Latest Updates
-
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం! -
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే.. -
2026 జూన్ 7: రవి యోగంతో అదృష్టం మీ సొంతం.. ఉదయం 8 గంటల లోపే ఈ పని చేయండి! -
భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే భార్యలు చేయకూడని పనులు!..తలస్నానం చేస్తే.. -
మీ జన్మ నక్షత్రానికి ఏ దేవత అధిపతి తెలుసా? ఏ దేవతను పూజించాలి మీ స్టార్ ఏది? -
జూన్ 7 గ్రహ సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి హెచ్చరిక.. నేటి గ్రహాల ప్రభావం ఇదే! -
మిథునం, సింహం, ధనస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 07 నుండి 13 జూన్ 2026 వరకు -
సింహం, ధనుస్సు, మీన రాశుల వారికి అదృష్ట యోగం.. ఆదివారం మీ జాతకం ఎలా ఉంది? - ఆదివారం, 07 జూన్ 2026 -
ముంబై స్టైల్ మసాలా ప్యాటీస్ పావ్.. వర్షం పడుతుంటే వేడివేడిగా తింటుంటే మస్త్ మజా..! -
శని దేవుడి కటాక్షం: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే!
Currency : సొంత కరెన్సీ లేని దేశం ఏదో తెలుసా!..అక్కడ మన రూపాయే!
ప్రస్తుతం ప్రపంచంలో పవర్ ఫుల్ కరెన్సీ ఏదంటే చాలామంది అమెరికా డాలర్ లేదా బ్రిటన్ పౌండ్ అనుకుంటారు. వాస్తవానికి డాలర్,పౌండ్ కంటే శక్తివంతమైన కెరెన్పీలు చాలానే ఉన్నాయి. కువైట్ దినార్. బహ్రెయిన్ దినార్,ఒమాన్ రియాల్ లు డాలర్,సౌండ్ కంటే పవర్ ఫుల్ కరెన్సీలు. ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా ఉన్నాయి. ఆర్థిక వృద్ధి, రాజకీయ స్థిరత్వం, సహజ వనరులు,ప్రపంచ డిమాండ్ వంటి అంశాలు కరెన్సీ విలువను నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
ప్రపంచంలో చాలా దేశాలు తమ సొంత కరెన్సీని కలిగి ఉన్నాయి.. అయితే కొన్ని దేశాలకు మాత్రం సొంత కరెన్సీ లేదు. ఆ దేశాలు ఇతర దేశాల కరెన్సీలను ఉపయోగిస్తున్నాయి. ఆర్థిక, రాజకీయ, చారిత్రక కారణాల వల్ల ఆ దేశాలు ఇతర దేశాల కరెన్సీలను ఉపయోగిస్తున్నాయి. దీనివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అయితే ఏయే దేశాలకు సొంత కరెన్సీ లేదు,ఎందుకనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

సొంత కరెన్సీ లేని దేశాలివే
-పనామా.. 1903లో కొలంబియా సమాఖ్య నుండి స్వాతంత్ర్యం పొందడానికి అమెరికా సహాయం చేసింది. అప్పటి నుండి పనామా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అమెరికా కరెన్సీ అయిన డాలర్‌పై ఆధారపడి ఉంది.
-నౌరు..ప్రపంచంలోనే అతి చిన్న ద్వీప దేశం. దీని వైశాల్యం కేవలం 8.1 చదరపు మైళ్లు. నౌరు దేశ జనాభా కేవలం 10,000 మాత్రమే. ఈ దేశానికి సొంత రాజధాని,సైన్యం కూడా ఉన్నాయి కానీ సొంత కరెన్సీ మాత్రం లేదు. ఈ దేశం మొదట జర్మనీ ఆధీనంలో ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఆస్ట్రేలియా, ఇతర మిత్రరాజ్యాల దేశాలు దీనిని విముక్తి చేశాయి. అప్పటి నుండి ఆస్ట్రేలియన్ కరెన్సీ అయిన డాలర్ ఇక్కడ చెలామణిలో ఉంది.
-దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా చమురు ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుంది. అయితే 2000లలో చమురు ఉత్పత్తి చాలా తక్కువగా ఉండటం వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఫలితంగా ఇతర దేశాల నుండి అప్పులు తీసుకోవడం వల్ల ఆ దేశ కరెన్సీ క్రమంగా అయిపోయింది. అప్పటి నుండి అమెరికన్ కరెన్సీ అయిన డాలర్ ఈక్వెడార్ లో చెలామణిలో ఉంది.
- ఆఫ్రికా దేశమైన జింబాబ్వే 2009లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. అధిక అప్పుల కారణంగా ఈ దేశం దగ్గర డబ్బు లేకుండా పోయింది. అప్పటి నుండి రాండ్, పౌండ్, రూపాయి, డాలర్, యెన్, యూరో మొదలైన ఇతర దేశాల కరెన్సీలు ఇక్కడ చెలామణిలో ఉన్నాయి.
- 13.8 లక్షల జనాభా మాత్రమే ఉండే ఆసియా దేశమైన తూర్పు తిమోర్ కూడా అమెరికా డాలర్ ను ఉపయోగిస్తుంది.
దీని వల్ల ప్రయోజనాలు,నష్టాలు ఇవే
స్థిరమైన కరెన్సీ విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఇతర దేశాల స్థిరమైన కరెన్సీని ఉపయోగించడం వల్ల ద్రవ్యోల్బణం, మారకపు రేటు అస్థిరతను తగ్గించవచ్చు. ఒకే కరెన్సీని ఉపయోగించడం వల్ల అంతర్జాతీయ వాణిజ్యం సులభమవుతుంది.
సొంత కరెన్సీ లేని దేశాలు తమ ద్రవ్య విధానాన్ని స్వతంత్రంగా అమలు చేయలేవు. ఇతర దేశాల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. సొంత కరెన్సీ లేకపోవడం జాతీయ గుర్తింపును కూడా ప్రభావితం చేస్తుంది.



Click it and Unblock the Notifications