Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Modi Dinner Menu: నోరూరించే వంటకాలతో మోదీ డిన్నర్ మెనూ, ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఫస్ట్ లేడీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ గురువారం (జూన్ 22) రోజు వైట్ హౌస్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. మోదీ శాకాహారి కావడంతో అందుకు తగ్గట్లుగా వంటకాలు తయారు చేసేందుకు ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వెజ్ ఐటెమ్స్ లో మంచి ప్రావీణ్యం ఉన్న వైట్ హౌజ్ చెఫ్ నినా కర్టిన్ కు కొన్ని సూచనలతో డిన్నర్ ను సిద్ధం చేసినట్లు చెప్పారు.

విందుకు ముందు జిల్ బైడెన్ డిన్నర్ ఏర్పాట్లను మీడియాకు వివరించారు. భారత జాతీయ పక్షి నెమలి నుంచి ప్రేరణ పొందిన థీమ్ నుంచి త్రివర్ణ పతాకాన్ని సూచించేలా డెకరేట్ చేశారు. భారతీయ రుచులతో ఈ వంటకాలను రూపొందించినట్లు తెలుస్తోంది.
కాలిఫోర్నియాలోని శాక్రమెంటోకు చెందిన ప్లాంట్ - బేస్డ్ చెఫ్ నినా కర్టిన్, వైట్ హౌజ్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ క్రిస్ కామెర్ ఫోర్డ్, వైట్ హౌజ్ ఎగ్జిక్యూటివ్ పేస్ట్రీ చెఫ్ సూసీ మోరిసన్ తో కలిసి జిల్ బైడెన్ మెనూను తయారు చేశారు. మోదీకి డిన్నర్ ప్రిపేర్ చేయడం నా కెరీర్ లో శిఖరాగ్ర క్షణమని, అమెరికన్ వంటకాల్లో ఉత్తమమైన వాటిని ప్రదర్శించే మెనూను రూపొందించినట్లు వైట్ హౌజ్ చెఫ్ నినా కర్టిన్ చెప్పుకొచ్చారు. రెండు దేశాలకు చెందిన అతిథులు ఒకరి సంస్కృతిని మరొకరు అనుభూతి చెందాడనికి క్యూరేటెడ్ మెనూ వీలు కల్పిస్తుంది, ఈ మెనూలో మ్యారినేటెడ్ చిరుధాన్యాలను చేర్చినట్లు జిల్ బైడెన్ తెలిపారు. మెరినేట్ చేసిన మిల్లెట్, గ్రిల్డ్ కార్న్ కెర్నల్ సలాడ్, కంప్రెస్ట్ పుచ్చకాయ, టాంగీ అవొకాడో సాస్, స్టఫ్డ్ పోర్టోబెల్లో పుట్టగొడుగులు, క్రీమ్ కుంకుమపువ్వుతో కలిపిని రిసోట్టో, సుమాక్ కాల్చిన సీ బాస్, నిమ్మకాయ-మెంతులు పెరుగు సాస్, క్రిస్ప్డ్ మిల్లెట్ కేకులు, వేసవి స్క్వాష్ లు మెనూలో ఉన్నాయి.
డిన్నర్ మెనూ ఇదే..
ఫస్ట్ కోర్స్: మెరినేట్ చేసిన మిల్లెట్, గ్రిల్డ్ కార్న్ కెర్నల్ సలాడ్, కంప్రెస్డ్ వాటర్ మిలాన్, టాంగీ అవొకాడో సాస్.
మెయిన్ కోర్స్: స్టఫ్డ్ పోర్టోబెల్లో మష్రూమ్స్, క్రీమీ సఫ్రాన్ రిసోట్టో, సుమాక్ రోస్టెడ్ సీ బాస్, లెమన్-డిల్ యోగర్ట్ సాస్, మిల్లెట్ కేక్స్, సమ్మర్ స్వాషెస్



Click it and Unblock the Notifications