Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
వివాహ సంబంధాల్లో జాప్యం.. ఈ పరిహారాలతో త్వరగా పెళ్లవుతుంది
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అతి పెద్ద పండగ. చాలా మంది జీవితాల్లో ఒక్కసారి మాత్రమే వచ్చే శుభకార్యం. ఈ మధురమైన ఘట్టం ద్వారా కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని చాలా మంది కోరుకుంటారు. పెళ్లంటే కేవలం ఇద్దరు వ్యక్తులు కాదు.. రెండు కుటుంబాల మధ్య బంధం ఏర్పడటం. ఏమాత్రం తెలియని వారితో జీవితాంతం బంధంలో కొనసాగడం. ఈ మహత్తర కార్యం కొంత మందిలో ఆందోళనకు కారణం అవుతుంది.

ఎప్పుడు జరగాల్సిన కార్యం అప్పుడు జరిగితేనే బాగుంటుంది. కానీ కొందరికి ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా ఒక్కటీ ఖాయం అవదు. పలు కారణాల వల్ల ఏ సంబంధమూ సెట్ కాక ఆందోళన పడుతుంటారు చాలా మంది. వీటికి ఇష్టాయిష్టాల కారణంగా సంబంధం వద్దనుకోవడం ఒకటైతే.. జ్యోతిష్య సమస్యల కారణంగా సంబంధాలు ఖాయం కాకపోవడం కూడా ఒకటి. వచ్చే నెల నుంచి మళ్లీ పెళ్లి ముహూర్తాలు మొదలుకానున్నాయి. నిజ శ్రావణ మాసంలో పెళ్లిళ్లకు అద్బుతమైన ముహూర్తాలు ఉన్నాయి.
ఈలోపు సంబంధం ఖాయం చేసుకుంటే పెళ్లి బంధంతో ఒక్కటైపోవచ్చు. అయితే అంతకుముందు కొన్ని పరిహారాలు పాటించడం మంచిది. ఆ పరిహారాలు పాటించడం వల్ల సమస్యలు తొలగిపోయి పెళ్లి సంబంధాలు ఖాయమవుతాయి. ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
శివపార్వతుల పూజా:
వివాహం ఆలస్యం అవుతుందని బాధపడే వారికి ఈ పరిహారం చక్కగా పని చేస్తుంది. ఇంట్లో ఉన్న చిన్నారులతో కలిసి చేయాల్సిన పని ఇది. ఎంతకీ పెళ్లి సంబంధాలు ఖాయం కావట్లేదు అనుకుంటే.. ఇంట్లోని చిన్న పిల్లలతో కలిసి శివాలయానికి వెళ్లి శివపార్వతులను పూజించాలి. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది. పెళ్లి సంబంధాలు ఖాయం అవుతాయి. త్వరలోనే పెళ్లి కూడా జరుగుతుంది.
రుద్రాక్ష:
వివాహ దోషం వల్ల వయస్సు మీద పడుతున్నా పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న వారు ఈ పరిహారం పాటించాలి. దీని ప్రకారం పెళ్లి సంబంధాలు ఎన్ని చూసినా ఒక్కటీ సెట్ కావడం లేదు అనుకునే వారు ఆరు ముఖాలు ఉన్న రుద్రాక్షను ధరించాలి. 6 ముఖాల రుద్రాక్షను కార్తికేయునికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. ఈ 6 ముఖాలు రుద్రాక్షను ధరించడం వల్ల వివాహ సమస్యలు తొలగిపోయి.. త్వరలోనే వివాహం నిశ్చయం అవుతుంది.
ఆంజనేయుని పూజ:
వివాహం చేసుకోవాలని ఉన్నా.. సంబంధాలు నిశ్చయం కాకపోతే ఈ పరిహారం చక్కని ఫలితాన్ని ఇస్తుంది. దీని ప్రకారం ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయాలి. అదే రోజు స్వామి వారికి సింధూరం సమర్పించాలి. ఇలా ప్రతి మంగళవారం చేస్తూ పోవాలి. ఇలా చేయడం వల్ల వివాహ సమస్యలు తొలగిపోతాయి. త్వరలోనే సంబంధం నిశ్చయం అవుతుంది.
నైరుతి దిశలో గది:
పెళ్లి కాబోయే అబ్బాయి లేదా అమ్మాయి తమ గది నైరుతి దిశలో లేకుండా చూసుకోవాలి. ఒకవేళ అలాంటి గదిలోనే ఉంటుంటే.. వెంటనే గది మారడం మంచిది. అలాగే దక్షిణ దిశలో కాళ్లు పెట్టి నిద్రించకూడదు. దీని వల్ల ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ రెండు పరిహారాలు పాటించి చూడండి త్వరలోనే పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది.
గురువారం రోజు:
గురువారం రోజు మహావిష్ణువును పూజించాలి. ఆ రోజు ఉపవాసం ఉండాలి. అరటి చెట్టును పూజించాలి. పసుపును దానం చేయాలి. ఇలా చేస్తూ గురు మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications