Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
మన చుట్టూ దయ్యాలుంటే.. ఈ సంకేతాలు కనిపిస్తాయ్..గడియారం ఒకే సమాయానికి ఆగిపోవడం..!!
గడియారం పదే పదే ఆగిపోతుంటే అనుమానించాల్సిన విషయం. బ్యాటరీలు మంచిగా వున్నా కూడా కొన్ని సార్లు ఇలా జరుగుతుంది. ప్రతీ రోజు ఒకే సమయానికి గనుక గడియారం ఆగిపోతే అప్పుడు మీకు కనిపించని, తెలియని శక్తి మీ పక్కన వున్నట్టేనని మీరు అర్థం చేసుకోవాలి. మీ కళ్లముందు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే వారు ఆత్మలుగా మారి మీకేదో సంకేతం ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకు సంకేతంగా పదేపదే మీ కళ్లముందు తిరగుతున్నట్టు కనిపించడం, కలలోకి రావడం జరుగుతూ వుంటుంది. మీ కలలో చనిపోయిన వ్యక్తి చాలా బాధపడుతూ ఏడుస్తూ వున్నాడు మీకేదో చెప్పాలని అనుకుంటూ వున్నాడు, కానీ మీకు ఏమి చేయాలో అర్థంకావడం లేదు, అలాంటి సందర్భంలో మీరు ఎవరన్నా భూతవైద్యుడి దగ్గరికి వెళ్తారు. మిమ్మల్ని సమస్య నుంచి బయటపడేయడానికి ఏవో పూజలు హోమాలు చేస్తూ వుంటారు. ఒక వేల చనిపోయిన వ్యక్తి మీ కలలోకి నవ్వుతూ కనిపిస్తే మీ రాబోయే కాలం చాలా సంతోషంగా గడుస్తుంది. అందుకు వారు చాలా సంతోషపడుతున్నారు అని విశ్వసిస్తారు. ఇలా ఎన్నో సంకేతాలు మనకు కనబడుతూ వుంటాయ్.

చాలా ఎక్కువ సీతాకోక చిలుకలు మీ చుట్టూ తిరుగుతూ వుంటే మీ చుట్టూ మరణించిన వారి ఆత్మవున్నట్టు అర్థం చేసుకోవాలి. చైనా పురాణ శాస్త్రంలో మరణించిన వారి ఆత్మలు సీతాకోక చిలుకలో వుంటాయని చెబుతారు. ప్రతీ మతానికి కొన్ని నమ్మకాలు, సంప్రదాయాలూ వుంటాయ్, అవి కొన్ని సార్లు దేశాలకు కూడా అప్లై అవుతాయ్. జంతువులు విచిత్ర ప్రవర్తన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంట్లో ఖాళీ ప్రదేశంలో కుక్కలు మొరుగుతున్న వీడియోలను మనం ఎన్నింటినో చూసి వుంటాం. కుక్కలు దయ్యాలు, లేదా ఆత్మలను చూసినప్పుడు అలా మొరుగుతుంటాయని అంటూవుంటారు.
కుక్కలకు కొన్ని అతీత శక్తులు వుంటాయ్. వాతావరణంలో జరిగే కొన్నా మార్పులను చాలా త్వరగా పట్టేస్తాయ్. చుట్టూ ఏదన్నా ఆత్మ లాంటివి వున్న పసిగట్టేస్తాయ్. ఇంట్లో కుక్కలు ఏ కారణం లేకుండా అదే పనిగా అరుస్తూ వుంటే వాటికి ఏదో శక్తి, ఆత్మ కనబడుతున్నాయని అర్థం చేసుకోవాలి.

మీరు ఇంట్లో ఎవరూ లేనప్పుడు మీతో ఎవరో ఉన్నట్టు మీకనిపిస్తుంది. సడన్‌గా ఒక నీడ కనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే ఆ నీడ అక్కడ వుండదు. ఇలా మనకు ఎన్నో సందర్భాల్లో జరిగే వుంటుంది. వారు మీతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ మీ చుట్టూ ఆత్మ వున్నట్టుగా అర్థం చేసుకోవాలని అంటారు. అవి మీతో మాట్లాడ్డానికి కూడా రెడీ అయినట్టేనని మీరు గ్రహించాలి.
రాత్రి పూట ఎవరో నడుస్తున్న శబ్దం, కాళ్ల గజ్జల శబ్దం, ఎవరో గట్టిగా నవ్వడం లేదా ఏడవడం మీకనిపిస్తే మీ ఇంట్లో ఏదో ఆత్మ తిరుగుతున్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి. పాత భవనాల్లో ఇవన్నీ ఎక్కువగా వినబడుతూ వుంటాయ్. మీరు ఆ భవనంలోకి రాకముందు అక్కడెవరైనా చనిపోయి తరువాత వారి ఆత్మే అక్కడ అరుస్తూ వుంటే మీకు అది వినబడొచ్చు.
కంప్యుటర్లు వాటంతట అవే అకస్మాత్తుగా ఆన్ ఆఫ్ అవటం. అతీత శక్తులను పసిగట్టే సామర్ధ్యం ఎలక్ట్రానికి పరికరాలకు వుంటుందన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. సడన్ కొత్త బల్బ్ పేలిపోవడం జరుగుతుంది. ఇది కూడా ఆత్మల వల్ల జరుగుతుందని అంటారు. మానసికంగా, శారీరకంగా బలహీనంగా వున్నవారిని దయ్యాలు ఆకట్టుకుంటాయ్. ఎప్పుడూ ఎవరో మిమ్మల్ని చూస్తున్నట్టుగా మీకనిపిస్తే, లేదా మీతో మాట్లాడుతున్నట్టు మీకనిపిస్తే మీ చుట్టూ ఆత్మ తిరుగుతోందని అర్థం చేసుకోవాలి.
గమనిక : పైన ఇచ్చిన వివరాలన్నింటినీ ఇంటర్నెట్, ఇతర సంబంధిత నిపుణుల నుంచి సేకరించింది.వీటిని మేము ఎట్టి పరిస్థితిలో దృవీకరించము.



Click it and Unblock the Notifications
