Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
అంబానీలా ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా,ఎవరూ చెప్పని సీక్రెట్స్
ధనవంతులు అవ్వాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. తమకు తాము ధనవంతులుగా ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ అనుకుంటూ ఉంటారు. అందుకోసం దేనికైనా సిద్ధపడతారు. ఎలాంటి పని చేయడానికైనా ఒకే అంటారు. కానీ కొంతమంది ఎంత కస్టపడి పని చేసినా, ఎన్ని డబ్బులు సంపాదించినా వారు ధనవంతులు కాలేరు. ఎందుకంటే వారు చేసే ఖర్చులు అధికంగా ఉంటాయి. అసలు ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పటికే ధనవంతులుగా ఉన్న వారు ఎలాంటి టిప్స్ పాటించారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
స్పష్టమైన లక్ష్యాలు ఏర్పరచుకోవడం:
ధనవంతులు అవ్వాలంటే మీకు ఒక స్పతమైన లక్ష్యం ఉండాలి. మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు? ఎందుకు సంపాదించుకోవాలనుకుంటున్నారు? అనే లక్ష్యాల గురించి మీకు స్పష్టంగా తెలిస్తే, మీరు వాటిని సాధించడానికి ప్రణాళిక వేసుకోవచ్చు.

ఆదాయాన్ని పెంచుకోండి
ధనవంతులు అవ్వాలంటే ముందుగా మీ ఆదాయాన్ని పెంచుకోవాలి. అందుకోసం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, కొత్త ఉద్యోగం వెతకడం లేదా సైడ్ హస్సల్‌ను ప్రారంభించడం వంటివి చేయవచ్చు. వీటి వల్ల అధిక ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది.
ఖర్చులను తగ్గించుకోవడం
చాలా మంది ఎంత సంపాదిస్తున్న వారు ధనవంతులు అవ్వకపోవడానికి ముఖ్యమైన కారణం.. వారు సంపాదిస్తున్నదంతా ఖర్చు చేసేయడం. దీనివల్ల వారి వద్ద అత్యవసర సమయంలో డబ్బులు ఉండవు. దీంతో అప్పులు చేయాల్సి వస్తుంది. క్రమంగా వారు ధనవంతులు అయ్యే సూచనలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ధనవంతులుగా అవ్వాలనుకునే వ్యక్తులు తమ ఖర్చులను నియంత్రిచుకోవాలి.
పెట్టుబడులు పెట్టడం
సంపాదిస్తున్న డబ్బు అంతా అలానే దాచుకోవడం లేదా ఖర్చు పెట్టడం వలన ధనవంతులు అవ్వాలనే కోరిక నెరవేరదు. ధనవంతులు అవ్వాలంటే కచ్చితంగా ఆ డబ్బును కొన్ని మంచి మార్గాల్లో, మంచి ప్రదేశాల్లో పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడులు కాలంతో పాటు అధిక డబ్బులను అందిస్తాయి. దీనివల్ల మీరు డబ్బు వెంట పడడం మానేసి, డబ్బు మీ వెంట పడడం మొదలుపెడుతుంది.
ఆర్థికంగా తెలివిగా..
ధనవంతులు అవ్వాలంటే ఆర్థికపరమైన విషయాలపై స్పష్టమైన అవగాహనా కలిగి ఉండాలి. ఆర్థిక నిర్వహణ, పెట్టుబడులు, రుణాలు మొదలైన వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇవన్నీ తెలియకుండా డబ్బులు పెట్టుబడులు పెట్టినా, లేదా డబ్బులు అలాగే ఉంచుకున్న నష్టపోవడం ఖాయం. అందుకే ఆర్థికంగా చాలా తెలివిగా ఉండాలి.
పట్టుదల, అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం..
ధనవంతులు అవ్వాలంటే అలా అనుకుంటే సరిపోదు. అందుకోసం పట్టుదల ఉండాలి. ఎలాగైనా ధనవంతులు అవ్వాలంటే కసి ఉండాలి. ఆ కసితోనే పని చేయాలి. అలాగే మీరు అనుకుంటున్న లక్ష్యాలను సాధించేందుకు కస్టపడి పని చేయాలి. అలాగే ఈ క్రమంలో ఎలాంటి అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ధనవంతులు అయ్యేందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే కచ్చితంగా ధనవంతులు అవుతారు. ఇప్పుడు ధనవంతులుగా ఉన్న వ్యక్తులు కూడా దీనినే ఫాలో అయ్యేవారు.



Click it and Unblock the Notifications