Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
చంద్రుడిపై కాలు పెడితే ఇలా ఉంటుంది..? ఇక్కడే వుండి అనుభూతి చెందండి..!!
ఈ ప్రపంచంలో అందరూ వెళ్లాలనుకునే చోటు ఏదైనా ఉందంటే అది చంద్రుడనే చెప్పాలి. మీరు ఎప్పుడైనా చంద్రుడిపై ప్రదేశం ఎలా ఉంటుందో ఆలోచించారా? ఒకవేళ ఆలోచించి ఉంటే అక్కడ నేల ఎలా ఉంటుంది ? ఎవరైనా ఉంటారా లేదా తాగడానికి నీరు దొరుకుతుందా లేదా ఇలా ఎన్నో సందేహాలున్నాయి కదా. భూమి నుంచి చంద్రుడి దూరం దాదాపుగా 3,84,400 కిలోమీటర్లు.

భూమి నుంచి చంద్రుడి పైకి చేరుకోవడానికి అమెరికాకు అతి తక్కువ సమయం పట్టింది. కేవలం నాలుగు రోజుల్లో చేరుకున్నారు. అలాగే చంద్రయాన్ ద్వారా చంద్రుడిపైకి వెళితే అక్కడికి చేరుకోవడానికి 40 రోజులు పడుతుంది. అమెరికన్ స్పేస్ షిప్ ద్వారా నాలుగు రోజుల్లో మనం చంద్రుని చేరతాం. చంద్రుడిపై అడుగుపెట్టిన తర్వాత మనకు ముందుగా కనిపించేది చంద్రుని భూమి. మీరు అక్కడ ప్రతి చోట భారీ గుంతను కనుగొంటారు. మీరు చంద్రుని ఉపరితలంపై నిలబడి పైకి చూస్తే అందమైన భూగ్రహం కనిపిస్తుంది. అందులో భూమి కక్ష్యంలో తిరుగుతున్నట్టు. స్పష్టంగా చూడొచ్చు. కానీ అది ఇప్పుడు ఆకాశంలో తన స్థిరత్వాన్ని కొనసాగిస్తోంది. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే ఆరు రెట్లు తక్కువ అంటే భూమిపై మీ బరువు 60 కిలోలు ఉంటే చంద్రుడిపై బరువు 10 కిలోలు మాత్రమే ఉంటుంది. అంటే మీరు చాలా తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై నడుస్తున్నప్పుడు భూమిపైన నడిచినట్టు చంద్రుడిపైన నడవడం సాధ్యం కాలేదు. కాబట్టి అతను దూకి నడిచాడు అంటే గెంతుతూ వెళ్లారు అనమాట. కొంచెం నడిచిన తర్వాత చుట్టూ చూసే సరికి చాల చెత్త పేపర్లు పాడిన సాటిలైట్ పార్ట్స్ బ్యాగ్లు చాలా కనిపిస్తాయి.
ఈ చెత్త అంతా మన సృష్టించింది. వ్యోమగాములు చంద్రుడిపై చెత్త మరియు ఈ కాగితాలను విసిరేశారు. చంద్రుని తక్కువ గురుత్వాకర్షణ కారణంగా దానికి వాతావరణం ఉండదు. ఇది లేకపోవడంతో అక్కడ నివసించే ప్రజలు మూకుమ్మడిగా చనిపోయే ప్రమాదం ఉంది. సూర్యుడి తర్వాత ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా ఏదైనా వస్తువు ఉందంటే అది చంద్రుడి పైనుంచి మన భూమి మాత్రమే. భూమి నుంచి ఆకాశాన్ని చూసినప్పుడు మనకు నీలం రంగు కనిపిస్తుంది. కానీ చంద్రుడి నుంచి ఆకాశాన్ని చూసినప్పుడు మనకు నీలం కాదు నలుపు రంగు కనిపిస్తుంది. ఒకవేళ చంద్రుడిపై నిలబడ్డప్పుడు మీకు చాలా బోరింగ్. మీరు చంద్రుడిపై నుంచి ఎంత గట్టిగా అరిచినా మీ నోటి నుంచి ఒక్క మాట కూడా బయటకు రాదు. భూమిపై ప్రతిచోటా గాలి ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ చంద్రుని భూ వాతావరణంలో అలా ఉండదు. అందువల్ల ధ్వని తరంగాల ప్రసారం సాధారణంగా అక్కడ సాధ్యం కాదు. ఆస్ట్రోనౌట్స్ చంద్రుడిపై స్పేస్ సూట్లో నివసిస్తుంటారు. దీంతో ఆక్సిజన్ మరియు నైట్రోజన్ ప్రవేశపెట్టడం ద్వారా కృత్రిమంగా వాతావరణ పీడనం సృష్టించబడుతుంది. అందుకే సూటు వేసుకుని మాట్లాడుకోవచ్చు. అంతే కాకుండా దాంట్లో అమర్చిన మైక్రోఫోన్ సాయంతో మీరు మీ సందేశాన్ని ఇతర వ్యక్తులతో పంచుకోవచ్చు. ఈ విధంగా చంద్రుడిపై టెలిఫోన్ పనిచేయడంలో సమస్య లేదు.
భూమిపై ఒక రోజు చంద్రుడిపై 14 లూనార్‌డేస్‌తో సమానంగా ఉంటుంది. రాత్రి కూడా ఎక్కువ సమయం పాటు ఉంటుంది. అంటే చంద్రుడి ఉపరితలం పై ఉన్న వస్తువులపై రాత్రి మరియు పగలు గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. రాత్రి సమయంలో చంద్రుని ఉష్ణోగ్రత దాదాపు -153 డిగ్రీలకు పడిపోతుంది. అయితే చంద్రుడు పగటిపూట ఉష్ణోగ్రత 150 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది. అప్పుడు చంద్రుని వివిధ భాగాలు కూడా భిన్నంగా ఉంటాయి. సహజంగా చంద్రుని దక్షిణ ధ్రువం చల్లగా ఉంటుందని నమ్ముతారు. అంటే రాత్రిపూట చాలా చలిగా ఉంటుంది.
శాస్త్రవేత్తలు చెప్పిన దాన్ని విశ్వసిస్తే చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఉష్ణోగ్రత పగటి పూట కూడా వేడిగా ఉండదు. కానీ రాత్రి చాలా చల్లగా ఉంటుంది. సమయం గడిచేకొద్దీ ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. మంచు పేరుకుపోతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో జీవ పరిస్థితులను మరింత భయంకరంగా మారుస్తుంది. ఈ భయంకరమైన పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు చంద్రుడి వరకు చేరిన మిషన్లు ఉత్తరదిశ ప్రాంతాల్లోనే జరిగాయి. రాత్రి పూట చంద్రుడు ప్రకాశించడం చూస్తుంటాం.. కానీ చంద్రుడికి దాని స్వంత కాంతి లేదని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రుడిపై కనిపించే కాంతి సూర్యుడి నుంచి వచ్చే కాంతిని ప్రతిబింబిస్తుంది. చంద్రుని ధ్రువాలపై సూర్యకాంతి ఎప్పుడు చేరని అనేక ప్రాంతాలున్నాయి. అంటే మీరు తిరుగుతూ చంద్రుని పై ఆ ప్రాంతాలు చేరుకుంటే అక్కడ దృశ్యాలు చాలా భయంకరంగా ఉంటాయన్నమాట. భూమి లాగా చంద్రుడిపై రుతువులు మారవని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ చంద్రుడి కారణంగా భూమిపై రుతువులు మారుతూ ఉంటాయి.
చంద్రుడి గురించి ఇంకా చాలా విషయాలను మీకు రాబోయే రోజుల్లో అందుబాటులోకి తీసుకొని వస్తాము. ప్రస్తుతం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయ్. చంద్రుడిపై 2050 వదరకు చేరుకోగలుగుతామని అంటున్నారు. ఆ సమయానికి సామాన్య మానవులు కూడా చంద్రుడిపై పిక్‌నిక్‌లా వెళ్లి రావొచ్చన్నమాట.



Click it and Unblock the Notifications