Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పేరుకే బుజ్జి, కల్కి సినిమాలో ప్రభాస్ తో సమానంగా మార్కులు కొట్టేసిన బుజ్జి
ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా భారతదేశ సినీ చరిత్ర గత రికార్డులను తిరగరాయడానికి సిద్దం అవుతోంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దీశాపటాని, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, పశుపతి, శోభన, స్వాస్థ చటర్జీ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు నటించారు.
పాన్ ఇండియా సినిమాగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రముఖ తారాగణం నటించిన కల్కి సినిమాలో బుజ్జి అనే వాహనం (కారు) కీలకమైయ్యింది. మొదటి నుంచి కల్కి సినిమా బృందం బుజ్జి వాహనం గురించి గొప్పగా చెబుతోంది. ఇప్పటికే కల్కి సినిమా ప్రమోషన్స్ కోసం బుజ్జి వాహనం హైదరాబాద్ తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్తో తిప్పుతూ కల్కి సినిమా ప్రమోషన్స్ విజయవంతం చేశారు. బుజ్జి వాహనం తయారు చెయ్యడానికి దాదాపు రూ 4 కోట్ల వరకు ఖర్చు అయ్యిందని తెలిసింది.

ఇప్పటికే మహీంద్రా గ్రూప్స్ అదినేత ఆనంద్ మహీంధ్రా స్వయంగా బుజ్జి వాహనం నడిపారు. బుజ్జి మీట్స్ ఆనంద్ మహీంధ్రా అంటూ కల్కి చిత్ర యూనిట్ ఆనంద్ మహీంధ్రాతో కలిసి ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో అవి వైరల్ అయ్యాయి. కల్కి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్, ఆయన టీమ్ బుజ్జి వాహనం తయారు చేయించడానికి పడిన కష్టం నిజంగా గ్రేట్ అని ఆనంద్ మహీంధ్రా అన్నారు.

బుజ్జి వాహనం తయారు చెయ్యడానికి మా మహీంధ్రా సంస్థ భాగస్వామ్యం కావడం నిజంగా ఆనందంగా ఉందని ఆనంద్ మహీంధ్రా ఇటీవల చెప్పారు. బుజ్జి వాహనం తయారు చేయించడానికి దర్శకుడు నాగ్ అశ్విన్, ఆయన చిత్ర బృందం పడిన కష్టం, వారికి ఇలాంటి వాహనం తయారు చెయ్యాలని వచ్చిన ఆలోచన అద్బుతం అని ఇటీవల ఆనంద్ మహీంధ్రా కల్కి చిత్ర బృందం గురించి చాలా గొప్పగా చెప్పారు.

కల్కి సినిమా కోసం బుజ్జి అనే వాహనాన్ని ఆ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్, ఆయన టీమ్ ప్రత్యేకంగా తయారు చేయించారు. బుజ్జి కారు రూపురేఖలు తయారు చెయ్యడానికి వందల స్కెచ్ లు వేశారు. కారు వాస్తవ రూపం తీసుకురావడానికి ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మహీంధ్రా, తమిళనాడులోని కోయంబత్తూరులోని జయం మోటార్స్ సంస్థ సహకారం తీసుకున్న నాగ అశ్విన్ చివరికి ఆ బుజ్జివాహనం తయారు చేయించారు. బుజ్జి వాహనం తయారు చెయ్యడానికి చెన్నైలోని మహీంధ్రా రిసెర్స్ వ్యాలీ టీమ్ సహాయపడిందని ఇటీవల ఆనంద్ మహీంధ్రా స్వయంగా చెప్పారు.

బుజ్జీ వాహనం తయారు చెయ్యడానికి మహీంధ్రా సంస్థ చాలా సహాయం చేసింది. రెండు మహీంధ్రా ఇ- మోటార్స్ తో బుజ్జి వాహనం నడుస్తుందని ఇటీవల ఆనంద్ మహీంధ్రా తెలిపారు. పురాణాలు, సైన్స్ జోడించి నిర్మించిన కల్కి సినిమాలో బుజ్జి వాహనం చాలా కీలకం అయ్యింది. ఈ బుజ్జ వాహనం స్క్రీన్ మీద కనపడిన వెంటనే ప్రభాస్ అభిమానులతో పాటు సినీ అభిమానులు ఈ వాహనం అద్బుతంగా ఉంది, అమెరికా నుంచి తెచ్చారా ?, జపాన్ నుంచి తెచ్చారా ? అంటూ చర్చించుకుంటున్నారు.



Click it and Unblock the Notifications