Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయా? శుక్రవారం ఇలా చేసి చూడండి, ఫలితం కనిపిస్తుంది
హిందు మత విశ్వాసాల ప్రకారం శుక్రవారాన్ని లక్ష్మీదేవి రోజుగా భావిస్తారు. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. తులసి మొక్కకు ప్రత్యేక పూజలు చేయడం, లక్ష్మీ దేవిని ఆరాధించడం లాంటివి చేస్తారు. ఈ రోజు లక్ష్మీ దేవిని పూజిస్తే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. లక్ష్మీదేవి రోజుగా పరిగణించే శుక్రవారం రోజున తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహిస్తుంది. ఆ తప్పులేమిటో తెలుసుకుని చేయకుండా ఉండటానికి ప్రయత్నించడం వల్ల ఆమె అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

మహిళలతో జాగ్రత్తగా మెసులుకోవాలి
స్త్రీ అంటేనే ఇంటికి దీపం వంటిది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇంట్లోని మహిళలను లక్ష్మీదేవి గా పరిగణిస్తారు. అయితే శుక్రవారం రోజు స్త్రీలను, బాలికలను, నపుంసకులను అవమానించకూడదు. వారి గురించి చెడుగా మాట్లాడకూడదు. వారి గురించి చెడుగా ఆలోచించకూడదు, చెడుగా ప్రవర్తించకూడదు. శుక్రవారం రోజు స్త్రీలను అవమానిస్తే లక్ష్మీ దేవి ఆగ్రహిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
చెడుకు దూరంగా ఉండాలి
శుక్రవారం రోజు ప్రశాంతంగా, ఓపికగా, సుహృద్భావంతో ఉండాలి. ఎవరితోనూ అసభ్యకరంగా, చెడుగా ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు. చెడు వ్యక్తుల వద్ద ఉండటానికి లక్ష్మీదేవి ఇష్టపడదు. లక్ష్మీ దేవి దూరమైతే ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులు, ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతారు. అనవసరం ఖర్చులు పెరుగుతాయి.
పంచదార ఇవ్వకూడదు
శుక్రవారం రోజు చక్కెరను అప్పుగా ఇవ్వకూడదు. పొరుగింటి వారికి చక్కెర ఇవ్వడం వల్ల శుక్రుడు బలహీనపడి సంపదను, ఐశ్వర్యాన్ని ప్రభావితం చేస్తాడు. భౌతిక సుఖాలకు దూరం చేస్తాడు.
లావాదేవీలు నిర్వహించొద్దు
శుక్రవారం రోజున ఆర్థిక లావాదేవీలు నిర్వహించకపోవడమే మంచిది. ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. శుక్రవారం రోజు మన చేతి నుంచి వెళ్లే డబ్బు తిరిగి రాదని అంటారు. అలాగే ఇతరుల నుంచి అప్పు తీసుకోవడం కూడా మంచిది కాదు.
మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి
శుక్రవారం రోజు మద్యం సేవించవద్దు. అలాగే మాంసాహారం తినకుండా ఉండటానికి ప్రయత్నించాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications