Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
ఎంతకీ పెళ్లి కావడం లేదా? ఈ పరిహారాలతో వచ్చే పెళ్లిళ్ల సీజన్‌లో వివాహం అయి తీరుతుంది
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మధురమైన కార్యం. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే పండగ. ఏ ఇంట్లోనైనా జరిగే అతి పెద్ద పండగ. వివాహం అంటే ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే కాదు.. రెండు కుటుంబాలు కూడా ఒకటి కావడం.
రెండు కుటుంబాలు, కుటుంబ సభ్యుల మధ్య బంధం ఏర్పడటం. అయితే ఈ వేడుక అందరికీ ఒకే సమయంలో అవ్వాలని ఏమీ లేదు. కొందరికి వయస్సు మీద పడుతున్నా.. జరగాల్సిన కార్యం జరగదు. వివిధ కారణాల వల్ల పెళ్లి ఆలస్యం అవుతుంది.

ఆగస్టు నెలలో శ్రావణ మాసం మొదలు కానుంది. ఆషాఢమాసం, అధిక శ్రావణ మాసం వల్ల పెళ్లి ముహూర్తాలు లేవు. మంచి ముహూర్తాల కోసం అందరూ వేచి చూస్తున్నారు. ఆగస్టు 20 వ తేదీ నుంచి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో అత్యధిక పెళ్లిళ్లు జరుగుతాయి.
ఇలా వివిధ కారణాల వల్ల పెళ్లి లేటవుతుంది. చాలా కారణాల వల్ల వివాహం జరగదు. జాతకం వల్ల కూడా పెళ్లి ఆలస్యం అవుతుంది. వివాహం సంబంధిత దోషాల వల్ల కూడా కల్యాణం యోగం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది. దోషాలు ఉన్న వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం జరగదు. ఏదో ఒక కారణం వల్ల పెళ్లి సంబంధం ఖాయం అవదు. ఇలాంటి సందర్భంలోనే కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు నిపుణులు. పెళ్లి కాకుండా ఇబ్బంది పడే వారు ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శివపార్వతులకు పూజ
వివాహం ఆలస్యం అవుతుందని, వయస్సు పైబడుతున్నా పెళ్లి కావడం లేదని ఎవరైతే భావిస్తారో వారు తప్పకుండా ఈ పరిహారం పాటించాలి. ఈ పరిహారం వల్ల త్వరలోనే పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది వచ్చే పెళ్లిళ్ల సీజన్ లోనే వివాహబంధంలోకి అడుగుపెడతారు. ఈ పరిహారంలో భాగంగా.. కుటుంబంలోని చిన్నారులతో శివాలయానికి వెళ్లి శివపార్వతులను పూజించాలి. మహిళలు రాగి పాత్రలో నీటిని నింపి రాత్రి వేళలో మహావిష్ణువు ఫోటో లేదా ప్రతిమ ముందు ముందు ఉంచాలి.
ఆరు ముఖాల రుద్రాక్ష
వివాహ దోషాలు ఉండి పెళ్లి సంబంధం ఖాయం కాకుండా ఇబ్బంది పడే వారు ఈ పరిహారం పాటిస్తే మంచి ఫలితాలు అందుకుంటారు. ఆరు ముఖాలు ఉండే రుద్రాక్షను ధరించడం వల్ల వివాహ దోషం తగ్గిపోయి త్వరలోనే పెళ్లి అవుతుంది. ఆరు ముఖాల రుద్రాక్షను కార్తీకేయుని రూపంగా చూస్తారు.
హనుమంతుని ప్రత్యేక పూజలు
వివాహ సంబంధం ఖాయం కాక సమయానికి పెళ్లి వేడుక జరగక ఇబ్బంది పడే పురుషులకు.. తమ వివాహ కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైతే.. ఈ పరిహారం పాటించాలి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయాలి. స్వామి వారికి సింధూరం సమర్పించాలి. ఇలా కొన్ని మంగళవారాలు చేయడం వల్ల వివాహానికి సంబంధించిన కష్టాలన్నీ తొలగిపోతాయి.
గురువారం రోజున ఇలా చేయాలి
గురువారం రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే శుభ ఫలితాలు వస్తాయి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండాలి. అలాగే అరటి చెట్టును పూజించాలి. గురువారం రోజు పసుపును దానం చేయాలి. బియ్యం పిండిలో బెల్లం, పసుపు, శనగపిండి కలిపి గోవులకు ఆహారంగా తినిపించాలి. ఈ రోజు గురు మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications