Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
కోటి రూపాయల జీతం..అయినా మనుషులు దొరకట్లేదు..భవిష్యత్తులో ఎక్కువ సంపాదించగలిగే ఉద్యోగాలివే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా దూసుకొస్తోంది. ఉద్యోగాలు ఊడిపోతాయి అన్న భయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిలో ఉంది. సాఫ్ట్ వేర్ కోడింగ్ నుంచి కంటెంట్ రైటింగ్ వరకు డేటా ఎంట్రీ నుంచి కస్టమర్ సపోర్ట్ వరకు అన్నీ ఏఐ చేసేస్తోంది.
మరి భవిష్యత్తులో అత్యధిక డిమాండ్, భారీ జీతాలు ఉండే ఉద్యోగాలు ఏవి? ఈ ప్రశ్నకు సమాధానం వింటే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. భవిష్యత్తులో రాజ్యమేలబోయేది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కాదు.. ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, మెకానిక్స్.

ఫోర్డ్ సీఈవో చెప్పిన చేదు నిజం
ఇటీవల ప్రముఖ కార్ల కంపెనీ ఫోర్డ్ సీఈవో జిమ్ ఫార్లే ఒక పాడ్ కాస్ట్ లో.. తమ సంస్థలో దాదాపు 5000 మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిలో చాలావాటికి ఏటా కోటి రూపాయల జీతం ఆఫర్ చేస్తున్నా, పనిచేసేందుకు సరైన స్కిల్డ్ వర్కర్లు దొరకడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం ఫోర్డ్ మాత్రమే కాదు వాల్ మార్ట్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా తమ ట్రక్ డ్రైవర్లకు, టెక్నీషియన్లకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలను ప్రకటిస్తున్నాయి.
వైట్ కాలర్ vs బ్లూ కాలర్
మన దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ యువతలో ఒక అపోహ బలంగా నాటుకుపోయింది. ఏసీ గదుల్లో కూర్చుని కంప్యూటర్ ముందు చేసేదే అసలైన ఉద్యోగమని (వైట్ కాలర్ జాబ్), చేతులకు మట్టి అంటుకునే ప్లంబింగ్, మెకానిక్ వంటి పనులు (బ్లూ కాలర్ జాబ్స్) మన డిగ్నిటీకి తక్కువని భావిస్తున్నారు. దీంతో అందరూ డిగ్రీలు, పీహెచ్‌డీల వెంట పడుతున్నారు.
ఫలితంగా మార్కెట్ లో డిగ్రీలు ఉన్న నిరుద్యోగులు పెరిగిపోతుంటే.. చేతివృత్తులు, సాంకేతిక నైపుణ్యం ఉన్నవారి కొరత తీవ్రమవుతోంది. దీన్నే ఎకనామిక్స్ పరిభాషలో డిమాండ్ అండ్ సప్లై అంటారు. ఎక్కడైతే మనుషుల కొరత ఉంటుందో, అక్కడ జీతాలు ఆకాశాన్ని తాకుతాయి.
ఏఐ చేయలేని పనులు ఇవే..
ఏఐ ఒక కవిత రాయగలదు, ఒక ఫోటోని సృష్టించగలదు, సంక్లిష్టమైన కోడ్ రాయగలదు. కానీ మీ ఇంట్లో లీక్ అవుతున్న పైపును సరిచేయగలదా? సడన్ గా ఆగిపోయిన కారు ఇంజిన్‌లోని లోపాన్ని వెతికి బిగించగలదా? విద్యుత్ వైరింగ్ లో వచ్చిన షార్ట్ సర్క్యూట్ ను రిపేర్ చేయగలదా? చేయలేదు.
రోబోటిక్స్ ఎంత డెవలప్ అయినా, క్షేత్రస్థాయిలో ఉండే అస్థిరమైన పరిస్థితులలో పనిచేయడం వాటికి చాలా కష్టం. అందుకే భవిష్యత్తులో ఈ స్కిల్ బేస్డ్ పనులకు ఉండే డిమాండ్ ఎప్పటికీ తగ్గదు.
భవిష్యత్తు ఎవరిది?
ప్రస్తుతం చాలామంది యువత ఒకేషనల్ ట్రైనింగ్ (వృత్తి విద్యా శిక్షణ) వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కానీ రాబోయే పదేళ్లలో ప్రపంచాన్ని నిర్మించేది, నడిపించేది ఈ నైపుణ్యం ఉన్నవారే. ఎవరైతే కేవలం డిగ్రీల కోసం కాకుండా స్కిల్ నేర్చుకోవడంపై దృష్టి పెడతారో వారికే రెడ్ కార్పెట్ వెల్కమ్ దొరుకుతుంది.



Click it and Unblock the Notifications