Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాపై కాకి దాడి.. సమస్యలకు సంకేతమా? పరిణీతి చోప్రాతో పెళ్లవుతుందా?
హిందూ మత సాంప్రదాయంలో ఎన్నో విశ్వాసాలు, నమ్మకాలు. అందులో వేటిని కూడా తేలికగా తీసిపారేయడానికి వీల్లేదు. ప్రతి నమ్మకం వెనక ఏదో ఒకర బలమైన కారణం ఉండే ఉంటుందని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. మన సాంప్రదాయం ప్రకారం జంతువులను కూడా మంచికి లేదా చెడుకు సంకేతంగానే పరిగణిస్తుంటాం.
శాస్త్రాలక ప్రకారం కాకి శని దేవునికి వాహనం. అలాగే పితృదేవతలు కూడా కాకి రూపంలోనే సంచరిస్తుంటారని నమ్మకం. ఎవరైనా చనిపోయిన సందర్భాల్లో పిట్ట ముట్టుడు కూడా కాకి కోసమే వేచి చూస్తుంటాం. అయితే.. కాకులు అప్పుడప్పుడు కొందరు వ్యక్తులపై దాడి చేస్తుంటాయి. పాదాలతో తన్నుతుంటాయి. ఎగిరొచ్చి నెత్తిపై పొడుస్తాయి. ఇలా దాడి చేయడం వెనక కూడా కారణాలు ఉంటాయట. తాజాగా ఆప్ ఎంపీ, బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రాతో తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న రాఘవ్ చద్దాపై పార్లమెంట్ ఆవరణలో కాకి దాడి చేసింది.

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోయే వ్యక్తిపై ఇలా కాకి దాడి చేయడాన్ని ఎలా చూడాలి.. అసలు కాకి దాడి చేయడం అంటే రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నట్లా.. రాఘవ్ చద్దా సమస్యల్లో పడబోతున్నారా.. పరిణీతి చోప్రాతో పెళ్లి జరుగుతుందా, లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కాకి తాకితే మంచిదా? కాదా?
జ్యోతిష్యంలో కాకికి చాలా ప్రాముఖ్యత ఉంది. కాకిని శని వాహనంగా పరిగణిస్తారు. అలాగే శకునాలు చెప్పే జీవిగా కూడా చూస్తారు. కొందరు కాకిని అశుభ పక్షిగా పరిగణిస్తారు. కాకి అరుపు వింటే ఇంటికి చుట్టాలు వస్తారని కొందరు ఎలా భావిస్తారో.. మరికొందరు మాత్రం కాకి అరుపు వింటే పనులు జరగవని, తలపెట్టిన పని ఏదీ పరిపూర్ణం కాదని విశ్వసిస్తారు.
జ్యోతిష్యం ప్రకారం కాకి తగులుతూ వెళ్తే మంచిదట. కాకి ఎగురుతున్న సమయంలో అనుకోకుండా తాకితే దానిని చాలా శుభప్రదంగా భావించాలని చెబుతున్నాయి శాస్త్రాలు. ఇలా తాకడం వల్ల రాబోయే కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయిట. ఆర్థికంగా కూడా చాలా బాగా కలిసి వస్తుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా కాకి తగిలిన వారు సంతోషకరమైన వార్తలు వింటారని శాస్త్రం చెబుతోంది.
మరి కాకి దాడి చేస్తే మంచిదేనా?
అయితే కాక ఉద్దేశపూర్వకంగా కాకుండా తాకుతూ వెళితే మంచిది కానీ.. కావాలనే పదే పదే దాడి చేయడం మాత్రం తీవ్రమైన అశుభంగా పరిగణించాలని చెబుతున్నారు జ్యోతిష నిపుణులు. కాకి దాడి చేయడాన్ని అరిష్టంగా భావించాలని చెబుతున్నారు. ఇలా కాకి దాడి చేయడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయట. కాకి తలపై తన్నినా, పొడిచినా అనారోగ్య సమస్యలను సూచిస్తుంది. భవిష్యత్తులో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణుల.
రాఘవ్ చద్దాపై కాకి దాడిని ఎలా పరిగణించాలి?
రాఘవ్ చద్దాపై జరిగిన కాకి దాడిని సమస్యలు రాబోతున్నట్లుగా పరిగణించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలే బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రాతో ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరిగిన కాకి దాడి వల్ల వీరిద్దరి పెళ్లి ఆగిపోయే సూచనలేవీ కనిపించడం లేదని అంటున్నారు. అయితే రాఘవ్ చద్దా కొన్ని సమస్యలను, సవాళ్లను ఎదుర్కోబోతున్నారని మాత్రం చెబుతున్నారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
