Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
రోడ్డుపైనే సీపీఆర్ చేసి.. బాలుడి ప్రాణాలు కాపాడిన డాక్టర్..!
ఒక డాక్టర్ వెంటనే స్పందించడం వల్ల 6 ఏళ్ల బాలుడి ప్రాణాలు కాపాడబడ్డాయ్. ఎలక్ట్రిక్ షాక్‌కు గురైన బాలుడు స్పృహ కోల్పోయాడు. ఏమి చేయాలో తోచని స్థితిలో తండ్రి వుంటే అక్కడి నుంచి వెళ్తున్న వైద్యురాలు దీన్ని గమనించి ఆ బాలుడిని వెంటనే కింద పడుకోబెట్టి సీపీఆర్ చేశారు. దీంతో బాలుడి ప్రాణాలు తిరిగి లేచి వచ్చినట్లైంది. బాలుడు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జరిగిన ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ సీపీఆర్ చేసిన వైద్యురాలికి కృతఘ్నతలు తెలుపుతున్నారు. కొంత మంది వైద్యులు కూడా సోషల్ మీడియాలో స్పందించి సీపీఆర్ ప్రాముఖ్యతను వివరిస్తున్నారు.
సీపీఆర్ చేసిన తరువాత కోలుకున్న బాలుడిని దగ్గరిలోని ఆసుపత్రిలో చేర్చారు. 24 గంటలు అబ్జర్వేషన్‌లో వుంచిన తరువాత బాలుడిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
𝑫𝒐𝒄𝒕𝒐𝒓 𝑷𝒆𝒓𝒇𝒐𝒓𝒎𝒔 𝑪𝑷𝑹 𝒐𝒏 𝒓𝒐𝒂𝒅, 𝒔𝒂𝒗𝒆𝒔 𝒍𝒊𝒇𝒆!
— Sudhakar Udumula (@sudhakarudumula) May 17, 2024
In Vijayawada, a 6-year-old boy faced a life-threatening situation after an accidental electric shock left him unconscious.
A doctor passing by noticed a distressed father carrying his son and immediately… pic.twitter.com/DBlxTxqpNr
కార్డియో పల్మనరీ, రిససిటేషన్ దీన్నే షార్ట్ ఫామ్‌లో సీపీఆర్ అంటాం. గుండె పోటు వల్లో లేక ఎలక్ట్రిక్ షాక్‌వల్లో గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. అప్పుడు వెంటనే ఈ సీపీఆర్ చేయడం వల్ల గుండె కొట్టుకోవడం ప్రారంభమౌతుంది. దీంతో మళ్లీ ఆ మనిషికి పునుర్జన్మగా భావించవచ్చు. మరణించినప్పుడు మాత్రమే గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. అలాంటి ఆగిపోయిన గుండెకు సీపీఆర్ చేసి ప్రాణాలు బ్రతికిస్తే వారు ఆ పేషంట్‌కి తమ చేతులతో ప్రాణాలు తిరిగి ఇచ్చినట్లే.

సీపీఆర్ చేసేప్పుడు సమయం చాలా ముఖ్యం. పేషంట్ సృహకోల్పోయి గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని తెలిసిన కొన్ని సెకన్లలోనే ఈ సీపీఆర్‌ను చేయాలి. అప్పుడు మాత్రమే ప్రాణాలను తిరిగి తీసుకొని రావచ్చు.
సీపీఆర్ ఎలా చేయాలో తెలుసుకుందాం
స్పృహ కోల్పోయిన పేషంట్‌ను వెల్లకిలా పడుకోబెట్టి వారి గుండె కొట్టుకుంటుందా, పల్స్ ఎలా వుందో చెక్ చేయాలి. గుండె ఆగిపోయినట్లు అనిపిస్తే వెంటనే సీపీఆర్ చేయడానికి సిద్ధ పడాలి. రెండు చేతులను పేషంట్ ఛాతిపైకి తీసుకొని చేతులు బెండ్ కాకుండా రెండు చాతి మధ్యలో గట్టిగా ప్రెస్ చేయాలి.
చేతులతో పేషంట్ ఛాతిపై నొక్కినప్పుడు 5 సెంటిమీటర్లు ఛాతిలోపలికి ప్రెస్ అయ్యేలా గట్టిగా బలంగా నొక్కాలి. అలా నిమిషానికి 90 నుంచి 100 సార్ల వరకు ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన పేషంట్ పైకి లేవకుండా అలాగే వుంటే అప్పుడు పేషంట్ ముక్కును మూసి నోటిలో మన నోటితో ఆక్సిజన్ వదిలే ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తూ మళ్లీ సీపీఆర్ చేయాలి.
ఇదే పద్ధతిలో పేషంట్‌కు 20 నిమిషాలపాటు సీపీఆర్ చేస్తే పేషంట్ గుండె తిరిగి కొట్టుకునే అవకాశం వుంది. సీపీఆర్ ఎలా చేయాలో ప్రతీ ఒక్కరూ నేర్చుకుంటే చాలా మంది ప్రాణాలు కాపాడే అవకాశం వుంది. ఆసుపత్రికి తీసుకొని వెళ్లే ముందు ఈ సీపీఆర్ చేయడం వల్ల పేషం తిరిగి లేచి కూర్చునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్.
సీపీఆర్ చేయడం చాలా సులభం. ప్రతి ఒక్కరూ సీపీఆర్‌ను ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రతీ పాఠశాలల్లో ప్రతీ విద్యార్ధికి సీపీఆర్‌ను ప్రాక్టికల్ పాఠాల్లో భాగంగా చేర్చి నేర్పిస్తే మంచి ఫలితం వుంటుంది.



Click it and Unblock the Notifications











