Latest Updates
-
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి!
Diwali wishes in Telugu 2024: దీపావళి శుభాకాంక్షలను మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఇలా అందంగా చెప్పేయండి!
సాధారణ రోజుల్లో ఎలా ఉన్నా పండగలు, ప్రత్యేకమైన రోజుల్లో తప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్‌కు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాము. అలాగే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వాటిని షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వస్తుంది దీపావళి కాబట్టి చాలా మంది తెలుగులో శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే ఈ దీపావళికి మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ విధంగా విషెస్ తెలియజేయండి. అలాగే సోషల్ మీడియాలో షేర్ చేసేయండి.
దీపావళి 2024 విషెస్ ఇలా చెప్పండి..
- ఈ దీపావళి మీ జీవితంలో ప్రేమ, కాంతి, ఆనందం, శ్రేయస్సు, నింపాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు
- ఈ దీపావళి వెలుగుల మాదిరిగానే మీరు వెళ్లే మార్గం కూడా ప్రకాశవంతంగా వెలిగిపోవాలని, మీకు అన్ని విషయాల్లో విజయాలు కలగాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
- ఈ దీపావళి సమయంలో లక్ష్మీదేవి అమ్మవారు మీకు శ్రేయస్సు, శాంతి, ఆనందం, విజయం అందించాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

- ఈ దీపావళి పండగ సమయంలో మీరు వెలిగించే దీపాల కాంతులు మీ ప్రయాణంలో మీకు వెలుగునివ్వాలని, మీరు లక్ష్యాన్ని చేధించేందుకు మీకు సహాయం చేయాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
- హ్యాపీ దీపావళి. ఆ దీపావళి దీపాలు మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ మీకు మనస్ఫూర్తిగా దీపావళి శుభాకాంక్షలు
- నువ్వే నా జీవితానికి వెలుగు. ఈ దీపావళి సమయంలో మనిద్దరం ఒకరికి ఒకరం తోడు నీడలా వెలుగునివ్వాలని కోరుకుంటూ హ్యాపీ దీపావళి
- ఈ దీపావళి మీకు మీ వ్యక్తిగత జీవితంలో, మీ వ్యాపారంలో ఎనలేని విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. మీకు భగవంతుడు ఆనంద భాగ్యాలు కలగజేయాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
- ప్రతీ దీపావళి లాగానే ఈ దీపావళి కూడా మీకు చాలా ప్రత్యేకం కానుంది. ఈ దీపావళి సందర్భంగా త్వరలోనే మీకు ఒక శుభవార్త చెప్తాను. హ్యాపీ దీపావళి
- ప్రతి సంవత్సరం మాదిరిగానే మీ ప్రేమ, ఆప్యాయత, అనురాగం నాపై ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ దీపావళి మిత్రమా!
- నా హృదయపూర్వకంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరికలు ఈ పండగతో నెరవేరాలని కోరుకుంటున్నాను
- ఈ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని మీకు మీ జీవితంలో కొత్త అవకాశాలు రావాలని, మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు
- ఈ దీపావళి మీకు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రేయస్సు రావాలని కోరుకుంటూ హ్యాపీ దీపావళి
- ఈ దీపావళి సందర్భంగా మీ జీవితంలో చెడు తొలగిపోయి.. మీ జీవితం దీపావళి దీపాల మాదిరిగానే కాంతి వంతంగా మారాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి సమయంలో మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయొచ్చు. అలాగే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో స్టోరీలు పెట్టుకోవచ్చు. అచ్చమైన తెలుగులో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి దీపావళి విషెస్ తెలపాలంటే ఇవి మీకు కచ్చితంగా హెల్ప్ అవుతాయి. మరింకెందుకు ఆలస్యం వెంటనే ఈ విషెస్‌ను సేవ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.



Click it and Unblock the Notifications