Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పెట్రోల్ నుంచి ఇన్ని వస్తువులు తయారవుతాయని మీకు తెలుసా..?
మన నిత్యజీవితంలో పెట్రోల్ కు సంబంధించిన వస్తువులు లేనిదే రోజు గడవదు అన్న విషయం బహుశా చాలా మందికి తెలియదు. పెట్రోల్ తయారు చేసే క్రమంలో మిగిలిన వ్యర్ధాల ద్వారా ఇతర వస్తువులను తయారు చేస్తారు. వాసిలిన్, చాక్‌లెట్, టూత్‌పేస్ట్ ఇలా చాలా రకాల వస్తువలను తయారు చేసుకోవచ్చు. పెట్రోల్ ధర పెరిగితే చాలా ధరలు అకస్మాత్తుగా పెరుగుతాయ్. అందువల్లే పెట్రోల్ ధర పెరిగినప్పుడల్లా దేశంలో అల్లకల్లోలం జరుగుతుంది. పెట్రోల్‌తో తయారయ్యే వస్తువులు ఏంటి, వాటిని ఎలా పెట్రోల్ నుంచి తయారు చేస్తారో తెలుసుకుందాం.
చాక్లెట్లకు వేసే కోటింగ్‌లో కొన్ని సందర్భాల్లో ప్రఫిన్ వాక్స్‌ను ఉపయోగిస్తారు. ఈ ప్రఫిన్ వాక్స్‌ను పెట్రోల్, బొగ్గు, నుంచి సేకరిస్తారు. ఇది చాక్లెట్‌ను ఎక్కువ ఉష్ణోగ్రతలో కూడా గట్టిగా వుండేలా చేస్తుంది. అందువల్ల దీనికి ఈ కోటింగ్‌ను వేస్తారు. చాక్లెట్ ఎక్కడైనా పెడితే అతుక్కోకుండా వుండేందుకు దీన్ని యాడ్ చేస్తారు.
టూత్ పేస్ట్
పళ్లుతోమే టూత్ పేస్ట్‌లో పాలిథిలిన్ గ్లైకోల్ వుంటుంది. దీనికి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా వుండడం, టూత్ పేస్ట్ నీళ్లల్లో కలిసేలా చేయడం వల్ల దీన్ని టూత్ పేస్ట్‌లో ఉపయోగిస్తున్నారు.
పర్‌ఫ్యూమ్
భూమిలో పెట్రోల్ ఉండడానికి కారణం మనకు తెలిసే వుంటుంది. లక్షల సంవత్సరాల క్రితం చనిపోయిన జీవరాశుల అవశేశాల మట్టిలో కిలిసి రసాయక చర్య ఏర్పడిన తరువాత ఈ పెట్రోల్ ఉత్పత్తి అయింది. ఇప్పుడు ఇలాంటి పెట్రోల్‌కు సంబంధించిన వాటితోనే పర్ఫ్యూమ్లు తయారు చేస్తున్నారంటే నమ్మడానికి ఆశ్చర్యంగా వుంది కదూ. చాలా పర్‌ఫ్యాముల్లో ఆ సువాసన రావడానికి ముఖ్య కారణం పెట్రోల్ నుంచి తీసుకున్న ఆయిల్స్ ను ఉపయోగించడం వల్లే.

మందులు, క్యాప్సుల్లు
చాలా క్యాప్సుల్లు ప్లాస్టిక్‌తో కోటింగ్ వేసిన విషయం మనకు తెలిసిందే. గొంతులో ట్యాబ్లెట్ వేసుకుంటే సులువుగా గొంతులోపలికి వెళ్లడానికి ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తారు. ముందుల్లో వున్న రసాయణం ఎక్కువ కాలం నిలువ వుండడానికి కూడా ఈ కోటింగ్ ఉపయోగిస్తారు.
ఐస్‌క్రీం
ఐస్‌క్రీముల్లో వున్న వివిధ ఫ్లేవర్లు సింథటిక్ ఆయిల్స్ నుంచి తయారు చేయబడినవి. వీటితో అనేక రకాల ఫ్లేవర్లను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బాదాం ఫ్లేవర్, వెనిలా ఫ్లేవర్ లాంటివి పెట్రోల్ కు సంబంధించిన ఉత్పత్తుల నుంచే తయారు చేసుకున్నారు.
షేవింగ్ క్రీం
షేవింగ్ క్రీంలో కూడా పొట్రోల్ కు సంబంధించిన ఉత్పత్తులే వుంటాయ్. ఇందులో వుండే ఐసోపెంటేన్ క్రూడ్ ఆయిల్ నుంచి తీసుకొనబడింది. ఈ ఐసోపెంటేన్‌కు చర్మం పై వుండే ఆయిల్ పదార్ధాలను, వెంట్రుకలను తొలగించే సామర్ధ్యం వుంటుంది. సెక్సువల్ లూబ్రికెంట్లలో కూడా పెట్రోల్‌కు సంబంధించిన ఉత్పత్తులను ఉపయోగిస్తారు.
వాజిలిన్
వాజిలిన్‌ను పెట్రోలియమ్ జెల్లీ అని పిలుస్తాం. పెట్రోలియం జెల్లీ అని గుర్తించినా ఇది పెట్రోల్ కు సంబంధించిన ఉత్పత్తులతో తయారైందన్న విషయం మనకు తెలియదు. సముద్రంలో వుండే క్రూడ్ అయిల్ నుంచి ఇతర పెట్రోల్ ఉత్పత్తులను తయారు చేస్తారు. ఈ క్రమంలో పొట్రోలాటమ్ ఉత్పత్తి అవుతుంది. ఈ పెట్రోలాటమ్ నుంచి మరింత రిఫైన్ చేసి పొట్రోలియం జెల్లీని తయారు చేస్తాం.
పెట్రోల్ నిలవ ఆగిపోతే ఎన్నో వస్తువుల తయారీలో పెనుభారం పడనుంది.



Click it and Unblock the Notifications