Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
నాజీ పార్టీకి 'స్వస్తిక' సింబల్ నే హిట్లర్ ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా?
ప్రపంచంలోని చాలా దేశాల్లో స్వస్తిక గుర్తుని శుభానికి,అదృష్టానికి చిహ్నంగా పరిగిస్తారు. అనేక మతాలు, సంస్కృతుల్లో వేల సంవత్సరాలుగా స్వస్తిక ముఖ్యమైన చిహ్నంగా కనిపిస్తుంది. స్వస్తిక..హిందూమతంలో చాలా పవిత్రమైన చిహ్నం. మతపరమైన, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. హిందువులు తమ ఇళ్లలో, ఇళ్ల ముందు, పండుగలు, దేవాలయాలలో, వివాహాలు వంటి శుభ సందర్భాలలో స్వస్తికను గీస్తారు. శుభానికి సంకేతంగా భావించే స్వస్తిక గుర్తు అర్థం 20వ శతాబ్దంలో హిట్లర్ కారణంగా మారిపోయింది.
జర్మనీ మాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్స్ నేతృత్వంలోని నాజీ పార్టీ స్వస్తిక గుర్తుని తమ పార్టీ చిహ్నంగా పెట్టుకున్నారు. దీంతో శుభానికి సంకేతంగా అప్పటిదాకా పరిగణించిన స్వస్తిక..జాత్యాంహకారం,ద్వేషం,మారణహోమానికి ప్రాతినిధ్యం వహించే గుర్తుగా మార్చేశారు. నాజీల దుర్వినియోగం కారణంగా రెండో ప్రపంచ యుద్దం తర్వాత ప్రపంచంలో స్వస్తిక ప్రతిష్ఠ పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం అనేక దేశాల్లో దీనిని బహిరంగంగా ప్రదర్శించడం చట్టవిరుద్ధం.

జర్మనీలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న అడాల్ఫ్ హిట్లర్.. తన ఉద్యమానికి, నాజీ పార్టీకి, జర్మనీ ఉజ్వల భవిష్యత్తుకు ప్రాతినిధ్యం వహించే ఒక ప్రత్యేకమైన చిహ్నం కావాలని అనుకున్నారు. అప్పుడే అతని దృష్టి స్వస్తికపై పడింది. అసలు హిట్లర్ కన్ను ఈ స్వస్తికపై ఎందుకు పడింది?
హిట్లర్ దృష్టి అప్పుడే దీనిపై పడింది
జర్మన్ పురావస్తు శాస్త్రవేత్త హెన్రిచ్ ష్లీమాన్ గ్రీకు పురాణాల్లో కనుమరుగైన ట్రాయ్ నగరం కోసం తవ్వకాలు జరుపుతున్నాడు. 1868లో మధ్యధరా సముద్రంలో అన్వేషించడం మొదలుపెట్టాడు. అతని అన్వేషణ టర్కీలోని ఏజియన్ తీరంలో ఉన్న హిసార్లిక్ అనే మర్మమైన దిబ్బకు చేరుకుంది. 1870లలో అక్కడ తవ్వకాలు జరిపిన ష్లీమాన్ వేల సంవత్సరాల నాటి నాగరికతల పొరలను వెలికితీశాడు. ఆ తవ్వకాల్లో ఆభరణాలు, కాంస్య, వెండి, బంగారు నిధులతో పాటు స్వస్తిక చిత్రాలు కూడా బయటపడ్డాయి. ష్లీమాన్ సంచలనాత్మక తవ్వకాల వార్తలు ప్రపంచమంతా వ్యాపించాయి. ఆ తర్వాత స్వస్తిక కూడా వేగంగా ప్రాచుర్యం పొందింది. యూరప్, ఉత్తర అమెరికా ఖండాల్లో అది సర్వసాధారణమైన చిహ్నంగా మారిపోయింది.
స్వస్తిక సుదీర్ఘ చరిత్ర జర్మన్ జాతీయవాదులకు ఒక బలమైన ఆయుధంగా మారింది. వారు ఆర్యులు అనే ఒక పురాతన నుండి వచ్చామనే ఒక వింత సిద్ధాంతాన్ని నమ్మారు. 20వ శతాబ్దంలో ఈ నమ్మకం మరింత ప్రమాదకరంగా మారింది. అది నాజీ పార్టీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్‌ను ఆకర్షించింది. ఒక ఫొటోకి ఉండే శక్తి ఏమిటో హిట్లర్ కు బాగా తెలుసు. అది నాజీ ఆదర్శాలకు చారిత్రక ప్రాముఖ్యతను ఇస్తుందని గ్రహించాడు. జర్మన్లు తెల్లటి ఆర్య జాతి నుండి వచ్చారని, వారికి ఒక గొప్ప చరిత్ర కలిగిన చిహ్నం ఉందని భావించడం అతనికి చాలా ఆకర్షణీయంగా అనిపించింది. అందుకే 1920లో స్వస్తిక, నాజీ పార్టీ అధికారిక చిహ్నంగా మారింది. జెండా రూపకల్పనలో హిట్లర్ స్వయంగా పాల్గొన్నాడు. పాత జర్మన్ సామ్రాజ్య జెండాలో ఎరుపు, తెలుపు, నలుపు రంగులనే ఉపయోగించారు..ఇది జర్మనీ గతాన్ని దాని భవిష్యత్తుతో అనుసంధానించే ఒక మోసపూరిత చర్యగా చాలామంది అభివర్ణించారు. కానీ ఆ రంగులకు కొత్త అర్థాలను ఆపాదించారు. "ఎరుపు రంగులో మనం ఉద్యమ సామాజిక ఆలోచనను, తెలుపు రంగులో జాతీయవాద ఆలోచనను, స్వస్తికలో ఆర్యన్ మనిషి విజయం కోసం పోరాటం లక్ష్యాన్ని చూస్తాము"అని హిట్లర్ తన 1925 నాటి ఆత్మకథ 'మెయిన్ కాంఫ్'లో రాశాడు.
