Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అనంత్ అంబానీ పెళ్లి ఖర్చెంతో తెలిస్తే షాక్ కావాల్సిందే..!
అనంత్ అంబానీ పెళ్లి ఖర్చులు తెలిస్తే షాక్ కావాల్సిందే. అయితే ఒక పక్క కొడుకు కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న అంబానీ జియో రీచార్జ్ రేట్లను ఇటీవల 25 శాతం పెంచారు. మనకు అంబానీ పెళ్లికి బాగా ఖర్చు చేస్తున్నాడని అనిపించినా ఆ డబ్బంతా తిరిగి మన జేబు నుంచే వెళ్తోంది. అనంత్ అంబానీ పెళ్లి ఖర్చులు సుమారు 4 నుంచి 5 వేల కోట్ల రూపాయల వరకు వుంటుందని అంటున్నారు.

ప్రీ వెడ్డంగ్ సెలబ్రేషన్స్‌కు అంబానీ 1200ల కోట్ల రూపాయలను ఖర్చు చేశాడని చెబుతున్నారు. ఈ వేడుకకు 65 మంది ఛెఫ్‌లు కలిసి 2500ల రకాల వంటకాలను వండారు. మూడు రోజులపాటు ఈ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్లు జరిగాయ్. బ్రేక్ ఫాస్ట్‌లోనే 75 రకాల వంటకాలున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. మద్యాహ్నం లంచ్‌లో 225 రకాల వంటకాలు, డిన్నర్‌లో 275 రకాల వంటలు వున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఈ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్లకు ఎమ్మెస్ దోని, అమితాబ్ బచ్చన్, కరీనా కపూర్, రన్వీర్ సింగ్, దీపికా పదుకోన్, రాణీ ముఖర్జీ, ఆలియా భట్, ఝాన్వీ కపూర్, ఇంకా ఎందరో క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్లు హాజరయ్యారు. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ కూడా హాజరయ్యాడు. ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లో రిహన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాప్ సింగర్ రిహన్నా కోసం 74 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ను ఇచ్చారు. ఈమెతో పాటు శ్రేయా ఘోషాల్, దిల్జీత్ సింగ్, ఇలా ఎందరో సింగర్లు వచ్చారు.

ఇక అనంత్ అంబానీ పెళ్లి కార్డు ఇన్విటేషన్ కూడా బాగా వైరల్‌గా మారింది. ఈ ఇన్విటేషన్ కార్డులో వెండి, బంగారుతో చేసిన దేవుడి విగ్రహాలు వున్నట్లు తెలిసింది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెషన్ సెంటర్‌లో అంబానీ పెళ్లివేడుకలు జరుగనున్నాయ్. మొత్తం 1000 మంది అతిథులు ఈ పెళ్లివేడుకకు హాజరుకానున్నారు.
అయితే ప్రస్తుం అంబానీ ఖర్చు చేస్తుంది చాలా తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. అంబానీకి వున్న ఆస్థుల విలువతో పోలిస్తే ప్రస్తుతం అనంత్ అంబానీకి చేస్తున్న ఖర్చులు చాలా తక్కువని అంటున్నారు. భారతీయ హిందువులు తమ జీవిత కాలంలో ఆదాచేసుకున్న డబ్బులో 20 శాతం పెళ్లి కోసం ఖర్చు చేస్తారు. 60 శాతం మంది భారతీయులు పెళ్లి చేయడానికి బ్యాంకులు, ఇతర వాటి నుంచి అప్పులు తీసుకుంటారని లెక్కలు చెబుతున్నాయ్. మళ్లీ తీసుకున్న అప్పుకు వడ్డీ 11 నుంచి 45 శాతం కట్టాల్సి వస్తుంది.
ప్రస్తుతం అంబానీ ఖర్చు చేస్తుంది మొత్తం 5వలే కోట్లని అనుకున్నా అంబానీ ఆస్థుల విలువ 9 లక్షల కోట్లుగా వుంది. ఈ మొత్తం విలువలో 5వేల కోట్లు ఎంత శాతం వుంటుందో మనకు తెలిసిందే. ప్రీ వెడ్డింగ్ ఖర్చు కోసం 1200 కోట్లను ఖర్చు చేసినా అది మొత్తం 0.13 శాతం మాత్రమే. రాధికా మర్చెంట్ డబ్బుల కోసం మాత్రమే అనంత్ అంబానీని పెళ్లి చేసుకుంటుందని అనేక రూమర్లు వ్యాపిస్తున్నాయ్. అయితే వీటిలో ఏమాత్రం నిజం లేదని అంటున్నారు. రాధికా మర్చంట్ తండ్రి విరేన్ మర్చంట్‌కు సంబంధించిన ఎన్‌కోర్ హెల్త్ కేర్ టర్నోవర్ 755 కోట్లు వుంటుంది. ఇవి కాకుండా వీళ్లకు ఇంకా అనేక రకాల న్యాచురల్ పాలిమర్ ప్రైవేట్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు వున్నాయ్.
రాధికా మర్చంట్, అనంత్ అంబానీ చిన్న వయసు నుంచే మంచి స్నేహితులు. గతంలో ఎన్నో వేడుకల్లో రాధికా మర్చంట్, అనంత్ అంబానీ కలిసి కనిపించారు. వీళ్లు గత కొన్నేళ్ల నుంచి డేటింగ్‌లో వున్నట్లు కూడా వార్తలు బయటకు వచ్చాయ్.



Click it and Unblock the Notifications