Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ప్రేమకు గుర్తుగా హార్ట్ సింబల్ ఎలా వచ్చిందో తెలుసా?
ప్రేమకు చిహ్నంగా హార్ట్ సింబల్ చూపిస్తూ ఉంటాము. రెండు హాఫ్ సర్కిల్స్, కిందివైపు వీ ఆకారాన్ని జోడించి ఉంచితే సరి ప్రేమకు చిహ్నమైన హార్ట్ సింబల్ సిద్దమైపోతుంది. అయితే ప్రేమకు గుర్తుగా గుండె ఆకారంలో ఉండని ఆ చిహ్నానికి ఆ రూపం ఎలా వచ్చింది? ఎందుకు ఆ రూపాన్ని ఎందుకు ప్రేమకు చిహ్నంగా ఉపయోగిస్తున్నారు అనేది ఈ కథనంలో పూర్తిగా వివరించాము.
ప్రేమకు చిహ్నంగా హార్ట్ సింబాల్ ఎలా వచ్చిందంటే?
గ్రీకు నగరమైన సిరీన్ సమీపంలో ఉత్తర ఆఫ్రికా తీరప్రాంతంలో గుండె ఆకారంలో ఉండే సిల్ఫియం అనే పెద్ద ఫెన్నెల్ జాతి మొక్క పెరుగుతుంది. ఇది గుండె ఆకారంలో ఉంటుంది. ఈ మొక్కను పురాతన గ్రీకులు, రోమన్లు సువాసనగల మసాలాగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ప్రత్యేకించి గర్భనిరోధక ఔషధంగా ఉపయోగించారు. కాబట్టి స్పష్టంగా దీని కారణంగా ఇది సెక్స్, ప్రేమతో ముడిపడి ఉంటుంది. కాబట్టి దీనిని ప్రేమకు చిహ్నంగా ఉపయోగిస్తారు.

పిల్లర్ నుంచి ఉద్భవించింది
1250లలో రొమాన్స్ డి లా పోయిర్(రొమాన్స్ ఆఫ్ ది పియర్) అని పిలవబడే ఫ్రెంచ్ రొమాన్స్‌లో గుండె చిహ్నం కనిపించింది. ఆ పిల్లర్ తల కిందులుగా ఉండడంతో.. దానిని హృదయ చిహ్నంగా భావించి, ప్రేమకు చిహ్నంగా మార్చేశారు.
మధ్యయుగ కళలు: 1300వ సంవత్సరంలో మధ్యయుగ కళలు బాగా ప్రాచుర్యం పొందేవి. ఆ కళలన్నీ గుండె ఆకారంలో ఉండేవి. చిత్రాలు అయినా, శిల్పాలు అయినా గుండె ఆకారంలోనే కనిపించేవి. మరీ ముఖ్యంగా ఇటాలియన్ చిత్రకారుడు జియోట్టో పనుల్లో ఇది స్పష్టంగా కనిపించేది.
ఆ ఆకారాలను మానవ ప్రేమకు, భావోద్వేగాలకు గుర్తుగా సూచించేవారు. క్రమంగా అది ప్రేమకు గుర్తుగా మారింది. ఇలా ప్రేమకు హార్ట్ సింబల్ రావడంలో మధ్యయుగ కళలు బాగా ఉపయోగపడ్డాయని చెప్పుకోవచ్చు.
పురాతన వర్ణనాలు: పియరీ విన్‌కెన్ మరియు మార్టిన్ కెంప్ వంటి పండితులు.. గాలెన్ మరియు అరిస్టాటిల్‌ల పురాతన వర్ణనల నుండి గుండె చిహ్నం ఉద్భవించిందని సూచిస్తున్నారు. వీరు మానవ హృదయాన్ని ఒక చిన్న కేంద్రంగా తీసుకొని, డెంట్‌తో మూడు గదులు కలిగి ఉన్నట్లు చిత్రీకరించారు. అది ప్రేమకు చిహ్నంగా పిలిచారు. దీంతో ప్రేమకు చిహ్నంగా గుండె ఆకారం వచ్చిందనే పుకారు ఉంది.
ప్రేమకు చిహ్నంగా గుండె ఆకారం ఏ విధంగా వచ్చినప్పటికీ, మనలో సోదర భావాలను, ప్రేమను వ్యక్తపరిచేందుకు ఆ గుర్తును వినియోగిస్తున్నారు. చిన్నప్పటి నుంచీ మరణించేవరకు ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులపై లేదా, తమ స్నేహితులపై తమకున్న ఇష్టాన్ని తెలిపేందుకు దానిని వాడుతున్నారు. ఇకపై వాడతారు కూడా.
గమనిక: ఈ స్టోరీలో మేము పొందుపరచిన అంశాలన్నీ ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. మేము ఇచ్చిన అంశాలన్నీ కచ్చితమైనవని మేము గుర్తించడం లేదు.



Click it and Unblock the Notifications