Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఆపరేషన్ థియేటర్ లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రోగి..పక్క గదిలో నర్సుతో డాక్టర్ రాసలీలలు!
డాక్టర్ ని దేవుడితో సమానంగా చూస్తాం. అందుకే వైద్యో నారాయణో హరి అంటారు. ప్రాణం పోసే దేవుడిగా భావించే డాక్టర్ యముడిగా మారితే? అత్యవసర పరిస్థితుల్లో రోగి ప్రాణాలను కాపాడాల్సిన చేతులే, కామవాంఛతో దారి తప్పితే? వినడానికే అత్యంత జుగుప్సాకరంగా, నమ్మశక్యంగా లేని ఈ భయంకరమైన సంఘటన ఇంగ్లాండ్ లో చోటుచేసుకుంది. ఓ పాకిస్తానీ డాక్టర్ ఆపరేషన్ మధ్యలో రోగిని అపస్మారక స్థితిలో వదిలేసి, పక్క గదిలో నర్సుతో శృంగారంలో పాల్గొన్న దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగింది?
ఇంగ్లాండ్ లోని గ్రేటర్ మాంచెస్టర్ లోని టేమ్‌సైడ్ హాస్పిటల్ లో డాక్టర్ సుహైల్ అంజుమ్ (44) కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్ గా పనిచేస్తున్నాడు. 2023 సెప్టెంబర్ 16న ఒక పేషెంట్ కి పిత్తాశయ ఆపరేషన్ జరుగుతోంది. ఆ రోగిని అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లే కీలక బాధ్యత డాక్టర్ అంజుమ్ దే. రోగికి మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ కి అంతా రెడీ చేశాడు. అయితే అత్యంత కీలకమైన ఆ సమయంలో,అతను ఒక సాకు చెప్పి ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చాడు.

పక్కనే ఖాళీగా ఉన్న మరో ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లి, అక్కడ ఒక నర్సుతో లైంగిక చర్యలో పాల్గొన్నాడు. వారిద్దరూ అభ్యంతరకరమైన స్థితిలో ఉండగా విధుల్లో ఉన్న మరో సహోద్యోగి గమనించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సుమారు 8 నిమిషాల పాటు రోగిని అలా గాలికి వదిలేసి తన కామకలాపాన్ని ముగించుకుని తిరిగి వచ్చాడు.
వెలుగులోకి వచ్చిన నిజం, పశ్చాత్తాపం
ఈ విషయం బయటకు పొక్కడంతో డాక్టర్ అంజుమ్ 2024లో ఉద్యోగం వదిలి తన స్వదేశమైన పాకిస్తాన్ కు పారిపోయాడు. అయితే ఇటీవల తిరిగి వైద్య వృత్తిలో చేరేందుకు అప్లయ్ చేసుకోవడంతో ఈ కేసు ఇంగ్లాండ్ లోని మెడికల్ ట్రిబ్యునల్ ముందు విచారణకు వచ్చింది. అక్కడ డాక్టర్ సుహైల్ అంజుమ్ తప్పును పూర్తిగా అంగీకరించాడు. "నేను చాలా సిగ్గుపడాల్సిన, నీచమైన పని చేశాను. దీనికి బాధ్యుడిని నేనే. నా చర్యల వల్ల రోగికి, నా సహోద్యోగులకు, నన్ను నమ్మిన అందరికీ తీవ్ర నిరాశ కలిగించాను. ఆ నర్సును కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో పడేశాను" అని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తన నిర్లక్ష్యం వల్ల రోగి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ అదృష్టవశాత్తూ ఎలాంటి హానీ జరగలేదని, అయినప్పటికీ తన తప్పుకు క్షమించాలని వేడుకున్నాడు.
ఒత్తిడే కారణమా?
అసలు ఇంతటి దారుణానికి ఎందుకు పాల్పడ్డావని ట్రిబ్యునల్ ప్రశ్నించగా ఆ సమయంలో తాను తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నానని అంజుమ్ వివరించాడు. తన బిడ్డ నెలలు నిండకుండానే పుట్టడం, భార్యకు దూరంగా ఉండటం వంటి వ్యక్తిగత సమస్యల కారణంగా విచక్షణ కోల్పోయి ఈ తప్పు చేశానని వాపోయాడు. వైద్య వృత్తి అంటే తనకు ప్రాణం అని ఇది ఎలా, ఎందుకు జరిగిందో తనకే అర్థం కావడం లేదని.. తనకు మరో అవకాశం ఇస్తే ఇలాంటి పొరపాటు జీవితంలో పునరావృతం కానివ్వను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం డాక్టర్ అంజుమ్ భవితవ్యం మెడికల్ ట్రిబ్యునల్ తీర్పుపై ఆధారపడి ఉంది.



Click it and Unblock the Notifications