For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Diwali 2022: లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే.. దీపావళికి ఈ సమయానికి పూజించండి

ఉత్సాహంతో గొప్పగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి ఒక శుభప్రదమైన హిందూ పండుగ. కార్తీక మాసంలోని అమావాస్య నాడు వస్తుంది.

|

Diwali 2022: ఉత్సాహంతో గొప్పగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి ఒక శుభప్రదమైన హిందూ పండుగ. కార్తీక మాసంలోని అమావాస్య నాడు వస్తుంది. ఇది ప్రతి సంవత్సరం దసరా వేడుకల 20 రోజుల తర్వాత వస్తుంది. ధం‌తేరస్ నుండి భాయ్ దూజ్ వరకు ఐదు రోజుల పాటు కొనసాగుతుంది.

diwali

ఈ పండుగను జరుపుకోవడానికి చాలా రోజుల ముందుగానే సన్నాహాలు ప్రారంభమవుతాయి. దీపావళి గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి:

2022లో దీపావళి ఎప్పుడు?

2022లో దీపావళి ఎప్పుడు?

ఐదు రోజుల పండుగ అక్టోబర్ 22, 2022 శనివారం నాడు ధన్‌తేరస్‌తో ప్రారంభమవుతుంది. 26 అక్టోబర్ 2022 బుధవారం భాయ్ దూజ్‌తో ముగుస్తుంది. దీపావళి మూడవ రోజు అంటే సోమవారం, అక్టోబర్ 24, 2022 లేదా పదిహేనవ రోజున జరుపుకుంటారు.

దీపావళి 2022 సమయం:

దీపావళి 2022 సమయం:

అమావాస్య తిథి అక్టోబర్ 24, 2022న సాయంత్రం 05:27 గంటలకు ప్రారంభమవుతుంది. అమావాస్య తిథి అక్టోబర్ 25, 2022న సాయంత్రం 04:18 గంటలకు ముగుస్తుంది.

దీపావళి ఐదు రోజులు 2022:

దీపావళి ఐదు రోజులు 2022:

1. ధంతెరాస్(త్రయోదశి) అక్టోబర్ 22, 2022 శనివారం రోజున వస్తోంది. ఈరోజు బంగారం, ఇతర లోహాలు కొనుగోలు చేస్తే మంచి జరుగుుతుందని విశ్వాసం.

2. చోటి దీపావళి(నరక చతుర్దశి) అక్టోబర్ 23, 2022 ఆదివారం రోజున వస్తోంది. ఈరోజు అలంకరణలు మరియు రంగోలీల తయారు చేస్తారు.

3. దీపావళి(లక్ష్మీ పూజ, అమావాస్య) అక్టోబర్ 24, 2022 సోమవారం రోజున వస్తోంది. ఈరోజు దీపాలు వెలిగిస్తారు. టపాకాయలు కాలుస్తారు.

4. గోవర్ధన్ పూజ(ప్రతిపాద) అక్టోబరు 26, 2022 మంగళవారం రోజున వస్తోంది. ఈరోజు శ్రీ కృష్ణుడిని పూజిస్తారు.

5. భాయ్ దూజ్(ద్వితీయ) అక్టోబర్ 26, 2022 బుధవారం రోజున వస్తోంది. ఈరోజు సోదర సోదరీమణుల ద్వితీయ వేడుక జరుపుకుంటారు.

ధంతెరాస్ చరిత్ర, ప్రాముఖ్యత

ధంతెరాస్ చరిత్ర, ప్రాముఖ్యత

ధంతెరాస్ ను ధన త్రయోదశి అని కూడా పిలుస్తారు. ఇది మొత్తం ఐదు రోజుల పాటు జరిగే దీపావళి ఉత్సవాల ప్రారంభాన్ని సూచిస్తుంది. క్షీరసాగర మథనం సమయంలో కుబేరుడు, లక్ష్మీదేవి మరియు ధన్వంతి సముద్రం నుండి బయటకు వచ్చారని నమ్ముతారు. అందుకే ఈ రోజున ముక్కోటి దేవతలను పూజిస్తారు.

హిందూ క్యాలెండర్ ప్రకారం, ధంతెరాస్ పండుగ కార్తీక మాసంలో కృష్ణ పక్షంలోని పదమూడవ రోజున వస్తుంది. ఈ రోజు ప్రజలు బంగారం, వెండి, పాత్రలు మరియు గాడ్జెట్‌లను కొనుగోలు చేసే వారికి చాలా పవిత్రమైన మరియు ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈ రోజున అలాంటి వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో అదృష్టం మరియు లక్ష్మీ దేవి ఆశీర్వాదాలు లభిస్తాయని విశ్వాసం. ఈ సంవత్సరం దీపావళికి రెండు రోజుల ముందు, అక్టోబర్ 22, 2022 శనివారం నాడు ధంతెరాస్ జరుపుకుంటారు.

నరక చతుర్దశి(చోటీ దీపావళి) చరిత్ర మరియు ప్రాముఖ్యత

నరక చతుర్దశి(చోటీ దీపావళి) చరిత్ర మరియు ప్రాముఖ్యత

నరక చతుర్దశినే చోటీ దీపావళి అని కూడా పిలుస్తారు. నరక చతుర్దశి హిందువులలో మరొక అత్యంత ముఖ్యమైన మరియు పవిత్రమైన పండుగ. ఇది కార్తీక మాసంలో పద్నాలుగో రోజున వస్తుంది. ఒకప్పుడు నరకాసురుడు అనే రాక్షసుడు చాలా శక్తులను సంపాదించాడని మరియు వేలాది మంది యువతులను బందీగా ఉంచాడని నమ్ముతారు. తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారంగా వారిని హింసించేవాడు.

స్త్రీలు శ్రీకృష్ణుడిని ఆరాధించి సాయం చేయాల్సిందిగా కోరారు. శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపి యువతులను రక్షిస్తాడు. కానీ అన్ని రోజుల పాటు నరకాసురిడి దగ్గర ఉన్న యువతులి సాంఘిక బహిష్కరణకు భయపడతారు. అలా వారందరినీ శ్రీకృష్ణుడు తన భార్యలుగా స్వీకరిస్తాడు. అప్పటి నుండి ప్రజలు ఈ రోజును నరక చతుర్దశిగా జరుపుకుంటారు. దీపాలను వెలిగించడం, ఇంట్లో రంగోలిలు చేయడం మరియు బాణసంచా కాల్చుతారు.

దీపావళి (లక్ష్మీ పూజ) చరిత్ర మరియు ప్రాముఖ్యత

దీపావళి (లక్ష్మీ పూజ) చరిత్ర మరియు ప్రాముఖ్యత

దీపావళి భారతదేశంలో శ్రీరామునికి అంకితం చేయబడిన అతిపెద్ద మరియు అతి ముఖ్యమైన పండుగ. గ్రంథాల ప్రకారం, కార్తీక అమావాస్య నాడు రావణుడిని చంపిన తరువాత, రాముడు తన భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణులతో కలిసి 14 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత అయోధ్యలోని తన రాజ్యానికి తిరిగి వస్తాడు. అయోధ్య ప్రజలు తమ రాజు విజయం, తిరిగి అయోధ్యకు రావడంతో చాలా సంతోషంతో అయోధ్య అంతా మట్టి దీపాలు వెలిగిస్తారు. బాణసంచా కాలుస్తారు. అప్పటి నుండి దీపావళిని జరుపుకోవడం వస్తోంది.

లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఏడాదంతా తమకు ఆర్థిక పరంగా ఎలాంటి అడ్డంకులు రాకుండా.. అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని.. శ్రేయస్సు పొందుతామని నమ్ముతారు. ఈరోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలస్నానం చేస్తారు. కొత్త బట్టలను ధరిస్తారు. లేదంటే ఉతికిన బట్టలను ధరించి పూజా గదిని శుభ్రం చేస్తారు. అలాగే తమ ఇంటిని మొత్తం శుభ్రంగా చేసుకుని పూజకు సిద్ధమవుతారు. అదే సమయంలో పాత వస్తువులను ఇంట్లో నుండి తొలగిస్తారు. ముఖ్యంగా విరిగిన పాత్రలను బయటపడేయాలి.

పూజా విధానం..

పూజా విధానం..

లక్ష్మీ గణేశుని విగ్రహాలను తూర్పు దిశలో ఉంచాలి. పూజకు కూర్చునే వారు విగ్రహాల ఎదుట కూర్చోవాలి. లక్ష్మీదేవి విగ్రహం దగ్గర పంచామ్రుతం ఉంచి, కలశం ఉంచాలి. కొబ్బరికాయను ముందు భాగం స్పష్టంగా కనిపించేలా ఎర్రటి గుడ్డలో చుట్టి కలశంపై ఉంచాలి. ఒక పెద్ద దీపంలో నెయ్యి లేదా నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని వినాయక విగ్రహం వద్ద ఉంచాలి. అనంతరం కలశం వైపు ఒక పిడికెడు బియ్యంతో ఎర్రటి వస్త్రాన్ని సూచించే తొమ్మిది కుప్పల నవగ్రహాలను తయారు చేయండి. మధ్యలో తమలపాకులను ఉంచాలి.

