Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
పెళ్లి చూపులప్పుడు జీతం,అస్తి,లుక్స్ కాదు..ఇది చూడకపోతే కాపురం సర్వనాశనమే..మహిళ రియల్ స్టోరీ
మనదేశంలో చాలావరకు పెళ్లిళ్లు పెద్దలు కుదిర్చినవే ఉంటాయి. లవ్ మ్యారేజ్ లు ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్నాయి కానీ గతంలో అరేంజ్డ్ మ్యారేజ్ లే ఎక్కువగా ఉండేవి. పెళ్లి సంబంధం చూసేటప్పుడు పెద్దలు అన్నీ కోణాల్లో అంటే ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్, సోషల్ స్టేటస్, బ్యాక్ గ్రౌండ్ వంటివన్నీ పరిశీలించే సంబంధం ఓకే చేసేవాళ్లు. అయితే ఇప్పుడు కాలం మారిపోయింది. నిర్ణయం తీసుకునే ముందు వ్యక్తులు తమకు కాబోయే పార్టనర్ గురించి తెలుపుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఈ రోజుల్లో పెళ్లి చేసుకునే అమ్మాయిలు చూడాల్సిందే అబ్బాయి జీతం,సొసైటీలో వారి కుటంబానికి ఉన్న హోదా కాదని..కాబోయే వాడిని డిజిటల్ బ్యాక్ గ్రౌండ్ చెక్ తప్పనిసరిగా చేయాలని ఓ యువతి చెబుతోంది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం రెడ్డిట్ లో తన రియల్ స్టోరీ షేర్ చేసిన 22 ఏళ్ల యువతి.. మంచి జీతం, గౌరవప్రదమైన ఫ్యామిలీ, అబ్బాయి మంచోడంటూ తన తల్లిదండ్రులు తనను బలవంతంగా ఒప్పించి ఒకడితో తనకు పెళ్లి చేశారని..అయితే పెళ్లయిన తర్వాతనే భర్త అసలు రంగు బయటపడిందని..జీతం,ఆస్తి,అంతస్థు,లుక్స్ ద్వారా వ్యక్తి నిజమైన క్యారెక్టర్ తెలియదని, నలుగురిలో లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు అతడు ఎలా బిహేవ్ చేస్తాడన్నదే అతని రియల్ క్యారెక్టర్ అని ఆ యువతి తెలిపింది. తన అనుభవాన్ని షేర్ చేసిన మహిళ ఈ డిజిటల్ యుగంలో అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలో హెచ్చరించింది.

ఇలా దొరికేసాడు
తన భర్త ప్రతీది తన కంట్రోల్ లో ఉంచుకోవాలని చూసేవాడని, అడగకపోయినా అసభ్యకర మెసేజ్ లు పంపేవాడని, మానసికంగా వేధించేవాడని చెప్పింది. యువతి షేర్ చేసిన వివరాల ప్రకారం.. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆ యువతి ఓ రోజు అసలు నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. తన ఫ్రెండ్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా భర్తకు దగ్గరైంది. ఆ తర్వాత బయటపడిన నిజాలు మరింత భయంకరంగా ఉన్నాయి. తాను తన ఫ్రెండ్ ఇాన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన భర్తకు దగ్గరయ్యానని, తాను ఏ మాత్రం సరసాలాడకపోయినా, అసభ్యకరంగా ఏమీ అడగకపోయినా. అతను తన వికృత స్వరూపాన్ని బయటపెట్టడాడని చెప్పింది. అతను గ్రాఫిక్ ఫోటోలను పంపేవాడని ఇది పెద్ద విషయం కాదు అని చెబుతూ పోర్న్ చూస్తున్నట్లు గొప్పగా చెప్పుకున్నాడని ఆ యువతి చెప్పింది. తన భర్దలోని దరిద్రపు ఆలోచనలన్నీ మెసేజ్ ల రూపంలో భయపెట్టాడని.. భర్త వ్యక్తిత్వం విషపూరితంగా అనిపించిందని చెప్పింది.
పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు ఇది తెలుసుకోవాలి
కేవలం మంచి ఉద్యోగం, పలుకుబడి ఉన్న కుటుంబం అనేవి ఒక వ్యక్తి నడవడికను పూర్తిగా ప్రతిబింబించవని ఆ యువతి సృష్టం చేసింది. ఒక మనిషి అసలు స్వరూపం, ఎవరూ చూడటం లేదనుకున్నప్పుడు ముఖ్యంగా ఆన్ లైన్ లో ఎలా ప్రవర్తిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుందని చెబుతోంది. పాత ఇన్ స్టాగ్రామ్ కామెంట్లు, లింక్డ్ ఇన్ పోస్టులు, రెడ్డిట్ హిస్టరీ, అపరిచితులతో ఆన్ లైన్ లో జరిపే సంభాషణలు ఇవన్నీ నిజ జీవితంలో వెంటనే బయటపడని వారి వ్యక్తిత్వంలోని చీకటి కోణాలను బహిర్గతం చేస్తాయని కాబట్టి పెళ్లి వంటి జీవితకాలపు బంధంలోకి అడుగుపెట్టే ముందు కేవలం పైపై మెరుగులకే పరిమితం కాకుండా డిజిటల్ ఫ్లాట్ ఫ్లాంలలో వారి ప్రవర్తనను కూడా ఒక కంట కనిపెట్టడం నేటి అమ్మాయిలకు ఎంతో అవసరమని యువతి సూచించింది. ఈ యువతి పోస్ట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.



Click it and Unblock the Notifications