Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
చేతిలో డబ్బులు ఎప్పుడూ డబ్బులు ఉండాలంటే, పర్సులో ఈ వస్తువులు ఉండకూడదు!
ఈ ప్రపంచంలో చాలా డబ్బు సమస్యతో బాధపడుతుంటారు. చేతిలో డబ్బులు నిలవడం లేదని చెబుతుంటారు. అయితే చేతిలో డబ్బులు నిలవకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అలాగే డబ్బు ఉన్న ప్రదేశంలో కొన్ని వస్తువులు పెట్టడం వల్ల కూడా డబ్బులు నిలవకుండా పోయే అవకాశం ఉందని పండిత నిపుణులు చెబుతున్నారు. ఆ వస్తువులు డబ్బుతో పాటు ఉండడం వలన అదృష్టం తీవ్రంగా ప్రభావితం అవుతుందట. డబ్బులు ఒక్కచోట నిలవడానికి ఇష్టపడవట. అయితే డబ్బులతో పాటు ఎలాంటి వస్తువులు ఉంచకూడదు, ఉంచితే ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ధాన్యం
ఇంట్లో ధాన్యం నిల్వ ఉండడం అనేది చాలా మంచిది. కానీ ధాన్యాన్ని డబ్బుతో పాటు ఉంచకూడదు. ఎందుకంటే వాస్తుశాస్త్రం ప్రకారం ఈ వస్తువులు ఆర్ధిక అస్థిరతకు కారణమవుతాయి. దీంతో పాటు డబ్బులు ఇంట్లో నిలవకుండా చేస్తాయి. అందుకే ఇంట్లో డబ్బులతో పాటు ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోకూడదు.

బిల్లులు, అప్పు రసీదులు
సాధారణంగా చాలా మంది డబ్బులు ఉన్న చోటనే బిల్లులు, రసీదులు, అప్పు కాగితాలు వంటివి పెడుతుంటారు. కానీ డబ్బులు ఉండే ప్రదేశంలో వాటిని అస్సలు ఉంచకూడదట. అలా ఉంచడం వలన ఆర్ధిక సమస్యలు ఎక్కువ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. వాస్తు నియమాల ప్రకారం డబ్బులు పరిశుభ్రమైన ప్రదేశంలోనే ఉంచాలని చెబుతున్నారు.
పాత నోట్లు, నాణేలు
డబ్బుల ప్రవాహం తగ్గిపోవడానికి, ఆర్థిక అనిశ్చితి ఏర్పడడానికి డబ్బులు ఉండే ప్రదేశంలో పాత నోట్లు, చెల్లని నాణేలు ఉండడం కూడా ఒక కారణమే. వాస్తు ప్రకారం ఇవి ధన ప్రవాహాన్ని అడ్డుకుంటాయట. అలాగే నిధుల నిల్వలు తక్కువగా ఉన్నాయనే సూచనలు ఇస్తాయట. అందుకే వీటిని డబ్బులు ఉండే ప్రదేశంలో ఉంచకపోవడమే ఉత్తమం.
ఆభరణాలు, పగిలిన గాజులు
విరిగిన ఆభరణాలతో పాటు పగిలిన గాజు వస్తువులు కూడా డబ్బుతో పాటు అస్సలు ఉంచకూడదు. ఇలా ఉంచితే అది మహా దోషంగా పరిగణించబడుతుందట. ఇలాంటి వస్తువులను ఉంచుకోవడం వలన ఆర్ధిక కస్టాలు ఎదురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకే ఈ వస్తువులను డబ్బుతో పాటు అస్సలు ఉంచకండి.
పదునైన వస్తువులు కూడా..
డబ్బులతో పాటు కత్తులు, కటార్లు, బ్లెడ్లు, చాకులు, పెన్నులు, వంటి పదునైన వస్తువులను అస్సలు ఉంచకూడదు. ఇవి ఖర్చులను పెంచడంతో పాటు ఆర్ధిక ఒడిదుడుకులకు కారణమవుతాయి. అలాగే ధనప్రభావాన్ని నిలువరిస్తాయి. అందుకే ఈ వస్తువులను డబ్బుతో పాటు ఉంచుకోకండి. దీనివల్ల ఆర్ధిక అస్థిరత ఏర్పడడడంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. చేతిలో డబ్బులు నిలువ ఉండదు.



Click it and Unblock the Notifications