Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
స్యూర్యగ్రహణం అపోహలు.. గర్భిణీలు సురక్షితమా ?
ఎప్రిల్ 9న సంపూర్ణ సూర్య గ్రహణం కారణంగా ఎన్నో అపోహలు, భయాలు సామాన్యులను చుట్టుముడుతున్నాయ్. గ్రహణం సమయంలో ఇంట్లోంచి బయటకు రాకూడదని, గర్భిణీ స్త్రీలు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని చెబుతుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రధాన దేవాలయాలు మూసివేయబడతాయ్, కొందరు ఇంట్లో ప్రత్యేకంగా బయట నుంచి ఆకులను, గడ్డిని తెచ్చుకొని పెడుతుంటారు. మరికొందరు ఆ సమయంలో కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా ఉంటారు. సూర్య గ్రహణం మొదలు కాగానే భయపడిపోతుంటారు. ఇలాంటి భయాలు, అపోహలు ఉండవద్దని ఈ ఆర్టికల్ ద్వారా తెలియజేస్తున్నాం.

భారతీయులకు నిరాశ
ఈ సూర్యగ్రహణం కేవలం అమెరికా, మెక్సికో, కెనడా దేశాల్లో మాత్రమే సంపూర్ణంగా కనిపిస్తుంది. మరోవైపు కరీబియన్ దేశాలు, వెనుజులా, స్పెయిన్, కొలంబో, ఐర్లాండ్, పోర్చుగల్, యూకె, ఐస్‌ల్యాండ్ దేశాల్లో పాక్షికంగా సూర్యగ్రహణం కనబడుతుంది. కానీ భారతదేశ ప్రజలు మాత్రం ఈ దృష్యాన్ని చూడలేకపోవడం బాధాకరం.
కళ్లపై ప్రభావం
సూర్యుడి నుంచి వచ్చే కిరణాలను నేరుగా కళ్లతో చూస్తే కళ్లు దెబ్బతింటాయ్. సూర్య గ్రహణం సమయంలో కొన్ని ప్రమాదకరమైన కిరణాలు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకమైన కళ్లజోడు పెట్టుకొని మాత్రమే సూర్యగ్రహనాన్ని తిలకించాలి. కొందరు ఎక్స్‌రే ఫైల్‌ను కళ్లజోడులా ఉపయోగిస్తారు. అలా చేసినా కళ్లకు సురక్షితమే. కళ్లజోడు లేకుండా ఎట్టిపరిస్థితుల్లో కూడా సూర్యగ్రహణాన్ని చూడవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తినే ఆహారం విషపూరితం
సూర్యగ్రహణం సమయంలో ఇంట్లో వున్న తినే వస్తువులు విషపూరితమవుతాయని చాలా మంది నమ్మకం. అయితే అది మూఢనమ్మకమని నిపుణులు చెబుతున్నారు. నిజంగా ఇంట్లో ఉన్న ఆహారం విషపూరితమైపోతే ఆ సమయంలో పొలాల్లో పండే పంటలు కూడా విషపూరితం కావాలి అని ప్రశ్నిస్తున్నారు. అలాంటి భయాలు, అపోహలు మూఢనమ్మకాలు పెట్టుకోరాదని వైద్యులు సూచిస్తున్నారు.
గర్భిణీ స్త్రీలు
గర్భిణీ స్త్రీల బయటకు రాకూడదని పెద్దలు హెచ్చరికలు జారీ చేస్తారు. బయటకు వస్తే తల్లి గర్భంలోని బిడ్డపై ప్రభావం పడుతుందని భయపడతారు. అయితే నాసా శాస్త్రవేత్తలు, పరిశోధకులు దీనిని కొట్టిపారేస్తున్నారు. సూర్యుడి నుంచి అంతరిక్షం గుండా భూమిపై సూర్యకిరణాలు శరీరంపై పడ్డా గర్బిణీ స్త్రీలపై సూర్యగ్రహణం రోజు పడ్డా ఎలాంటి చెడుప్రభావం ఉండదని చెబుతున్నారు. హానికరమైన యూవీ కిరణాలను భూమిపైన ఉన్న ఓజోన్ పొర ఇప్పటికే మనల్నిరక్షిస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి సూర్యగ్రహ కిరణాలు వల్ల గర్భిణులకు ఎలాంటి భయం అవసరం లేదు. నిపుణులందరూ అదే చెబుతుండగా శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది.



Click it and Unblock the Notifications