48 గంటలుగా ఉంది.
లైబీరియా
ఆరవ స్థానంలో లైబీరియా ఉంది. లైబీరియాలో ఉద్యోగులు వారానికి 47.7 గంటలు పని చేస్తున్నారు.
మౌరిటానియా
ఆఫ్రికా ఖండంలోని మరో దేశమైన మౌరిటానియాలో ఉద్యోగులు వారానికి సగటున 47.6 గంటలు పని చేస్తారు.
లెబనాన్
ఎనిమిదో స్థానంలో లెబనాన్ ఉంది. ఇక్కడ ఉద్యోగులు సగటున వారానికి 47.6 గంటలు పని చేస్తారు.
మంగోలియా
అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకారం మంగోలియా ఉద్యోగులు వారానికి 47.3 గంటలు పని చేస్తారు.
జోర్డాన్
ఉద్యోగులు ఎక్కువగంటల పనిచేసే దేశాల లిస్ట్ లో10వ స్థానంలో జోర్డాన్ ఉంది. జోర్డాన్ లో ఉద్యోగులు వారానికి సగటున 47 గంటలు పనిచేస్తారు.
మనదేశం సంగతేంటీ
ప్రపంచవ్యాప్తంగా వారంలో ఎక్కువ గంటలు పనిచేసే దేశాల లిస్ట్ లో భారత్ 13వ స్థానంలో ఉంది. భారతీయులు సగటున వారానికి 46.7 గంటలు పనిచేస్తున్నారు. అయితే 51శాతం జనాభా.. 49 లేదా అంతకంటే ఎక్కువ గంటలు పనిచేస్తున్నారట.
అతి తక్కువ పని గంటలున్న దేశాలివే
అతి తక్కువ గంటలు పనిచేసే దేశాలల లిస్టులో ఆస్ట్రేలియా ఖండంలోని వనౌతు దేశం మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ఈ ఉద్యోగులు వారానికి కేవలం 24.7 గంటలు మాత్రమే పనిచేస్తారు. ఆ తర్వాత స్థానాల్లో కిరిబతి (27.3 గంటలు వారానికి), మిక్రోనేషియా(30.4 గంటలు వారానికి) దేశాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications