Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
సర్జరీకి ముందు ధన్వంతరీ మంత్రం చదివిన డాక్టర్లు..ఈ మంత్రం మహిమ ఏంటో తెలుసా..వీడియో చూడండి
భూమ్మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఎలాంటి వ్యాధులు లేదా రోగాలు లేకుండా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటారు. అయితే చాలామందికి అది సాధ్యం కాదు. ప్రస్తుతం మారిన జీవనశైలి విధానం,ఆహార అలవాట్ల కారణంగా దాదాపు ప్రతి వ్యక్తి త జీవితంలో ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొందరు ఈ వ్యాధుల నేుంచి త్వరగా కోలుకుంటుంటారు..అయితే మరికొందరు జీవితాంతం దాని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారికి ఆపరేషన్ చేయించుకోవడం కూడా అవసమవుతుంది. అయితే ఆపరేషన్ కు ముందు చాలామంది గుడికి వెళ్లో లేదా హాస్పిటల్ ఆవరణలో ఉండే దేవుడి దగ్గరకు వెళ్లి అంతా సవ్యంగా జరిగేలా చూడాలాని మొక్కుకోవడం మనం చూస్తుంటాం.
అయితే హాస్పిటల్ లో ఓ పేషెంట్ కు ఆపరేషన్ చేసే ముందు కొందరు డాక్టర్లు ఎంతో భక్తిశ్రద్ధలతో ధన్వంతరి మంత్రాన్ని జపిస్తున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా ఆధునిక వైద్యంలో మనసు-శరీరం మధ్య ఉన్న సంబంధంపై కొత్త చర్చకు దారితీసింది. అసలు ఈ ధన్వంతరి మంత్రం అంటే ఏమిటి? వైద్య నిపుణులు దీనిని ఎందుకు జపించారో ఇక్కడ చూడండి.

ఎవరీ ధన్వంతరి స్వామి?
హిందూ ధర్మంలో శ్రీ మహావిష్ణువు అంశగా ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి అధిపతిగా ధన్వంతరిని కొలుస్తారు. క్షీరసాగర మథనం సమయంలో చేతిలో అమృత కలశంతో ఉద్భవించిన ఆరోగ్య ప్రదాత ఆయనే. ఈ అమృత కలశం సంపూర్ణ ఆరోగ్యానికి, జీవశక్తికి ప్రతీక.
ధన్వంతరి మంత్రాన్ని జపించడం శారీరక, మానసిక స్వస్థత కోసం చేసే ఒక ఆధ్యాత్మిక ప్రార్థనగా భావిస్తారు.
ధన్వంతరి మంత్రం ఇదే
"ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశ హస్తాయ
సర్వభయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రిలోకపథాయ
త్రిలోకనాథాయ శ్రీ మహావిష్ణవే నమః"
అర్థం: ధన్వంతరి రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువుకు నా నమస్కారాలు. అమృత కలశాన్ని చేతిలో ధరించిన ఓ దేవ దేవా, మా భయాలన్నింటినీ పోగొట్టు, సర్వ రోగాలను నివారించు. ముల్లోకాలకు రక్షకుడవైన నీకు వందనం.
ధన్వంతరి మంత్రం జపించడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు
ఆపరేషన్ కు ముందు మనసును ప్రశాంతం: ఈ మంత్ర జపం డాక్టర్లు, పేషెంట్లలో ఉండే ఆందోళనను తగ్గించి, మనసును ప్రశాంతపరుస్తుంది.
పాజిటివ్ ఎనర్జీని ఆవాహన చేస్తుంది: మంత్ర జపం ద్వారా వచ్చే ప్రకంపనలు ఆపరేషన్ థియేటర్ లోని వాతావరణాన్ని శుద్ధి చేసి, స్వస్థత చేకూరేందుకు అనువైన శక్తిని నింపుతాయి.
సంపూర్ణ స్వస్థతను ప్రోత్సహిస్తుంది: ఈ మంత్రం శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేసి ఆపరేషన్ తర్వాత త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.
డాక్టర్లకు ఆధ్యాత్మిక బలం: ముఖ్యంగా క్లిష్టమైన సర్జరీలు చేసేటప్పుడు, ఇలా ప్రార్థనతో మొదలుపెట్టడం వల్ల డాక్టర్లకు మానసిక స్థైర్యం, దైవిక సహాయం ఉన్నాయనే నమ్మకం కలుగుతాయి.
డాక్టర్-పేషెంట్ బంధాన్ని బలపరుస్తుంది: డాక్టర్లు ఇలా ప్రార్థించడం చూసిన రోగులు వారిపై మరింత నమ్మకాన్ని, మానసిక ధైర్యాన్ని పొందుతారు. ఇది మెరుగైన ఫలితాలకు దారితీస్తుంది.
ఇది కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాదు
ఆధునిక వైద్యశాస్త్రం కూడా మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యంపై ఎంతగా ప్రభావం చూపుతాయో గుర్తిస్తోంది. సంగీతం, ప్రార్థన, ధ్యానం ఇలా ఏ రూపంలోనైనా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే పద్ధతులను ప్రపంచవ్యాప్తంగా అనేక హాస్పిటల్స్ అనుసరిస్తున్నాయి. డాక్టర్లు ధన్వంతరి మంత్రాన్ని జపించే ఈ వీడియో సైన్స్,ఆధ్యాత్మికత రెండూ కలిసి వైద్యరంగంలో అద్భుతాలు చేయగలవని గుర్తుచేస్తోంది. ఈ ప్రాచీన మంత్రం నేటికీ ఎంత శక్తివంతమైనదో స్పష్టమవుతోంది. వాస్తవానికి ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలోని సంఘటన జరిగింది 2022లో కర్ణాటకలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో.
మీరు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నా,ఆపరేషన్ కు సిద్ధమవుతున్నా లేదా కేవలం మానసిక ప్రశాంతత కోసం చూస్తున్నా ఈ ధన్వంతరి మంత్రం మీ మనసుకు, శరీరానికి అవసరమైన సమతుల్యతను తీసుకురావచ్చు.



Click it and Unblock the Notifications