1935 సెప్టెంబర్ 15న న్యూరెంబర్గ్ లో జరిగిన భారీ వార్షిక ర్యాలీ సందర్భంగా ఈ కొత్త డిజైన్‌ను జాతీయ జెండాగా ప్రకటించారు. అదే రోజున జర్మన్లు, యూదుల మధ్య వివాహాలను నిషేధించారు. నాజీ జెండా చెడుతో ముడిపడి ఉంటుందని ఇది శాశ్వతంగా ముద్ర వేసింది. దాని నీడలో భయంకరమైన యుద్ధం చెలరేగింది, దారుణాలు జరిగాయి. హోలోకాస్ట్‌లో దాదాపు 60 లక్షల మంది యూదులు ఊచకోతకు గురయ్యారు.
అసలు స్వస్తిక అంటే ఏమిటి? దాని పుట్టుక ఎక్కడ?
లంబ కోణంలో వంగి ఉన్న చేతులు కలిగిన శిలువ చాలా మందికి అనేక అర్థాలను సూచిస్తుంది. కానీ దాని అసలు ఉద్దేశం ఎల్లప్పుడూ ఆశ, సానుకూలతను పంచడమే. ఇది అదృష్టం లేదా శ్రేయస్సును సూచిస్తుంది. సూర్యుడిని లేదా సృష్టి అనంతాన్ని ప్రతిబింబిస్తుంది. అనేక మతాలలో ఇప్పటికీ చేస్తున్నట్లుగా దైవిక భావాన్ని కలిగిస్తుంది, శుభాన్ని ఆహ్వానిస్తుంది. స్వస్తిక అనే పదం సంస్కృతంలోని స్వస్తిక నుండి వచ్చింది, దీని అర్థం శ్రేయస్సుకు అనుకూలమైనది.
స్వస్తిక చరిత్ర ఎంత పురాతనమైనదో తెలుసా
స్వస్తిక దాదాపు 15,000 సంవత్సరాల నాటిది. 1908లో ఉక్రెయిన్‌లో కనుగొనబడిన ఒక పక్షి ఆకారపు చెక్కిన దంతపు మముత్ దంతంపై స్వస్తికల సంక్లిష్టమైన నమూనా ఉంది. బహుశా అది సంతానోత్పత్తికి చిహ్నంగా ఉపయోగించి ఉండవచ్చు. ఈ డిజైన్ మొదట ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. తూర్పు ఐరోపాలో నియోలిథిక్ కాలంలో దాదాపు 7,000 సంవత్సరాల క్రితం వింకా సంస్కృతి ద్వారా ఒంటరి స్వస్తికలు చెక్కబడ్డాయి. కాంస్య యుగం నుండి అవి విస్తృతంగా వ్యాపించాయి. మెసొపొటేమియన్ నాణేలపై ఒక సాధారణ దృశ్యంగా మారింది. గ్రీస్ లో కుండీలపై, దుస్తులపై కనిపించింది. 1857లో లండన్ లో కనుగొనబడిన ఇనుప యుగం నాటి బాటర్‌సీ షీల్డ్‌పై 27 స్వస్తికలు ఉన్నాయి. కానీ ఆ చిహ్నం క్రీ.పూ. 2,000 నాటికే బ్రిటన్‌లో ఉనికిలో ఉందని యార్క్‌షైర్‌లోని ఇల్క్లీ మూర్‌పై కనిపించే స్వస్తిక రాయి చూపిస్తుంది. ఆ చెక్కడంలో స్వస్తిక ఆకారం ఉన్నప్పటికీ దాని చేతులు ఎక్కువ వంపు తిరిగి ఉంటాయి, అదనపు గుర్తులు ఉంటాయి. తరచుగా గామాడియన్ లేదా ఫైల్‌ఫ్లాట్ అని పిలువబడే స్వస్తిక యూరప్ అంతటా ఉపయోగించబడుతూనే ఉంది. అప్పుడప్పుడు మతపరమైన చిహ్నాలలో కూడా కనిపిస్తుంది.
భారత్ లోనే
స్వస్తికతో అత్యంత శాశ్వతమైన సంబంధం ముఖ్యంగా భారతదేశంలో మొదలైంది. హిందూ మతం, బౌద్ధమతం, జైన మతం అనుచరులకు ఇది వేల సంవత్సరాలుగా పవిత్ర చిహ్నంగా ఉంది. జైనులకు, స్వస్తిక 24 తీర్థంకరులలో ఒకరిని లేదా రక్షకులను సూచిస్తుంది. బౌద్ధులు ఈ చిహ్నాన్ని బుద్ధుని పాదముద్రలుగా భావిస్తారు.
హిందువులకు కుడి చేతి స్వస్తిక సూర్యుడు,శుభానికి సంకేతం. అందుకే ప్రవేశ ద్వారాలు, నైవేద్యాలు, వేడుకలు, పండుగలకి దీనిని ఉపయోగిస్తారు. ఎడమ చేతి స్వస్తిక, సౌవస్తిక, రాత్రి, కాళి దేవతకు ప్రతీక. నాజీలు పాశ్చాత్య దేశాలలో ఈ చిహ్నం పట్ల తెచ్చిన కళంకం ఉన్నప్పటికీ స్వస్తిక నేటికీ ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనది.



Click it and Unblock the Notifications











