Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Diwali 2024: దీపావళికి గిఫ్ట్స్ ఇస్తున్నారా?.. అయితే ఈ తప్పులు మాత్రం చేయకండి!
మన జీవితంలో ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమం జరిగినా, ఏదైనా పండుగ వచ్చినా బహుమతులు ఇచ్చుకుంటాం. ఇది అవతలి వ్యక్తిపై మన ప్రేమను చూపడంతో పాటు.. ఎలాంటి సమయంలోనైనా మీకు మేము ఉన్నాము అనే ధైర్యాన్ని ఇస్తుంది. అలానే దీపావళికి కూడా కొందరు బహుమతులు ఇచ్చుకుంటూ ఉంటారు.
చాలా మంది చాలా రకాల బహుమతులు ఇచ్చుకుంటారు. కానీ ఈ కొన్నింటిని మాత్రం అస్సలు ఇవ్వకూడదని పండిత నిపుణులు చెబుతున్నారు. ఎందుకు ఆ బహుమతులను ఇవ్వొద్దు, ఆ బహుమతులు ఇస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
గడియారాలు:
సాధారణంగా బహుమతిగా గడియారం ఇవ్వడమనేది సర్వసాధారణం. అయితే ఈ దీపావళికి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గడియారాన్ని బహుమతిగా ఇవ్వొద్దు. ఇలా గడియారం ఇవ్వడం అనేది అశుభసూచికమని చెబుతున్నారు. ఈ గడియారం తిరిగేకొద్దీ మనిషి యొక్క జీవితం కూడా తగ్గిపోతుందనే సూచన వస్తుందని పేర్కొంటున్నారు. మనం కావాలనే మీ జీవితం తగ్గిపోవాలనే సంకేతాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పుకుంటున్నారు. అందుకే ఈ దీపావళికి గడియారాన్ని బహుమతిగా ఇవ్వకండి..

నలుపు, తెలుపు వస్తువులు:
పండుగ అంటేనే కొత్త బట్టలు వేసుకోవడం. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు వేసుకొని పండగల్లో పాల్గొంటారు. అందుకు తగ్గట్టుగానే చాలామంది పండగకు కొత్త బట్టలను బహుమతులుగా ఇస్తూ ఉంటారు. అయితే ఈ దీపావళికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుపు, నలుపు రంగుల్లో ఉండే దుస్తువులను బహుమతిగా ఇవ్వొద్దు. ఎందుకంటే నల్లటి దుస్తులు దుఃఖంతో, తెల్లటి వస్తువులు శోకంతో నిండి ఉంటాయట. అందుకే తెలుపు, నలుపు దుస్తులు ఇవ్వడం అనేది శుభసూచకమని పేర్కొంటున్నారు.
పదునైన వస్తువులు:
ప్రస్తుతం మోడ్రన్ కాలం నడుస్తుంది. చాలా మంది కిచెన్‌లో ఉపయోగపడే కత్తులను సైతం బహుమతులుగా ఇస్తూ ఉన్నారు. అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. కత్తులు అనేవి మనుషుల మధ్య ఉన్న బంధాలను తెంచేందుకు సూచకమని చెబుతున్నారు. ఆనందాలు, సంతోషాలు నిండి ఉండే కుటుంబంలో ఇలాంటి బహుమతులు ఇచ్చి, ఆనందాన్ని పాడు చేసుకోవద్దని చెబుతున్నారు. దానికి బదులుగా బంధానికి ప్రతీకగా నిలిచే వేరే బహుమతులను ఎంచుకోవాలని చెబుతున్నారు.
హ్యాండ్ బ్యాగ్:
చాలామంది తమ భాగస్వామికి లేదా సోదరిమనులకు హ్యాండ్ బ్యాగ్స్ బహుమతులుగా ఇస్తూ ఉంటారు. అయితే ఈ దీపావళికి మాత్రం హ్యాండ్ బ్యాగ్ బహుమతిగా ఇవ్వొద్దు. ఎందుకంటే దీపావళి సంతోషానికి ప్రతీకగా జరుపుకునే పండగ. అలాంటి పండగ రోజు జంతువుల తోలు నుంచి తీసిన వస్తువులను బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు.
గతంలో ఇచ్చినవే మళ్ళీ..
గతంలో ఇచ్చిన బహుమతులనే మళ్ళీ రీసైకిల్ చేసి ఇవ్వడం అనేది మంది చర్య కాదు. ఇలా మీకు వచ్చిన బహుమతిని మరొకరికి ఇవ్వటంలో ఇలాంటి అర్ధం లేదు. పైగా మీరు బహుమతితో పాటు దానితో కలిసి వచ్చిన శక్తిని కూడా వారికి ఇచ్చినట్లు అవుతుంది. అందుకే ఇలాంటి పనులు చేయకపోవడం మేలు.
మద్యం..
ఈ మధ్యకాలంలో బహుమతులుగా మందు బాటిళ్లను సైతం ఇచ్చుకుంటున్నారు. అయితే దీపావళి పండగను మద్యం బాటిళ్లను బహుమతులుగా ఇవ్వొద్దని నిపుణులు చెబుతున్నారు. దీపావళి పండుగ స్వచ్చత, ఆధ్యాత్మికత నిదర్శనం. అలంటి గొప్ప పండగను ఇలా పవిత్రం చేయడం అనేది మంచి విషయం కాదు అంటున్నారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలన్నీ కేవలం ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. దయచేసి వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications