Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
దోమలు పగలు ఎందుకు కనబడవో తెలుసా..అది మాత్రం చాలా డేంజర్
దోమలు అంటే చిన్న కీటకాలే వాటి గురించి తెలుసుకునేది ఏముంటదిలో అని లైట్ తీసుకుంటాం. అయితే వాస్తవానికి వీటి గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దోమ కాటు వల్ల 10కి పైగా వ్యాధులు వస్తున్నాయి. వీటిలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా ఉన్నాయి. సాధారణంగా పగటిపూట దోమలు అసలు కనబడవు. రాత్రి సమయాల్లోనే ఎక్కువగా ఉంటాయి. అయితే దీని వెనుక ఉన్న కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా?.
దోమలు పగటిపూట ఎందుకు కనబడవు
దోమలు చీకటిలో ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతాయి. వాస్తవానికి పగటి వెలుగు దోమలకు ఇబ్బంది కలిగిస్తుందట. రాత్రి వేళ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.. ఈ తక్కువ ఉష్ణోగ్రత దోమలకు అనుకూలంగా ఉంటుంది. దీంతో దోమలు చీకటిలో ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతాయి. దోమలు మన శరీర ఉష్ణోగ్రత ద్వారా ఆకర్షితమవుతాయి. మనం నిద్రిస్తున్నప్పుడు శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది కాబట్టి దోమలు రాత్రి సమయంలో మనల్ని ఎక్కువగా కుడతాయి.

ప్రతి రకమైన దోమ ఒకేలా ఉండదు. కొన్ని రకాల దోమలు పగలు కూడా కుడతాయి. డెంగీ దోమలు పగలు ఎక్కువగా కుడతాయి. అయితే పగటిపూట దోమలు కుట్టే అవకాశం ఉన్నప్పటికీ అది చాలా తక్కువగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులు మారినప్పుడు దోమల ప్రవర్తన కూడా మారవచ్చు.
ఈ దోమలు చాలా వ్యాధులను వ్యాపింపజేస్తాయి
దోమలపై ఇప్పటివరకు జరిగిన పరిశోధనల ప్రకారం వ్యాధులు వ్యాప్తి చేసే దోమల విషయానికి వస్తే..ఏడిస్ దోమలు మొదటి స్థానంలో ఉన్నాయని తేలింది. డెంగ్యూ, యెల్లో ఫీవర్, చికున్‌గున్యా వంటి ప్రాణాంతక జ్వరాలు ఈ దోమ ద్వారా వ్యాపిస్తాయి. జికా వైరస్ వ్యాప్తిలో కూడా ఈ దోమ అతిపెద్ద పాత్ర పోషించింది. ఈ దోమలు సాధారణంగా వరద నీటి కొలనులు, చిత్తడి నేలలు, నీటితో నిండిన పాత్రల లోపల కనిపిస్తాయి. ఈ దోమ జాతులు బయట సమృద్ధిగా కనిపించినప్పటికీ అవి పగటిపూట ఇళ్లలోకి ప్రవేశిస్తాయి, సాధారణంగా పగటిపూట ఎక్కువగా కుడతాయి.
దోమలను నివారించాలంటే
ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కిటికీలకు, తలుపులకు దోమ తెరలు వేసుకోవాలి. దోమల నివారణ మందులు,కాయిల్స్ వాడవచ్చు. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి.ఈ చిట్కాలను పాటిస్తే దోమలను నివారించవచ్చు.



Click it and Unblock the Notifications