కొన్ని నీళ్లను కుండలో నుండి తీసుకుని కొన్ని నీటి చుక్కలను విగ్రహాలపై చల్లాలి. ఇలా చిలకరించడం వల్ల మిమ్మల్ని మరియు పూజా సామాగ్రి మరియు మిమ్మల్ని పవిత్రం చేసుకున్నట్టే. అనంతరం లక్ష్మీదేవి మంత్రాలను పఠిస్తూ పువ్వులను అమ్మవారికి సమర్పించండి. ‘ఓం కేశవాయ నమః' ‘ఓం నారాయణయ నమః' అనే మంత్రాన్ని తప్పక పఠించండి.

గోవర్ధన్ పూజ చరిత్ర, ప్రాముఖ్యత

గోవర్ధన్ పూజ చరిత్ర, ప్రాముఖ్యత

సాధారణంగా, గోవర్ధన్ పూజ దీపావళి తర్వాత రోజు వస్తుంది. అయితే ఈ సంవత్సరం సూర్యగ్రహణం కారణంగా అక్టోబర్ 25న ఒక రోజు తర్వాత వస్తుంది. ఆలయాలను సందర్శించడానికి మరియు పూజ చేయడానికి గ్రహణాన్ని అననుకూల సమయంగా పరిగణిస్తారు. గోకుల్ గ్రామస్తులు ఇంద్రుడిని ఆరాధించడం మానేసినప్పుడు అతని కోపాన్ని ఎదుర్కొన్నారని నమ్ముతారు. అప్పుడు కృష్ణుడు వారిని రక్షించడానికి వచ్చాడు మరియు గోవర్ధన్ కొండను తన చిటికెన వేలుపై ఎత్తాడు. గ్రామస్థులకు మరియు పశువులకు ఆశ్రయం ఇచ్చాడు మరియు వాటిని రక్షించాడు.

అప్పటి నుండి అన్నకూట్ పూజ అని కూడా పిలువబడే గోవర్ధన్ పూజ శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. ఈ రోజున ప్రజలు ఆవు పేడ మరియు బురదతో చిన్న కొండలను తయారు చేస్తారు. కృష్ణ భగవానుడికి సమర్పించడానికి చప్పన్ భోగ్ (56 రకాల ఆహారాలు) తయారు చేసి పూజిస్తారు. భక్తులు శ్రీకృష్ణుని విగ్రహాలకు పాలతో స్నానమాచరించి, కొత్త బట్టలు, నగలు ధరిస్తారు.

భాయ్ దూజ్ చరిత్ర, ప్రాముఖ్యత

భాయ్ దూజ్ చరిత్ర, ప్రాముఖ్యత

తోబుట్టువులలో పాటు జరుపుకునే పవిత్రమైన పండగ భాయ్ దూజ్. ఇది సోదరసోదరీమణుల మధ్య ప్రేమను సూచిస్తుంది. దేశవ్యాప్తంగా ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల చివరి రోజున గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు.

ఈ పవిత్రమైన రోజున, సోదరీమణులు తమ సోదరుల నుదుటిపై తిలకం దిద్దుతారు. తర్వాత హారతి ఇస్తారు. వారు అతనికి కాలవా దారంతో ఒక ఎండు కొబ్బరిని అందజేస్తారు. ఒకరికొకరు స్వీట్లు తినిపిస్తారు మరియు బహుమతులు ఇచ్చుకుంటారు. రక్షాబంధన్ వంటి ఈ రోజున, సోదరీమణులు తమ ప్రియమైన సోదరుల దీర్ఘాయువు మరియు శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు.

భాయ్ దూజ్ వేడుక వెనుక చాలా పురాణ కథలు ఉన్నాయి. నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన తరువాత, శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్రను సందర్శించాడని, అప్పుడు సుభద్ర శ్రీకృష్ణుడి నుదుటన తిలకం దిద్దుతుందని నమ్ముతారు. అలా భాయ్ దూజ్ వేడుక ప్రారంభం అయిందని కొంత మంది విశ్వసిస్తారు.

English summary

Diwali 2022: Lakshmi Puja Date, Shub Muhurat, Rituals and Pooja Vidhi in telugu

read on to know Diwali 2022: Lakshmi Puja Date, Shub Muhurat, Rituals and Pooja Vidhi in telugu
Desktop Bottom Promotion