Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Danger bells: ఇండియాలో ప్రాణాంతక వైరస్.. సోకితే మరణమే!
కరోనా మహమ్మారి సృష్టించిన ప్రళయం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటోంది. ఈ క్రమంలోనే అనేక వైరస్‌లు ప్రపంచం మీదకు దాడికి సిద్ధమయ్యాయి. అందులో భాగంగానే ఇటీవల మన దేశ రాజధాని ఢిల్లీలో జపనీస్ ఎన్సెఫాలిటిస్ అనే వైరస్ ఎంటరైంది. దీని కారణంగా జపనీస్ ఎన్సెఫాలిటిస్ అనే కేసు నమోదైంది. ఇది చాలా ప్రమాదకర వ్యాధి అని, మనుషులు చనిపోయే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ వ్యాధి ఎలా సోకుతుంది? కరోనా మాదిరిగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
వ్యాధి ఎలా సోకుతుందంటే..
జపనీస్ ఎన్సెఫాలిటిస్ అనేది ఒక వైరస్. ఇది ముఖ్యంగా దోమల నుంచి మనుషులకు వ్యాపిస్తుందట. ఈ వ్యాధి దోమలు కుట్టినప్పుడు మలేరియా, డెంగ్యూ మాదిరిగా మనుషులకు సోకుతుంది. కానీ కరోనా మాదిరిగా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి అయితే వ్యాపించదు. ఒకవేళ ఈ వైరస్ సోకిన వ్యక్తి మరొక వ్యక్తికి తన రక్షాన్ని దానం చేస్తే మాత్రం కచ్చితంగా వ్యాధి సోకుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్న ఈ వ్యాధి కేసులు చాలా అతక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు.

ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే?
ఈ జపనీస్ ఎన్సెఫాలిటిస్ వైరస్ సోకితే జ్వరం వస్తుంది. సాధారణంగా మెదడు వాపు వ్యాధి సోకినప్పుడు వచ్చే లక్షణాలే ఎక్కువగా కనిపిస్తాయి. తలనొప్పి, వాంతులు, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మొదట్లో స్వల్ప జ్వరం వస్తుంది. జ్వర తీవ్రత పెరిగిన తరువాత అది మెదడుకు చేరుతుంది. క్రమంగా మెదడులోని కణాలు దెబ్బతింటాయి. మనిషి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇలా మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది.
ఈ వైరస్‌కు చికిత్స ఉందా?
ఈ వైరస్ నివారణకు ఇప్పటి వరకు ఎలాంటి చికిత్స లేదు. ఆ వ్యాధి లక్షణాల ఆధారంగా మాత్రమే ఇతర మార్గాల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ వైరస్ కారణంగా సంభవించే మెదడు వాపు వ్యాధికి మాత్రం చికిత్స ఉంది. పిల్లలు పుట్టిన వెంటనే ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు టీకా వేయొచ్చు. దీని ద్వారా మెదడు వాపు వ్యాధి సోకకుండా ఉంటుంది. భవిషత్తులో జపనీస్ ఎన్సెఫాలిటిస్ వైరస్ సోకినా మరణించే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
నివారించాలంటే ఏం చేయాలి?
ఈ వ్యాధిని నివారించడం మన చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా దోమలు కుట్టకుండా పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి. చేతులు, కళ్ళు మొత్తం కవర్ అయ్యే విధంగా బట్టలు వేసుకోవాలి. ఇంటి చుట్టూ పరిశుభ్రమైన వాతావరణాన్ని ఉంచుకోవాలి. ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించే దానికి సంబంధించిన చికిత్స తీసుకోవాలి.



Click it and Unblock the Notifications