Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఇంటికి శంకుస్థాపన.. కూతురితో చేయించాలా, కోడలితో చేయించాలా?
ఇళ్లు కట్టుకోవాలని చాలా మంది కలలు కంటుంటారు. కొందరికి అది జీవితకాల లక్ష్యం. అందుకే ఇంటి చుట్టూ ఎన్నో కలలు, కోరికలు, ఆశలు, ఆశయాలు, జీవితకాల స్మృతులు ఉంటాయి. డబ్బులు కూడబెట్టో, అప్పో సప్పో చేసి ఇంటి నిర్మాణానికి బీజం వేస్తారు. అయితే ఇక్కడ కొందరికి కొన్ని అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతాయి. అందులో మొదటిది ముహూర్తం అయితే, రెండోది ఎవరు చేయాలి.

ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ముందు పురోహితులు మంచి ముహూర్తం చూస్తారు. ఇంటి యజమాని, యజమానురాలు ఇద్దరి పేర్ల మీద పంచాంగం చూసి, ముహూర్త కాలాన్ని నిర్ణయిస్తారు. ఆయా వ్యక్తులు, వారి పేర్ల మీద ముహూర్త బలం లేనప్పుడు.. మిగతా కుటుంబ సభ్యుల పేరు మీదు ముహూర్తం చూసి తేదీ, సమయం నిర్ణయిస్తారు.
ఇంటి శంకుస్థాపనను ఇంటి కోడలితో చేయించాలా.. లేదా కూతురితో చేయించాలా అనే ప్రశ్న కొంత మందికి వస్తుంది. దానికి నిపుణులు చేప్పే మాట కూతురితో కంటే కోడలితోనే శంకుస్థాపన కార్యక్రమం చేయించడం మంచిదని అంటారు. ఇంటి కోడలు అంటే ఇంటి కుటుంబసభ్యురాలు, ఇంటి యజమానురాలు. కొడుకు పేరు మీద కుదురకపోతే, కోడలి పేరు మీద పూజ చేయించవచ్చు. కానీ బిడ్డతో మాత్రం ఎవరూ చేయించరు. ఎందుకంటే ఆమె మరొక ఇంటి మహాలక్ష్మి. ఇక్కడ కూతురితో పూజ చేయించడం కంటే.. కోడలితో పూజ చేయించడమే శ్రేయస్కరం.
గృహ ముహూర్తానికి ఎంత సమయం ఉంటుంది?
పురోహితులు నిర్ణయించే ముహూర్తంలో పూజాది కార్యక్రమాలు చేయాలని చెబుతుంటారు. ఈ ముహూర్త కాలం రెండు ఘడియలు ఉంటుంది. అంటే 48 నిమిషాలు అన్నమాట. రాత్రిని బట్టి, దినం - కాలాన్ని బట్టి కొంత తేడా ఉండొచ్చు. కానీ దాదాపుగా ఇంతే ఉంటుంది. ఈ ముహూర్తానికి కొన్ని నిమిషాల వ్యత్యాసంతో ఇష్టదైవం ఫోటోతో గృహంలోకి ప్రవేశించడం ముఖ్యం.
ఈ సమయం మించిపోకుండా చూసుకోవాలి. సరిగ్గా ముహూర్తం సమయానికి ఇంట్లోకి దేవుడి ఫోటోతో అడుగు పెట్టి, తర్వాత పూజా కార్యక్రమాలు జరుపుకోవచ్చు. ముహూర్తాన్ని నిర్ణయించేది గృహ ప్రవేశం కోసం కాబట్టి ఎవరు వచ్చినా.. రాకున్నా.. సమయానికి ఇంట్లోకి ప్రవేశించడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి.
స్థలం ఆకారం - వాస్తుకు మధ్య సంబంధం:
ఫ్లాట్ లు మాత్రమే చతురస్రాకారంలో, దీర్ఘచతురస్రాకారంలో సరిగ్గా ఉంటాయి. కానీ చాలా ఇల్ల స్థలాలు కొన్ని మూలల వైపు ఎక్కువ, తక్కువగా ఉంటాయి. వివిధ ఆకారాల్లో ఉంటాయి. అలాంటి చోట అన్నీ సరిగ్గా చూసుకుని వాస్తు ప్రకారం ఇంటికి ప్లాన్ వేయాల్సి ఉంటుంది. కొన్ని స్థలాలు చిన్న పాటి మార్పులతో ఇంటికి సరిపోతాయి. మరికొన్ని మాత్రం చాలా కష్టంగా ఉంటాయి.
ఇల్లు కట్టుకోగలిగినంత స్థలం, సరైన దిశలో సింహద్వారం పెట్టగలిగితే చాలు. అయితే ఇది వాస్తు నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది. స్థలం చాలా ఉన్నా కొన్ని సార్లు వాస్తు ప్రకారం ఆ స్థలాన్ని వాడుకోలేక పోవచ్చు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications