Latest Updates
-
మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? ఈ 7 వాస్తు & ఆధ్యాత్మిక మార్గాలు సకారాత్మక శక్తిని పెంచుతాయట! -
పనీర్, కాలీఫ్లవర్‌తో ఇలా కుర్మా చేశారంటే.. నాన్‌వెజ్ కూడా దిగదుడుపే.! -
ప్రతి మహిళ ఏడాదికోసారి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే.. లేదంటే.? -
ప్రేమిస్తున్నారు కానీ పోతారేమోనని భయం ఆ భయమే బంధాన్ని ఎలా పాడుచేస్తోందో తెలుసా? -
మ్యాంగోతో జ్యూస్‌లే కాదు.. ఇలా స్వీట్లు చేశారంటే ఆ రుచి జన్మలో మరిచిపోలేరు.! -
అత్త మెచ్చిన కోడలిగా ఉండాలంటే.. ఈ ఐదు లక్షణాలు తప్పనిసరి.! -
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్రకృతి స్ఫూర్తితో భవిష్యత్తు కోసం ఒక్కటవుదాం.! -
ఎండదెబ్బతో పెదవులకి ఫీవర్.. సాఫ్ట్‌గా, గులాబీ రంగులోకి మారాలంటే ఇలా చేయండి.! -
రామ్ చరణ్ భార్య ఉపాసన ఫేవరెట్ ఫుడ్ ఇదే..ఈ హెల్తీ ఫుడ్ ని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పోషకాల గని.. గోదావరి జిల్లాల స్పెషల్ ‘తోటకూర కాడల పులుసు’.. ఎలా చేయాలంటే.!
జిలేబీని ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా..
మనదేశంలో స్వీట్ లేదా తీపి అనగానే చాలామందికి ఫస్ట్ గుర్తుకొచ్చేది జిలేబీ. భారతీయ మిఠాయిల ప్రపంచంలో జిలేబీకి ఒక ప్రత్యేకమైన, శాశ్వతమైన స్థానం ఉంది. పండగలొచ్చినా, పెళ్లిళ్లైనా లేదా ఏ చిన్న సంతోషానికైనా మనకు గుర్తొచ్చే మొదటి స్వీట్ అయిన జిలేబీ..సుడులు తిరిగిన బంగారు వర్ణపు ఆకారం, నోరూరించే తీపి రుచి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ కట్టిపడేస్తుంది. బయట కరకరలాడుతూ, లోపల రసభరితంగా ఉండే ఈ అద్భుతమైన మిఠాయి ఇతర స్వీట్లకు భిన్నంగా తన ప్రత్యేకతను చాటుకుంటుంది. దీనిని ఇంగ్లీషులో స్వీట్ ప్రెట్జెల్(sweet pretzel) లేదా కాయిల్డ్ ఫన్నెల్ కేక్(coiled funnel cake) అని పిలిచినప్పటికీ..జిలేబీ అనే పేరులో ఉన్న ఆత్మీయత మరెక్కడా దొరకదు.
ఒక కళాత్మక ప్రక్రియ
జిలేబీ తయారీ చూడటానికి ఒక కళలా ఉంటుంది. మైదా పిండిని పులియబెట్టడం కోసం కొన్నిసార్లు పెరుగుతో కలిపి, మృదువైన జారుడు పిండిని సిద్ధం చేస్తారు. ఆ పిండిని ఒక ప్రత్యేకమైన గుడ్డ లేదా సీసా సహాయంతో మరిగే నూనెలో లేదా స్వచ్ఛమైన నెయ్యిలో కళాత్మకంగా సుడులు తిప్పుతూ వేస్తారు. బంగారు రంగులోకి మారి కరకరలాడే వరకు వేయించిన తర్వాత వాటిని నేరుగా గోరువెచ్చని చక్కెర పాకంలో ముంచుతారు. ఆ పాకం జిలేబీలోకి ఇంకిపోయి దానికి మెరుపును, తియ్యదనాన్ని అందిస్తుంది. ఈ ప్రత్యేకమైన వంట పద్ధతే జిలేబీకి దాని అద్వితీయమైన రుచిని, రూపాన్ని అందిస్తుంది.

రుచిలో రారాజు
జిలేబీని కొరకగానే ముందుగా దాని కరకరలాడే పొర తగులుతుంది. ఆ తర్వాత లోపల దాగి ఉన్న తీపి పాకం నోరంతా వ్యాపించి ఒక మధురమైన అనుభూతినిస్తుంది. వేడివేడిగా తింటే దాని రుచి రెట్టింపు అవుతుంది. కొన్ని ప్రాంతాలలో జిలేబీని చిక్కటి పాలతో చేసిన రబ్రీతో కలిపి తింటారు. ఈ రెండింటి కలయిక స్వర్గాన్ని తలపిస్తుంది. కరకరలాడే ఆకృతి, పాకం తీపి కలగలిసి జిలేబీని అన్ని వయసుల వారికి ఇష్టమైన స్వీట్‌గా మార్చాయి.
సంస్కృతిలో భాగమైన జిలేబీ
భారతదేశంలో జిలేబీ కేవలం ఒక డెజర్ట్ మాత్రమే కాదు అది మన సంస్కృతిలో ఒక భాగం. దీపావళి, హోలీ, ఈద్ వంటి పండుగలకు జిలేబీ లేనిదే సంబరం పూర్తికాదు. కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో ముఖ్యంగా యూపీ, మధ్యప్రదేశ్, యూపీ వంటి రాష్ట్రాల్లో ఉదయాన్నే అల్పాహారంగా పోహా లేదా సమోసాలతో పాటు వేడివేడి జిలేబీలను తినడం ఒక సంప్రదాయం. వీధి దుకాణాలలో ఉదయం, సాయంత్రం వేళల్లో వేడివేడి జిలేబీలు అమ్ముతుండటం మనకు తరచుగా కనిపించే దృశ్యం.
జిలేబీ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు
విదేశీ మూలాలు: జిలేబీ మన దేశంలో పుట్టలేదంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇది మధ్యప్రాచ్యం నుండి వచ్చిందని, అక్కడ దీనిని జులాబియా అని పిలిచేవారని నమ్ముతారు. కాలక్రమేణా ఇది భారతీయ వంటకాలలో కలిసిపోయి మనదైపోయింది. అయితే మధ్యప్రదేశ్ సీఎం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జిలేబీ మధ్యప్రదేశ్ లోనే పుట్టిందని అన్నారు.
పాలతో జత: కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా శీతాకాలంలో, వేడి పాలలో జిలేబీని నానబెట్టుకుని తినడం చాలా ఇష్టపడతారు. ఇది వెచ్చదనాన్ని, తీపిని ఒకేసారి అందిస్తుంది.
ప్రపంచ జిలేబీ దినోత్సవం: ఈ తీపికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే ప్రతి సంవత్సరం జూలై 30న ప్రపంచ జిలేబీ దినోత్సవం జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications