Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
కోడి పొద్దునే ఎందుకు కూస్తుంది?.. దీనికి కారణం ఏంటో తెలుసా?
తెల్లవారు జామునే ఎవరూ లేవకముందే కోడి కూస్తుంది. ఇది సర్వ సాధారణమైన విషయం. కానీ తెల్లవారుజామునే కోడి ఎందుకు కూస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? రోజంతా వదిలేసినా.. గంట కొట్టినట్టే తెల్లవారు జామునే కోడి ఎందుకు కూస్తుంది, దానికి గల కారణం ఏంటి? పెద్దవాళ్ళు దీని గురించి ఏం చెప్పారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కోడి ఎందుకు తెల్లవారుజామున కూస్తుందంటే?
నిజానికి కోడి శరీరంలో జీవ గడియారం ఉంటుంది. దీనిని సిర్కాడియన్ రిథమ్ అని అంటారు. ఈ గడియారం మన గడియారం మాదిరిగానే 24 గంటలు పని చేస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి సున్నితమైన కాంతి ప్రకాశించే సమయంలో ఈ గడియారం చురుగ్గా పని చేస్తుందట.

కోడి కళ్ళు చాలా సున్నితమైనవి. ఇవి చిన్న చిన్న కదలికలను, సున్నితమైన కాంతిని కూడా వెంటనే పసిగడుతుంది. ఎప్పుడైతే సూర్యుడి కాంతి ప్రకాశించే సమయం అవుతుందని వాటికి సంకేతం వస్తుందో.. ఆ కాళ్ళు వెంటనే కోడి మెదడుకు సమాచారం పంపిస్తాయట. దీంతో కోడి సమయం అయ్యింది అని కూస్తుందని సైన్స్ చెబుతోంది.
ఇది మాత్రమే కాదు..
పైన పేర్కొనబడిన ఉదాహరణ మాత్రమే కాదు. కోడి కూయడానికి కూడా ఇంకో కారణం ఉంటుందట. సాధారణంగా మహిళలను ఆకర్షించడానికి కూడా కోళ్లు కూస్తాయట. కోళ్లు కూయడం వల్ల మహిళలు వాటికి ఆకర్షితులై వాటిని దగ్గరకు తీసుకుంటారని కోళ్లు నమ్ముతాయట. అందుకే మహిళలు వాటి పక్కనుంచి పోయినప్పుడు అవి అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాయని చెబుతున్నారు.
శతాబ్దాలుగా కోళ్లను కోయడం అనేది కాలానికి చిహ్నంగా పేర్కొంటూ ఉంటారు. రైతులు, ఇతర వ్యక్తులు, కూలీలకు పోయే వాళ్ళ కోసం కోడి రోజూ కూస్తుందట. వారి వద్ద సమయం చూసుకోవడానికి గడియారం లేకపోవడంతో వారికి సమయం తెలిపేందుకు కోడి కూస్తుందని అనాదిగా వస్తున్న ప్రచారం. ప్రస్తుతం ప్రపంచ జీవన చక్రంలో కోడి కూయడం సమయాన్ని తెలియజేయడం అనేది సాధారణమైన చర్య. ఇది కాలంతో పాటు సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి సూచనలను తెలియజేస్తూ ఉంటుంది. అలాగే ఇతర జంతువుల ప్రవర్తనను కూడా ఈ కోడి కూత ప్రభావితం చేస్తుందట.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించినబండింది. ఇవి కచ్చితమైనవని మేము నిర్ధారించడం లేదు. వీటిని విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. అత్యంత ప్రముఖమైన వెబ్‌సైట్‌గా మేము సమాచారాన్ని అందిస్తున్నాము. విశ్వసించడం, వాటిని పాటించడం మా చేతుల్లో లేదు. అందుకే మీరు దేన్నైనా నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు పరిశీలన చేసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications