Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పగలు డాక్టర్ గా, రాత్రిళ్లు విద్యార్థిగా..తొలి ప్రయత్నంలోనే IPS..ఈ లేడీ సింగం మామూలిది కాదు
తల్లిదండ్రుల కోరిక మేరకు డాక్టర్ కోర్సు చేసింది..అయినా తనలోని ఆశను చంపుకోలేదు. ఓ వైపు డాక్టర్ గా పనిచేస్తూనే తన కలను సాధించుకోవడం కోసం కష్టపడింది. ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించింది. ఏ కోచింగ్ సెంటర్ కి వెళ్లకుండానే సివిల్స్ లో దుమ్ములేపింది. ఆల్ ఇండియా లెవల్లో 127వ ర్యాంకు సాధించింది. తన కల అయిన ఐపీఎస్ డ్రెస్ వేసుకుంది. లేడి సింగంగా మారి నేరస్థులకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఆమె అదితి ఉపాధ్యాయ.
డాక్టర్ అదితి ఉపాధ్యాయ..పుట్టింది,పెరిగింది అంతా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాశిలోనే. అదితికి చిన్నతనం నుంచి ఐపీఎస్ అవ్వాలని ఉండేది. అయితే తన తల్లదండ్రుల కోరిక మేరకు వారిని నొప్పించడం ఇష్టం లేక డెంటిస్ట్రీ కోర్సు కోసింది. 2013లో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ(BDS) డిగ్రీ పొందిన తర్వాత ఫుల్ టైమ్ డాక్టర్ గా పనిచేసింది. డెంటిస్ట్ గా పనిచేస్తున్నా,సంపాదన బాగానే ఉన్నప్పటికీ అదితి మనసులో ఏదో తెలియని వెలితి ఉండేది. తాను కలగన్న ఐపీఎస్ సాధిస్తే గానీ తన మనస్సు తృప్తి చెందదని గ్రహించింది.

సివిల్స్ లో సత్తా చాటి ఐపీఎస్ అవ్వాలని అదితి ఉపాధ్యాయ డిసైడ్ అయ్యింది. అయితే డాక్టర్ వృత్తిలోనే కొనసాగుతూనే తన కలను సాధించాలనుకుంది. డెంటిస్గ్ గా పనిచేస్తుండటంతో కోచింగ్ సెంటర్ కు వెళ్లే టైం ఉండేది కాదు. దీంతో పగలు అంతా హాస్పిటల్ లో పనిచేసి రాత్రయ్యాక ఇంట్లో ఇంటర్నెట్ లో ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటివి వాడకుండా సివిల్స్ పరీక్షకు సంబంధించిన ఆన్ లైన్ క్లాసులు,మాక్ టెస్టులు,బుక్స్ చదివేది. కరెంట్ ఎఫైర్స్, చరిత్ర తేదీలు, తన స్కిల్స్ అన్నీ మెరుగుపర్చుకునేది. తనలో ఆత్మవిశ్వాసం వచ్చేసింది.
ఇక ఎప్పుడెప్పుడు సివిల్స్ పరీక్ష రాద్దామా అని ఎదురుచూసింది. ఆ సమయం వచ్చేసింది. 2023 సివిల్స్ పరీక్షల్లో 127 వ ర్యాంకు సాధించి అదితి ఉపాధ్యాయ దుమ్ములేపింది. కోచింగ్ సెంటర్ కి వెళ్లకుండానే ఈ ర్యాంక్ సాధించడమేంటే అంత ఆషామాషీ కాదు. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్లే ముందు తన డాక్టర్ వృత్తికి రాజీనామా చేసింది. అంటే ఇంటర్వ్యూలో తాను తప్పకుండా సెలక్ట్ అవుతానన్న కాన్ఫిడెన్స్ ఆమెలో ఏర్పడిపోయింది. అంతేకాకుండా అదితి ధైవ భక్తురాలు కూడా.. ఇంటర్వ్యూకి వెళేముందు హనుమాన్ చాలీసా చదవింది. ఇది తనలో ఫోకస్, నమ్మకాన్ని మరింత పెంచినట్లు అదితి ఓ సందర్భంలో తెలిపారు.
ప్రస్తుతం అదితి ఉపాధ్యాయ రాజస్థాన్ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. లేడీ సింగంగా రాజస్థాన్ ప్రజలు ఆమెను పిలుస్తారు. మీరు మెడికల్ పీల్డ్ లో ఉన్నా,ఇంజనీరింగ్ పీల్డ్ లో ఉన్నా లేదా మరే ఇతర ఫీల్డ్ లో ఉన్నా మీ బలమైన కోరిక మిమ్మల్ని దానివైపుకి నడిపిస్తుంది..విజయం ఖాయం అవుతుందని అదిత్య ఉపాధ్యయ అనుభవం తెలియజేస్తుంది. ప్రస్తుతం ఐపీఎస్ గా అదితి ఎందరికో ప్రేరణ నిలుస్తున్నారు.



Click it and Unblock the Notifications