Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
Old ganga of india: "ఓల్డ్ గంగా" అని పిలిచే నది ఎక్కడుందో తెలుసా!..ఎందుకు అలా పిలుస్తారో చూడండి
ప్రపంచంలోని ఏ దేశానికైనా నదులు చాలా ముఖ్యమైనవి. నదులు లేకుంటే తాగునీటికి,వ్యవసాయానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు. సౌదీ అరేబియా,మాల్దీవ్స్,ఖతార్,కువైట్,యూఏఈ సహా 20 దేశాల్లో శాశ్వత సహజ నదులు లేక అక్కడి ప్రజలు ఒక్క లీటర్ వాటర్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. తాగేందుకే నీళ్లు లేకుంటే ఇక వ్యవసాయమనే మాటే ఉండదు.
మనదేశం విషయానికొస్తే నదులకు కొరతే లేదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనదేశంలో అనేక నదులు నిత్యం ప్రవహిస్తూ ఉంటాయి. మనదేశంలోని నదులు కేవలం తాగునీరు లేదా సాగునీటికి మాత్రమే పరిమితం కాదు ప్రజల విశ్వాసం కూడా వీటితో ముడిపడి ఉంది. భారతదేశంలో నదులకు తల్లి హోదా(Mother status) ఉంది. అందుకే ఉదయం, సాయంత్రం నదీ ఘాట్లలో పండితులు హారతి కార్యక్రమం నిర్వహిస్తుండటం చూడవచ్చు.

మనదేశంలో అత్యంత ప్రముఖమైన నది ఏదంటే ఎవరైనా ఖచ్చితంగా గంగానదే(Ganga river) అని ఠక్కున సమాధానం చెప్పేస్తారు. అయితే మనదేశంలో ఓల్డ్ గంగా(Old ganga of india) అని పిలువబడే ఓ నది ఉందని మీకు తెలుసా? ఏ నదిని ఓల్డ్ గంగా అని పిలుస్తారు? ఓల్డ్ గంగా నది ఎందుకంత స్పెషల్ అనే డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.
గంగా నది ప్రాముఖ్యత?
భారతదేశ సంస్కృతి,సమాజం, ఆర్థిక అభివృద్ధిలో గంగా నదికి ముఖ్యమైన విలువ ఉంది. అత్యంత పవిత్రమైన నదిగా,తల్లి హోదాను పొంది మోక్షాన్ని ప్రసాదించే నదిగా గంగానది ప్రసిద్ధి చెందింది. ఈ నది భారతదేశ వ్యవసాయ, జలవిద్యుత్ ప్రాజెక్టులకు ప్రత్యేక సహకారం అందిస్తుంది. పర్యావరణ దృష్ట్యా ఈ నదిలో వివిధ రకాల వృక్షజాలం,జంతుజాలం కనిపిస్తాయి. అంతరించిపోతున్న డాల్ఫిన్లు భారతదేశంలోని బ్రహ్మపుత్ర, గంగా నదుల్లో మాత్రమే కనిపిస్తాయి. పర్యాటక పరంగా కూడా ఈ నది చాలా ముఖ్యమైనది. ప్రజలు పర్యాటకం కోసం దాని ఒడ్డున ఉన్న అనేక ప్రధాన నగరాలను సందర్శిస్తారు.
గంగానది మొత్తం పొడవు ఎంత?
గంగానది మొత్తం పొడవు 2525 కిలోమీటర్లు. ఉత్తరాఖండ్ లో పుట్టి ఉత్తరప్రదేశ్ లో వెయ్యి కిలోమీటర్లకు పైగా ప్రయాణించి బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ మీదుగా ప్రయాణించి చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది భారతదేశం,బంగ్లాదేశ్ సరిహద్దు నది కూడా.
ఏ నదిని పాత గంగ(Old Ganga) అంటారు?
గోదావరి నదిని పాత గంగ లేదా ఓల్డ్ గంగా అని పిలుస్తారు.
పాత గంగ అని ఎందుకు పిలుస్తారు?
గోదావరి నది భారతదేశంలో రెండవ అతిపెద్ద నది. ఈ నది మహారాష్ట్రలోని త్రిబంకేశ్వర్ నుండి ఉద్భవిస్తుంది. ఇక్కడి నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్ గఢ్ లలో ప్రవహిస్తుంది. ఈ నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. కాబట్టి ఈ నదిని పాత గంగ అనే పేరుతో కూడా పిలుస్తారు.



Click it and Unblock the Notifications
