Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మన బాధలను కుక్కలు పసిగడతాయ్.. అవి కూడా బాధపడతాయట.. పరిశోధనల్లో వెల్లడి..!!
మనిషికి ఉన్న మానసిక ఒత్తిడిని కుక్కలు పసిగడతాయని తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో బయటపెట్టారు. మనలో నిరాశను అవి పసిగట్టిన తరువాత వాటిలో కూడా మార్పులు జరుగుతాయని కనుగ్గొన్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన పరిశోధకులు కుక్కలకు మన భావోద్వేగాలకు ఉన్న సంబంధాలపై ఎన్నో ప్రయోగాలు చేశారు.

మనుషుల్లో ఉన్న భావోద్వేగాలన కుక్కలు చాలా త్వరగా పసిగడతాయ్. మనిషి డిప్రెషన్‌లో ఉంటే కుక్క దీన్ని పసిగట్టినప్పుడు అది కూడా భావోద్వేగానికి గురయ్యే అవకాశ ఉందని సీనియర్ రచయిత్రి నికోలా రూపా తెలిపారు. బ్రిస్టల్ విశ్వవిధ్యాలయంలో వీరు జంతువుల మనోభావాలపై పరిశోధనలు చేస్తున్నారు.
మనుషుల్లో ఉండే ముఖవకలికల్లో జరిగే మార్పులను కుక్కలు చాలా త్వరగా పసిగట్టేస్తాయ్. ఈ కారణంగా బాధలో వున్నవారిని కుక్కలు త్వరగా గుర్తించడానికి కారణమవుతుంది. దీన్ని ఒక పరిశోధన ద్వారా కనగ్గొన్నారు. 18 కుక్కలను ముందుగా ఎంపిక చేసుకున్నారు. మొత్తం ముగ్గురి మనుషుల చెమటను కలెక్ట్ చేశారు. ఇందులో ఒకరు చాలా రిలాక్స్ గా వున్న వారి చెమటను తీసుకుంటే మరో ఇద్దరిది చాలా ఒత్తిడితో ఉన్నప్పుడు వచ్చిన చెమటని తీసుకున్నారు.
ఈ మూడు చెమటలను 18 కుక్కలకు వాసన చూపించారు. కుక్కలు తినే ఆహారపు గిన్నెలకు ఆ చెమట అనువులను ఉంచారు. అయితే ఒత్తిడితో ఉన్న చెమట గిన్నెల వద్దకు కుక్కలు రాగానే వాటి హావభావాల్లో ఏదో నిరాశను పరిశోధకులు గుర్తించారు. ఒత్తిడితో వున్న చెమట గిన్నెల దగ్గరికి వెళ్లినప్పుడు కుక్కలు చాలా నిరాశతో, చురుకుదనం కోల్పోయి ఉన్నట్టగా గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి పరిశోధన రిపోర్టును సదరు పరిశోధకులు తయారు చేసి పెట్టారు.
కుక్కలకు ఉన్న వాసన శక్తి మనుషుల కంటే లక్ష వంతులు శక్తివంతమైనది. ఈ గ్రహణ శక్తితో అవి వివిధ రకాల వాసనలను గుర్తించగలవు. కుక్కలు మనుషుల శరీరంలో జరిగే రసాయన మార్పులను, ముఖ్యంగా ఒత్తిడి సమయంలో విడుదల అయ్యే హార్మోన్లను వాసన ద్వారా తెలుసుకుంటాయి.
మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడు, శరీరంలో కోర్టిసోల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ వాసనను కుక్కలు చాలా సులభంగా గుర్తించగలవు. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు, మన శరీరంలో శ్వాసలో రసాయనాలు మారిపోతాయి. కుక్కలు తమ ఘ్రాణశక్తితో ఈ మార్పులను చాలా స్పష్టంగా గ్రహించగలుగుతాయ్. మనము ఒత్తిడిలో ఉన్నప్పుడు, కుక్కలు కూడా ఒత్తిడికి గురవుతాయి. అవి మానసికంగా, శారీరకంగా, భావోద్వేగంగా ప్రభావితమవుతాయి. కుక్కలతో సరదాగా గడపడం ద్వారా, మన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు మరియు అవి కూడా ప్రశాంతంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications