Latest Updates
-
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.?
మనలాగా జంతువులు కూడా ఆత్మహత్య చేసుకుంటాయని తెలుసా? ఎలా గుర్తుపట్టాలంటే?
సాధారణంగా మనుషులు ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు మనుషులు మాత్రమే ఆత్మహత్య చేసుకుంటారని మనకు తెలిసిన నిజం. కానీ మనుషుల మాదిరిగానే జంతువులు కూడా ఆత్మహత్య చేసుకుంటాయని పలు కథనాలు వచ్చాయి. అవి కూడా వాటికి బాధ వచ్చినప్పుడు, లేదా అవి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాయని పలు కథనాలు వెలువడ్డాయి. అసలు నిజంగానే జంతులు ఆత్మహత్య చేసుకుంటాయా? దీనిని ధృవీకరించొచ్చా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జంతువులు నిజంగానే ఆత్మహత్య చేసుకుంటాయా?
జంతువులు మానవుల మాదిరిగానే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాయని చెప్పలేం. దానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. ఆత్మహత్య అనేది మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. మనుషుల మాదిరిగా జంతువులకు మానసిక స్థితి లేనందున.. జీవితం గురించి, మరణం గురించి జంతువులు అంత లోతైన అవగాహన కలిగి ఉండకపోవచ్చు. అవగాహన ఉందని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాలు కూడా లేవు.

కానీ కొన్ని సందర్భాల్లో జంతువులు అనూహ్యమైన ప్రవర్తనను ప్రదర్శిస్తాయి, ఉదాహరణకు, అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా తీవ్రమైన బాధను అనుభవిస్తున్నప్పుడు తమను తాము ఒంటరిగా చేసుకోవడం, ఆహారం తీసుకోకపోవడం వంటివి చేస్తుంటాయి. ఇలా జంతువులు ప్రవర్తించినప్పుడు అవి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని అర్ధం చేసుకోవచ్చట.
తమకు తాము దాచుకోవడం..
తీవ్రమైన అనారోగ్యం, బాధ వల్ల జంతువులు తమను తాము దాచుకోవడం, ఆహారం తీసుకోకపోవడం వంటివి చేయడం చాలా సహజం. కొత్త పరిసరాలు, ప్రమాదాలు, లేదా ఇతర జంతువుల భయం వల్ల కూడా జంతువులు అసాధారణంగా ప్రవర్తిస్తాయి. కొన్ని జాతుల జంతువులు తమ సంతానం కోసం ఆహారం వెతకడానికి ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్తుంటాయి. అయితే "డాగ్ సూసైడ్ బ్రిడ్జి" వంటి ప్రదేశాల గురించి మీరు వినే ఉంటారు. ఈ ప్రదేశాల్లో అనేక కుక్కలు దూకి మరణించినట్లు కథనాలు వచ్చాయి. కానీ ఈ సంఘటనలకు అనేక కారణాలు ఉండవచ్చు. బ్రిడ్జి యొక్క నిర్మాణం, పరిసరాలు, కుక్కల శిక్షణ లేకపోవడం వంటివి. కానీ అవి ఆత్మహత్యలే అని నిర్ధారించలేము.
మనుషుల మాదిరిగా జంతువులను అర్ధం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వాటికి భాష లేదు. వాటి ప్రవర్తన ఆధారంగా వాటిని అర్ధం చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. అందుకే జంతువులు ఆత్మహత్య చేసుకుంటాయనే దానికి నిర్ధారణైన సాక్ష్యం లేదు. అయితే, కొన్ని సందర్భాల్లో వాటి ప్రవర్తన ఆత్మహత్యాయత్నంగా అనిపించవచ్చు. ఈ విషయం గురించి మరింత అధ్యయనం చేయడం అవసరం.



Click it and Unblock the Notifications